ifthar dinner
-
కదిరిలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
Vijayawada: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
-
27న విజయవాడలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 27వ తేదీన సీఎం వైఎస్ జగన్ విజయవాడ, మంగళగిరిలో పర్యటించనున్నారు. 27న సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ 1 టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. ముస్లిం మత పెద్దలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి 7.35 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. -
నేడు గుంటూరులో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు
-
బీజేపీ పాలనలో ముస్లింలకు భద్రత కరువు
హుజూర్నగర్ నల్గొండ : దేశవ్యాప్తంగా ముస్లింలు బీజేపీ పాలనలో అభద్రతతో జీవనం సాగిçస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్ పట్టణంలోని షాదీఖానాలో ఆయన ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. బీజేపీ అనుబంధ సంస్థలు ముస్లిం మైనార్టీల వేష, భాష, తినే తిండిపై కూడా ఆంక్షలు విధిస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. మోదీ పాలనలో ముస్లిం మైనార్టీలకు రక్షణ కరువైందని అన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి ఎన్నికల నుంచి జీఎస్టీ బిల్లు వరకు టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలుకుతుందని అన్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీ వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయవద్దన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 100 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటివారు పనిచేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీలు మద్దతు పలకాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ముస్లింలకు రక్షణ ఉంటుందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ సయ్యద్ గులాంబియాబానీ, రాష్ట్ర మైనార్టీ మాజీ కమిషనర్ అబ్దుల్ రసూల్ ఖాన్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సోహెల్బాయ్, మాజీ వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు జబ్బార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ముస్లిం మైనార్టీలను ఆదుకుంది కాంగ్రెసే
కోదాడ : ముస్లిం మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకుంది, అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. గురువారం కోదాడలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జబ్బార్ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ముస్లింలలకు రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనిత, జబ్బార్, బషీర్, వంటిపులి నాగరాజు, పాలకి అర్జున్, బాగ్దాద్, రహీం, ముస్లి్లం మతపెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఒబామా ఇఫ్తార్ విందు
వాషింగ్టన్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్ ముస్లింలతోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తోసహా పలు ఇస్లామిక్ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఏ మతానికి చెందిన వారినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని వ్యతిరేకించడంలో అమెరికన్లందరూ ఐక్యంగా నిలబడతారని ఒబామా పేర్కొన్నారు. అందరం కలసికట్టుగా అభివృద్ధి పథంలో పయనించడమే లక్ష్యంగా ముందుకెళుతూ.. ఖురాన్లో ప్రవచించిన శాంతి మంత్రాన్ని పాటించాలని కోరారు.