సాక్షి, వైఎస్సార్‌జిల్లా : పవిత్ర రంజాన్ మాసంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక అవ్వడం సంతోషంగా ఉందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన నగరంలోని అమీన్ ఫంక్షన్ ప్యాలెస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ మాట్లాడుతూ.. అల్లా ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో మంచి పాలన అందిస్తామన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు ఎప్పటికి మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెల్లదు, మైనార్టీ సోదరులు, అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, రవీంద్రనాధ్ రెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment