BV Srinivas Reddy
-
వాళ్లిద్దరు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు
సాక్షి, హైదరాబాద్ : ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్‌కు గాంధీభవన్‌లో గ్రేటర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బివి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌లు అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని విమర్శించారు. ఈడీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పార్లెజి కంపెనీ మూసేయడంతో వేలమంది ఉద్యోగస్తులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, ఇందుకు ఉదాహరణగా హర్యానాలో 640 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసిపోయిన అధ్యాయమని అన్న వారందరికి మా తడాకా చూసిస్తామని , పార్టీలో సరిగా పనిచేయని వారిపై వేటు వేసి కొత్తవారిని తీసుకుంటామని తెలిపారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఎటువంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందని అనిల్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇస్తానన్న ఉద్యోగాలు, నిరుద్యోగ భృత్తి ఏమైందని ప్రశ్నించారు. -
బీవీ శ్రీనివాసరెడ్డి విడుదల
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న ఓఎంసీ బీవీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. 2011, సెప్టెంబర్ 5న ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి కూడా నేడు జైలు నుంచి విడుదలయ్యారు. -
రెండేళ్లు దాటింది.. బెయిలివ్వండి
ఓఎంసీ కేసులో శ్రీనివాసరెడ్డి పిటిషన్ దాఖలు సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో తనను అరెస్టు చేసి 25 నెలలు దాటిందని, ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది జి.శ్రీనివాసరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ‘2011 సెప్టెంబర్ 5న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఏడో నిందితునిగా ఉన్న అలీఖాన్ చెప్పిన విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకొని గతంలో నా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. దాదాపు 10 నెలలుగా సీబీఐ ఎటువంటి దర్యాప్తూ చేయలేదు.. బెయిల్ మంజూరు చేయండి’ అని శ్రీనివాసరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు...కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐకి గడువునిస్తూ విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. -
ఓఎంసీ కేసులో.. శ్రీనివాసరెడ్డికి 26 వరకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక బెయిల్ ముగియడంతో ఓఎంసీ కేసు నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డి బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. దీంతో శ్రీనివాసరెడ్డి రిమాండ్‌ను ఈ నెల 26 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. తన భార్య విరిగిన కాలిలో ఉన్న రాడ్లను తొలగించే చికిత్స చేయించేందుకు వీలుగా శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కోర్టు 9 రోజులపాటు షరతులతో కూడిన ఎస్కార్ట్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
ఓఎంసి కేసులో శ్రీనివాస రెడ్డి బెయిల్ పొడిగింపు
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసులో దాని మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి తాత్కాలిక బెయిల్‌ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. శ్రీనివాస్ రెడ్డి భార్య కాలికి ఆపరేషన్ చేస్తున్నందున తొలుత ఈ నెల 5 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన భార్య కాలికి ఆపరేషన్ చేయించవలసి ఉన్నందున, తనకు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 2వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 50 వేల రూపాయల డిపాజిట్, ఇద్దరి వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు మినహా ఇతరులతో మాట్లాడరాదని షరతు విధించింది. ఐదు రోజులపాటు ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తరలించి, తిరిగి సాయంత్రం 4 గంటలకు జైలుకు తీసుకువెళ్లాలని జైలు సూపరింటిండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. శ్రీనివాస రెడ్డి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముగ్గురు సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఉండాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. మళ్లీ శ్రీనివాస రెడ్డి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ను మరో నాలుగు రోజులు పొడిగించింది. -
ఓఎంసి కేసులో శ్రీనివాస రెడ్డి బెయిల్ పొడిగింపు
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసులో దాని మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి తాత్కాలిక బెయిల్‌ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. శ్రీనివాస్ రెడ్డి భార్య కాలికి ఆపరేషన్ చేస్తున్నందున తొలుత ఈ నెల 5 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. తన భార్య కాలికి ఆపరేషన్ చేయించవలసి ఉన్నందున, తనకు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 2వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 50 వేల రూపాయల డిపాజిట్, ఇద్దరి వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు మినహా ఇతరులతో మాట్లాడరాదని షరతు విధించింది. ఐదు రోజులపాటు ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి తరలించి, తిరిగి సాయంత్రం 4 గంటలకు జైలుకు తీసుకువెళ్లాలని జైలు సూపరింటిండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. శ్రీనివాస రెడ్డి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముగ్గురు సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఉండాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. మళ్లీ శ్రీనివాస రెడ్డి అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ను మరో నాలుగు రోజులు పొడిగించింది.