‘చంద్రబాబు ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకుని..’ | CPI leader Narayana criticises chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకుని..’

Published Sun, Sep 17 2017 12:45 PM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

‘చంద్రబాబు ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకుని..’

‘చంద్రబాబు ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకుని..’

సాక్షి, అనంతపురం : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అదే ప్రధాని మోదీ అమరావతికి వస్తే విమర్శించడంలో అంతర్యం ఏంటని సీపీఐ సీనియర్ నేత నారాయణ ప్రశ్నించారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి విషయంలో ఏపీ చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతి డిజైన్లలో టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సూచనలు పాటిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్‌కే పరిమితమవుతున్నారని, అయితే ఆ ఊహా ప్రపంచాన్ని విడనాడాలని ఏపీ సీఎంకు నారాయణ సూచించారు.

మన దేశంలో అత్యున్నత స్థాయి నిపుణులున్నా చంద్రబాబు సింగపూర్‌ ఎందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ సాయుధ పోరాటాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో చెప్పాలన్నారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ లొంగిపోయారని నారాయణ ఆరోపించారు.

గరగపర్రు దళితులను పరామర్శించే తీరిక ఏపీ సీఎం చంద్రబాబుకు లేదని సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ విమర్శించారు. 50 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్య చంద్రబాబుకు ఎందుకు పట్టదని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement