‘ఇష్రాత్‌’ కేసులో మాజీ పోలీసులకు విముక్తి | CBI court drops Ishrat Jahan case against Vanzara | Sakshi
Sakshi News home page

‘ఇష్రాత్‌’ కేసులో మాజీ పోలీసులకు విముక్తి

Published Fri, May 3 2019 4:53 AM | Last Updated on Fri, May 3 2019 4:53 AM

CBI court drops Ishrat Jahan case against Vanzara - Sakshi

డీజీ వంజరా

అహ్మదాబాద్‌: ఇష్రాత్‌ జహన్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో మాజీ పోలీసు అధికారులు డీజీ వంజరా, ఎన్‌కే అమిన్‌లకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసు విచారణను నుంచి తమను తప్పించాలంటూ వంజరా, అమిన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గానూ సీబీఐకి గుజరాత్‌ ప్రభుత్వం అనుమతివ్వని నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతినివ్వలేదని.. దీంతో మాజీ పోలీసు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు అనుమతిస్తున్నామని.. ఈ కేసులో వారికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోరాదని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జేకే పాండ్యా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement