సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు మాజీ మంత్రి సబితారెడ్డికి ఊరట లభించింది. జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ దాఖలు చేసిన మెమోను బుధవారం న్యాయస్థానం కొట్టేయడంతో ఆమెకు ఉపశమనం కలి గింది. సాక్షులను ప్రభావితం చేసేలా మీడియా తో మాట్లాడారని అభియోగాన్ని మోపిన సీబీ ఐ.. మంత్రులు సబిత, ధర్మాన ప్రసాదరావును జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తీర్పును ప్రకటించింది. మంత్రులు తప్పుగా మాట్లాడలేదని పేర్కొంటూ జ్యుడిషియల్ కస్టడీని నిరాకరించింది. దీంతో కొన్నాళ్లుగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న సబితకు ఓదార్పు లభించింది. దాల్మియా సిమెంట్ కం పెనీకి గనుల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేస్తూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘బిజినెస్ రూల్స్ ప్రకారమే వ్యవహరించామని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుం టామని’ స్పష్టం చేశారు. మంత్రుల వ్యాఖ్యలు కేసును ప్రభావితం చేసేలా ఉన్నాయని పే ర్కొంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను సీబీఐ కోర్టుకు సమర్పించింది. జగన్ కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండడం, తమను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేయడం సబిత శిబిరంలో ఆందోళన రేపింది. సీబీఐ కేసు అనంతరం మంత్రి పదవికి రాజీ నామాచేసిన సబిత... మునుపటిలా జిల్లా రాజ కీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడంలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలకు సైతం దూరం పాటించారు. ఈ తరుణంలో తాజాగా న్యాయస్థానం తీర్పు ఆమెకు కాసింత ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నైరాశ్యంలో కూరుకుపోయిన ఆమె వర్గీయులకు ఈ వార్త సంతోషాన్ని కలిగించింది.
సీబీఐ కేసులో సబితకు ఊరట
Published Thu, Aug 8 2013 2:54 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement