‘పదవి ఇవ్వని బాబు..ఇఫ్తార్‌ విందు ఇచ్చాడు’ | CPI Leader Ramakrishna Fire on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘పదవి ఇవ్వని బాబు..ఇఫ్తార్‌ విందు ఇచ్చాడు’

Published Thu, Jun 22 2017 7:59 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

‘పదవి ఇవ్వని బాబు..ఇఫ్తార్‌ విందు ఇచ్చాడు’ - Sakshi

‘పదవి ఇవ్వని బాబు..ఇఫ్తార్‌ విందు ఇచ్చాడు’

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. గత మూడేళ్లలో ముస్లిం మైనార్టీలకు తన కేబినెట్‌లో తగిన స్థానం ఎందకుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. మూడేళ్ల పాలనలో ఒక్క మైనార్టీకి  మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి.. నంద్యాల ఎన్నికల కోసం రూ.96 లక్షలు ఖర్చు చేసి మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారని ఆయన విమర్శించారు.

విలేకరులతో మాట్లాడుతూ..తలుచుకుంటే ఓటుకు రూ.5 వేలు పంచగలమని చెప్పడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షలు పంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశాడని ఆరోపించారు. నంద్యాలలో 2014లో వైఎస్ఆర్సీపీ గెలిచింది..ఇప్పుడు ఉప ఎన్నికల్లో టీడీపీ ఎలా పోటీ చేస్తుందని ప్రశ్నించారు. అభద్రతా భావంతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement