చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: కూరగాయలు భయపెడుతున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయలూ కిలో రూ.35పైనే పలుకుతున్నాయి. ఇటీవల టమాటా కాస్త దిగొచ్చినా మిగతా కూరగాయల ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. సామాన్యులు మార్కెట్‌కు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ప్రతి కూరగాయను పరిమితంగా కొనుగోలు చేసి పొదుపుగా వాడుకుంటున్నారు. నెల బడ్జెట్‌లో ఇప్పుడు కూరగాయలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. వారంలో ఏమేం వండాలో ముందుగానే లెక్కలు వేసుకుని కొనుగోలు చేస్తున్నారు. వారంలో రెండు రోజులు గుడ్లు, ఒక రోజు పప్పు, మరో రోజు చికెన్ లేదా మటన్.. ఇలా సర్దుబాటు చేసుకుని మిగిలిన రోజులకు కొనుగోలు చేస్తున్నారు. ఫ్రిజ్‌ల నిండా నింపుకొనే పరిస్థితికి టాటాచెప్పి మితంగా కొనుగోలు చేస్తున్నారు.
ఇక పేదలు పచ్చళ్లతో రోజులు గడిపేస్తున్నారు. కూరగాయల పంటలు మరికొన్ని రోజుల్లో మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ దశలో మండిపోతున్న ధరలు.. తీరా రైతుల పంటలు మార్కెట్‌లోకి వచ్చేటప్పటికి ఉండడం లేదు. దీంతో రైతులు కూరగాయల ధరలపై నిరుత్సాహంగా ఉంటున్నారు. ధరలు పెరి గిన ప్రతిసారి రైతులు ఆశతో సాగు ప్రారంభించడం.. నాలుగైదు నెల ల్లో పంట చేతికొచ్చాక ధరలు లేకపోవడం యేటా రివాజుగా మారిం ది. చేవెళ్ల మండలంలోని 30 పంచాయతీల పరిధిలో రైతులు పలు రకాల కూరగాయలు పండిస్తారు. కానీ ఇప్పుడవన్నీ పంట దశలోనే ఉన్నాయి. చేవెళ్ల మార్కెట్‌లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.
కొనలేని పరిస్థితి
మార్కెట్‌లో కూరగాయల ధరలు చూస్తే భయమేస్తోంది. రోజురోజుకు ధరలు పైపైకి పోతున్నాయి. గతంలో రూ.100 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పడు రెండు రకాల కూరగాయలు కూడా రావడంలేదు. రోజూ కూరలు కొనడం ఇబ్బందిగా ఉండి ఒకపూట పచ్చడితో తింటున్నాం.
- కృష్ణ, చేవెళ్ల గ్రామస్తుడు
వ్యాపారం కష్టంగానే ఉంది
ఈ ధరల మూలంగా విక్రయాలు పడిపోయాయి. అందరూ పావుకిలో, అరకిలోకు మించి కొనడం లేదు. ఏ కూరగాయ ధర చెప్పినా ‘అంత రేటా..’ అని ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. లాభాలు కూడా బాగా తగ్గిపోయాయి.
- శ్రీను, కూరగాయల చిరువ్యాపారి
పడిపోయిన కూరగాయల వ్యాపారం
Published Thu, Aug 8 2013 2:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement