27న విజయవాడలో సీఎం పర్యటన | CM Jagan Visit Vijayawada On 27th May | Sakshi
Sakshi News home page

27న విజయవాడలో సీఎం పర్యటన

Published Mon, Apr 25 2022 5:15 AM | Last Updated on Mon, Apr 25 2022 7:52 AM

CM Jagan Visit Vijayawada On 27th May - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 27వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ, మంగళగిరిలో పర్యటించనున్నారు. 27న సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ 1 టౌన్‌ వించిపేటలో షాజహుర్‌ ముసాఫిర్‌ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. ముస్లిం మత పెద్దలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్‌ స్టేడియం చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. రాత్రి 7.35 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement