హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసులో దాని మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి తాత్కాలిక బెయిల్ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. శ్రీనివాస్ రెడ్డి భార్య కాలికి ఆపరేషన్ చేస్తున్నందున తొలుత ఈ నెల 5 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన భార్య కాలికి ఆపరేషన్ చేయించవలసి ఉన్నందున, తనకు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 2వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
50 వేల రూపాయల డిపాజిట్, ఇద్దరి వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు మినహా ఇతరులతో మాట్లాడరాదని షరతు విధించింది. ఐదు రోజులపాటు ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తరలించి, తిరిగి సాయంత్రం 4 గంటలకు జైలుకు తీసుకువెళ్లాలని జైలు సూపరింటిండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. శ్రీనివాస రెడ్డి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముగ్గురు సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఉండాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. మళ్లీ శ్రీనివాస రెడ్డి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్ను మరో నాలుగు రోజులు పొడిగించింది.
ఓఎంసి కేసులో శ్రీనివాస రెడ్డి బెయిల్ పొడిగింపు
Published Thu, Aug 8 2013 6:21 PM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement