OMC case
-
అభ్యంతరాలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే సీబీఐకోర్టు పిటిషన్‌ను కొట్టివేసిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టు వాదనలు వినిపించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఎలాంటి కొత్త అంశాలు లేకుండా అదనపు అభియోగ పత్రం దాఖలు చేస్తూ నిందితురాలిగా చేర్చారని సబితా ఇంద్రారెడ్డి నివేదించారు. తన డిశ్చార్జి పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ మరోసారి విచారణ చేపట్టారు. ఆ అంశాలకు సమాధానం చెప్పలేదు డిశ్చార్జి పిటిషన్లో తాను లేవనెత్తిన అభ్యంతరాలకు సీబీఐ కోర్టు సమాధానం చెప్పలేదని సబిత పేర్కొన్నారు. డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. గనుల శాఖ ప్రతిపాదనల ఆధారంగా మంత్రి ఆమోదం ఉంటుందని, ఆ శాఖ మంత్రిగా ఏం బాధ్యతలు ఉంటాయో కూడా సీబీఐ కోర్టు గుర్తించలేదని వివరించారు. వాదనలు విన్న సీజే...సీబీఐ వాదనల కోసం తదుపరి విచారణను వచ్చే ఈనెల 24కు వాయిదా వేశారు. -
'బళ్లారి వెళ్తా, అనుమతి ఇవ్వండి'
న్యూఢిల్లీ: బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడి ఉన్న ఆయనకు జనవరిలో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పాస్‌పోర్టును సీబీఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, అనంతపురం, కడప, బళ్లారికి వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఐదు షరతులు విధించారు. మూడేళ్ల నాలుగు నెలల పాటు జైళ్లో గడిపిన తర్వాత ఆయన విడుదలయ్యారు. -
ఆ పూచీకత్తు చెల్లదు
ఓఎంసీ కేసులో కోర్టుకు నివేదించిన సీబీఐ హైదరాబాద్: ఓఎంసీ కేసులో స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్ విడుదలకు ఆ సంస్థ సమర్పించిన భూమి పూచీకత్తు చెల్లదని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఇప్పటికే ప్లాట్లు చేసి విక్రయించిన భూమిని పూచీకత్తుగా చూపించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ పూచీకత్తును అనుమతించరాదని విజ్ఞప్తి చేసింది. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీబీఐ ఓ హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకుంది. తర్వాత ఓఎంసీ విజ్ఞప్తి మేరకు 2013లో హెలికాప్టర్‌ను వారికి తాత్కాలికంగా అప్పగించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే హెలికాప్టర్‌ను విక్రయించడంగానీ, కుదవపెట్టడంగానీ చేయమంటూ వ్యక్తిగత పూచీకత్తుతోపాటు... హెలికాప్టర్ విలువ రూ.6.62 కోట్లకు సమానంగా మూడో వ్యక్తి పూచీకత్తు సమర్పిస్తే హెలికాప్టర్‌ను అప్పగిస్తామని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎల్.లక్ష్మణ్ అనే వ్యక్తి...తనకు ఖానాపూర్‌లో ఉన్న ఐదు ఎకరాల భూమిని పూచీకత్తుగా చూపించారు. దీని విలువ రూ.7.26 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కోర్టుకు పూచీకత్తు బాండ్లు సమర్పించారు. అయితే సీబీఐ...ఇప్పటికే విక్రయించిన భూమిని పూచీకత్తుగా చూపించారని, వాటిని ఆమోదించరాదని కోర్టుకు నివేదించింది. ఈ అంశంపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. -
‘ఓఎంసీ’ విచారణ నిలుపుదలకు హైకోర్టు నో
కౌంటర్ దాఖలుకు సీబీఐకి ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సీబీఐ కౌంటర్‌ను పరిశీలించిన తరువాతనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఓఎంసీ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వై.శ్రీలక్ష్మి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ విచారించారు. శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.బసంత్ వాదనలు వినిపించారు. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు సమాధానమిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, 6 వారాల గడువు కావాలన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఓంఎంసీ కేసు విచారణ 19కు వాయిదా..
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరి హాజరును నమోదుచేసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియపై అభ్యంతరాలుంటే తెలపాలని నిందితుల తరఫు న్యాయవాదులకు సూచించారు. -
ఓఎంసీ కేసులో అలీఖాన్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న అలీఖాన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు బాండుతో పాటు దేశం వదిలి వెళ్లరాదని, బళ్లారికి కూడా వెళ్లొద్దని షరతులు విధించింది. అలీఖాన్ తరఫు న్యాయవాదులు పూచీకత్తు బాండ్లను కోర్టుకు సమర్పించారు. -
గాలి జనార్దనరెడ్డి విడుదల
ఓఎంసీ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. చిట్ట చివరి కేసులో కూడా ఆయనకు మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అనంతరం కొన్ని అధికారిక లాంఛనాలు ముగించి, పరప్పన అగ్రహార జైలు నుంచి శుక్రవారం సాయంత్రం గాలి జనార్దనరెడ్డిని విడుదల చేశారు. జైలు నుంచి తన కాన్వాయ్ లో జనార్దనరెడ్డి చిరునవ్వుతో చేతులు ఊపుతూ వెళ్లారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై 2011 సెప్టెంబర్ 5న సీబీఐ వర్గాలు ఆయనను బళ్లారిలోని ఆయన ఇంట్లోనే అరెస్టు చేశాయి. శుక్రవారం విడుదల కావడంతో ఆయన మొత్తం 1,237 రోజులు వివిధ జైళ్లలో గడిపినట్లు అయ్యింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన ఆయన.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లోనే చాలా కాలం ఉన్నారు. మధ్యలో ఆయన బెంగళూరులోని పరప్పణ అగ్రహారంలో గల ప్రధాన జైలుకు కూడా వెళ్లి వచ్చేవారు. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దాంతో ఆయనను బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
గాలి జనార్దనరెడ్డి విడుదల
-
బీవీ శ్రీనివాసరెడ్డి విడుదల
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న ఓఎంసీ బీవీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. 2011, సెప్టెంబర్ 5న ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా నేడు జైలు నుంచి విడుదలయ్యారు. -
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్
-
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్ : ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు సీబీఐ అభ్యంతరం తెలపకపోవటంతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఓంఎసీ కేసులో 2011 సెప్టెంబర్ 5న జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఏడు కేసుల్లోనూ గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావటంతో త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. -
ఓఎంసీ బెయిల్ ముడుపుల కేసు వాయిదా
వచ్చే గురువారానికి వాయిదా వేసిన ‘సుప్రీం’ సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఓఎంసీ ఇనుప గనుల అక్రమ తవ్వకం కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో అరెస్టయి ఆ తర్వాత బెయిల్ పొందిన నిందితులకు ఆ బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం విచారించింది. నిందితుల్లో కొందరికి బెయిల్ మంజూరు చేసి తనకు మంజూరు చేయలేదని, తనకు కూడా బెయిల్ ఇప్పించాలని మరో నిందితుడు యాదగిరి రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించింది. 2012 మే నెలలో ఈ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ట్రయల్ కోర్టు కొందరికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఏసీబీ హైకోర్టులో సవాలు చేయగా.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంటూ మరికొందరు నిందితులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నిందితులకు బెయిల్ రద్దు చేయాలని అభ్యర్థించింది. ప్రభుత్వం, యాదగిరి రావు ఫిర్యాదులను విచారణకు స్వీకరించిన జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం, ఒకే కేసులో ఒకే ఆరోపణపై కొందరు నిందితులకు బెయిల్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం ఏంటని, ఈ కేసు విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోందని వ్యాఖ్యానించింది. కాగా ట్రయల్ కోర్టుకు ఐదు నెలలుగా న్యాయమూర్తి లేరని ప్రభుత్వం వివరించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
ఓఎంసీ కేసులో సబితకు సమన్లు
- మాజీ ఐఏఎస్ కృపానందానికి కూడా.. - జూన్ 4న ప్రత్యక్షంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 4వ తేదీన ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందిగా వారిని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదేశించారు. రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించి బెయిల్ పొందాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ కేసులో కృపానందంను ఎనిమిదో, సబితా ఇంద్రారెడ్డిని తొమ్మిదో నిందితులుగా చేరుస్తూ ఈ నెల 9 న సీబీఐ అధికారులు దాఖలు చేసిన మరో అనుబంధ చార్జిషీట్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఐపీసీ 120 (బీ) రెడ్‌విత్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) సెక్షన్ల కింద వారిపై అభియోగాలను విచారణకు స్వీకరించారు. సబితా ఇంద్రారెడ్డిని ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లో సాక్షిగా పేర్కొన్నామని.. అయితే ఈ కేసులో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో నిందితురాలిగా చేర్చేందుకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోను కోర్టు అనుమతించింది. కాగా, 65పేజీల అనుబంధ చార్జిషీట్‌తో పాటు 104 అనుబంధ పత్రాలు, 36 మందిని సాక్షులుగా అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో 2011 డిసెంబర్లో సీబీఐ దాఖలు చేసిన ప్రధాన చార్జిషీట్లో సబితను 53వ సాక్షిగా.. మొదటి, రెండో అనుబంధ చార్జిషీట్లలో 8వ సాక్షిగా పేర్కొన్నారు. ప్రధాన చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత సబిత, కృపానందంలను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ మరో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. -
సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు
హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 4వ తేదీన సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఓఎంసీ కేసులో ఆమెపై దాఖలైన చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సబితా ఇంద్రారెడ్డిని నిందితురాలిగా చేర్చాలన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంపై అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. -
గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు:ఇంటికి వెళ్లకూడదని షరతులు
బెంగళూరు: ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్ రెడ్డికి బెంగళూరు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజారు చేసింది. ఆరోగ్యం సరిగా లేని కారణంగా బెయిల్ మంజూరు చేయాలని జనార్థన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన కోర్టు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో ఐదు రోజులు ఉండేందుకు గాను బెయిల్ ను మంజూరు చేసింది. కాగా, ఇంటికి వెళ్లడానికి ఎటువంటి అనుమతి లేవని షరతులు విధించింది. -
విచారణ త్వరగా ముగించవలసిన బాధ్యత సిబిఐదే: సుప్రీం కోర్టు
ఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసు విచారణ ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది. ఓఎంసి అధినేత గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ పేరుతో 27 నెలలుగా గాలి జనార్థన్‌రెడ్డిని జైలులో ఉంచడం అన్యాయం అని అతని తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఇప్పటికే 3 చార్జీషీట్లు దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని ముకుల్ రోహత్గి కోర్టును కోరారు. సిబిఐ తరపు న్యాయవాది విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. విచారణను త్వరగా ముగించాల్సిన బాధ్యత సీబీఐదేనని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. కేసు విచారణను సుప్రీం కోర్టు మార్చి 28కి వాయిదా వేసింది. -
రెండేళ్లు దాటింది.. బెయిలివ్వండి
ఓఎంసీ కేసులో శ్రీనివాసరెడ్డి పిటిషన్ దాఖలు సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో తనను అరెస్టు చేసి 25 నెలలు దాటిందని, ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది జి.శ్రీనివాసరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ‘2011 సెప్టెంబర్ 5న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఏడో నిందితునిగా ఉన్న అలీఖాన్ చెప్పిన విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకొని గతంలో నా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. దాదాపు 10 నెలలుగా సీబీఐ ఎటువంటి దర్యాప్తూ చేయలేదు.. బెయిల్ మంజూరు చేయండి’ అని శ్రీనివాసరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు...కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐకి గడువునిస్తూ విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. -
