రంజాన్ దీక్షలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తోంది.
హైదరాబాద్: రంజాన్ దీక్షలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తోంది. శనివారం రాత్రి హైదరాబాద్ నిజాం కాలేజీలో విందు ఏర్పాటు చేసింది.
ఇఫ్తార్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.