
ఇఫ్తార్ విందులో ప్రార్థన చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
కోదాడ : ముస్లిం మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకుంది, అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. గురువారం కోదాడలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జబ్బార్ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు.
ముస్లింలలకు రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దానిని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనిత, జబ్బార్, బషీర్, వంటిపులి నాగరాజు, పాలకి అర్జున్, బాగ్దాద్, రహీం, ముస్లి్లం మతపెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment