Tppc chief
-
ముస్లిం మైనార్టీలను ఆదుకుంది కాంగ్రెసే
కోదాడ : ముస్లిం మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకుంది, అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. గురువారం కోదాడలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జబ్బార్ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ముస్లింలలకు రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనిత, జబ్బార్, బషీర్, వంటిపులి నాగరాజు, పాలకి అర్జున్, బాగ్దాద్, రహీం, ముస్లి్లం మతపెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
'రాహుల్ పాదయాత్ర విజయవంతం'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం చేపట్టిన కిసాన్ సందేశ్ యాత్ర విజయవంతమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఈ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకనైనా రైతు సమస్యలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. -
'సోనియా ముందు చూపే కారణం'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంతా అవాస్తవంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించారు. బడ్జెట్లో సవరించిన అంచనాల్లో భారీ కోతలున్నాయని విమర్శించారు. గతేడాది లక్షా ఆరు వేల కోట్ల బడ్జెట్లో 40 శాతం తగ్గిందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ ఏడాది రూ. లక్షా 15 వేల కోట్ల బడ్జెట్లో 30 శాతం తగ్గడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి నిధుల కోత తప్పదన్నారు. అందుకే ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం... అలాంటి రాష్ట్రంలో రెవిన్యూ మిగులు ఉండటానికి సోనియా ముందు చూపే కారణమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తు ఈ సందర్భంగా వెల్లడించారు. -
ఉత్తమ్, భట్టిలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం
హైదరాబాద్: టీ పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్క నియామకం పట్ల ఆ పార్టీ కార్యదర్శి బండ చంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ్, భట్టి విక్రమార్కల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చంద్రారెడ్డి ఆయన నివాసంలో కలిసిన శుభాకాంక్షలు తెలిపారు.