ఒబామా ఇఫ్తార్ విందు
వాషింగ్టన్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్ ముస్లింలతోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తోసహా పలు ఇస్లామిక్ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఏ మతానికి చెందిన వారినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని వ్యతిరేకించడంలో అమెరికన్లందరూ ఐక్యంగా నిలబడతారని ఒబామా పేర్కొన్నారు. అందరం కలసికట్టుగా అభివృద్ధి పథంలో పయనించడమే లక్ష్యంగా ముందుకెళుతూ.. ఖురాన్‌లో ప్రవచించిన శాంతి మంత్రాన్ని పాటించాలని కోరారు.