సెప్టెంబర్ 6వరకూ జగన్ రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్‌ను సెప్టెంబర్ 6వ తేదీవరకూ పొడిగిస్తూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, కేవీ బ్రహ్మానందరెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న వీరందరినీ సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. మరోవైపు ఒఎంసీ కేసులో గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్ సోమవారం సీబీఐ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కాగా ఐఏఎస్ అధికారణి శ్రీలక్ష్మి అనారోగ్య కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరపు న్యాయవాదులు మెడికల్ రిపోర్టును సమర్పించారు. కాగా జగన్ పెట్టుబడుల కేసులో విచారణ నిమిత్తం మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సోమవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వారు తమ వాదనలను కోర్టుకు తెలియచేశారు. -
ఓఎంసీ కేసులో.. శ్రీనివాసరెడ్డికి 26 వరకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక బెయిల్ ముగియడంతో ఓఎంసీ కేసు నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డి బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. దీంతో శ్రీనివాసరెడ్డి రిమాండ్‌ను ఈ నెల 26 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. తన భార్య విరిగిన కాలిలో ఉన్న రాడ్లను తొలగించే చికిత్స చేయించేందుకు వీలుగా శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కోర్టు 9 రోజులపాటు షరతులతో కూడిన ఎస్కార్ట్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
శ్రీలక్ష్మి గైర్హాజరుపై కోర్టు ఆగ్రహం
క్విడ్ ప్రో కో కేసులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు సోమవారం ఉదయం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఇదే సమయంలో ఓఎంసీ కేసు కూడా విచారణకు వచ్చింది. అయితే, ఈ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈ విషయమై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యం కారణంగానే ఆమె హాజరు కాలేదని తెలిసింది. అయితే, ఈ విషయంలో కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మరుసటి వాయిదాకు కూడా శ్రీలక్ష్మి హాజరు కాలేకపోతే తప్పనిసరిగా మెడికల్ రిపోర్టు సమర్పించాలని ఆమె తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. -
ఓఎంసి కేసులో శ్రీనివాస రెడ్డి బెయిల్ పొడిగింపు
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసులో దాని మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి తాత్కాలిక బెయిల్‌ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. శ్రీనివాస్ రెడ్డి భార్య కాలికి ఆపరేషన్ చేస్తున్నందున తొలుత ఈ నెల 5 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన భార్య కాలికి ఆపరేషన్ చేయించవలసి ఉన్నందున, తనకు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 2వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 50 వేల రూపాయల డిపాజిట్, ఇద్దరి వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు మినహా ఇతరులతో మాట్లాడరాదని షరతు విధించింది. ఐదు రోజులపాటు ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తరలించి, తిరిగి సాయంత్రం 4 గంటలకు జైలుకు తీసుకువెళ్లాలని జైలు సూపరింటిండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. శ్రీనివాస రెడ్డి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముగ్గురు సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఉండాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. మళ్లీ శ్రీనివాస రెడ్డి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ను మరో నాలుగు రోజులు పొడిగించింది. -
ఓఎంసి కేసులో శ్రీనివాస రెడ్డి బెయిల్ పొడిగింపు
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసులో దాని మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి తాత్కాలిక బెయిల్‌ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. శ్రీనివాస్ రెడ్డి భార్య కాలికి ఆపరేషన్ చేస్తున్నందున తొలుత ఈ నెల 5 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన భార్య కాలికి ఆపరేషన్ చేయించవలసి ఉన్నందున, తనకు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 2వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 50 వేల రూపాయల డిపాజిట్, ఇద్దరి వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు మినహా ఇతరులతో మాట్లాడరాదని షరతు విధించింది. ఐదు రోజులపాటు ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తరలించి, తిరిగి సాయంత్రం 4 గంటలకు జైలుకు తీసుకువెళ్లాలని జైలు సూపరింటిండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. శ్రీనివాస రెడ్డి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముగ్గురు సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఉండాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. మళ్లీ శ్రీనివాస రెడ్డి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ను మరో నాలుగు రోజులు పొడిగించింది.