ఇఫ్తార్‌లో హీరోయిన్‌ అవతారం.. విమర్శలు | Revealing Outfit in Iftar Actress Sonali Raut Trolled | Sakshi
Sakshi News home page

Jun 12 2018 12:14 PM | Updated on Oct 2 2018 6:54 PM

Revealing Outfit in Iftar Actress Sonali Raut Trolled - Sakshi

నటి సోనాలి రౌత్‌

నటి, బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ సోనాలీ రౌత్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇఫ్తార్‌ విందులో ఆమె ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పలువురు అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ప్రతీ ఏటా  కాంగ్రెస్‌ నేత బాబా సిద్ధిఖీ గ్రాండ్‌గా ఇఫ్తార్‌ విందు ఇచ్చే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కార్యక్రమానికి బడా బడా ప్రముఖులు హాజరవుతుంటారు. 

ఈ ఏడాది బాలీవుడ్‌ నుంచి అనిల్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, పలువురు తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నటి సోనాలీ రౌత్‌ కూడా ఉ‍న్నారు. అయితే ఆ విందులో ఆమె ఫోటోదిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఇస్లాంకు, ఉపవాసానికి నువ్వు గౌరవం ఇవ్వకపోవచ్చు. కానీ, పవిత్ర రంజాన్‌ మాసానికి కాస్త గౌరవం ఇవ్వటం నేర్చుకో. ఇతర మతాల వారెవరూ నువ్వు ఇలాంటి డ్రెస్సులతో వేడుకలకు వెళ్తే అస్సలు ఒప్పుకోరు.. జాగ్రత్త’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ కామెంట్లకు ఆమె మాత్రం స్పందించటం లేదు.

కాగా, ఇదే విందుకు మౌనీ రాయ్‌, హీనా ఖాన్‌, షామా సికిందర్‌, రాగిణి ఖన్నా, సుర్విన్‌ చావ్లా తదితరులు హాజరుకాగా, వారంతా చాలా పద్ధతిగా రావటంతో... సోనాలిని ఎక్కువగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ మధ్య కొందరు ఇస్లాంకు చెందిన సెలబ్రిటీలు ఇదే తరహాలో హాట్‌గా ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా, పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శించిన విషయం తెలిసిందే.

Last night at Baba Siddique's Iftar Party wearing outfit designed by @charmisdesign.

A post shared by Sonali Raut (@isonaliraut) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement