హెచ్ సీయూలో పరిస్థితులు చక్కబడేలా చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: హెచ్ సీయూలో విద్యార్థులపై లాఠీచార్జి సంఘటనలపై విచారణచేపడతామని, వర్సిటీలో పరిస్థితులు చక్కబడేలా చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
లాఠీచార్జిపై విచారణ జరిపి తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న ఉత్తమ్.. విద్యార్థుల బెయిల్ పిటిషన్లను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. విద్యార్థులపై కేసులు ఎత్తేసి సీఎం తన హామీని నిలబెట్టుకోవాలన్నారు.