'సోనియా ముందు చూపే కారణం'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంతా అవాస్తవంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించారు. బడ్జెట్లో సవరించిన అంచనాల్లో భారీ కోతలున్నాయని విమర్శించారు. గతేడాది లక్షా ఆరు వేల కోట్ల బడ్జెట్లో 40 శాతం తగ్గిందని ఉత్తమ్ కుమార్రెడ్డి గుర్తు చేశారు.
ఈ ఏడాది రూ. లక్షా 15 వేల కోట్ల బడ్జెట్లో 30 శాతం తగ్గడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి నిధుల కోత తప్పదన్నారు. అందుకే ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం... అలాంటి రాష్ట్రంలో రెవిన్యూ మిగులు ఉండటానికి సోనియా ముందు చూపే కారణమని ఉత్తమ్కుమార్రెడ్డి గుర్తు ఈ సందర్భంగా వెల్లడించారు.