
సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు
హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 4వ తేదీన సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఓఎంసీ కేసులో ఆమెపై దాఖలైన చార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సబితా ఇంద్రారెడ్డిని నిందితురాలిగా చేర్చాలన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంపై అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.