‘స్పీకర్ పై అవిశ్వాసం పెడతాం’
‘స్పీకర్ పై అవిశ్వాసం పెడతాం’
Published Mon, Dec 19 2016 2:50 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభా స్పీకర్ మధుసూధనాచారి అప్రజాస్వామికంగా వ్యవహారిస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై మాట్లాడితే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టే , ఆయన ముందు నిరసన చేపట్టామన్నారు. స్పీకర్ తీరు మారకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు.
Advertisement
Advertisement