
తిరుపతి కల్చరల్: అమరావతి నిర్మాణానికి కేంద్రమే నిధులు మంజూరు చేయాలని చట్టంలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్ర ప్రజలు అప్పులు ఇవ్వాలని కోరడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు. ద్రోహాన్ని ప్రశ్నించే స్థితిలో చంద్రబాబు లేరన్నారు.
రాష్ట్రం లోటు రూ.97 కోట్లు ఉంటే దానిని, రూ.2 లక్షలా 50 వేల కోట్లు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఒక్క అమరావతిలోనే 7 మెడికల్ కళాశాలలు పెట్టడం సరైంది కాదన్నారు. ఈనెల 6 నుంచి 9 వరకు కడపలో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభల్లో చర్చించి ప్రత్నామ్నయ రాజకీయ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా కోసం నేడు, రేపు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ చివరి రోజైన 5న బ్లాక్‌డే పాటిస్తామని తెలిపారు.