ఓఎంసీ కేసులో శ్రీనివాసరెడ్డి పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో తనను అరెస్టు చేసి 25 నెలలు దాటిందని, ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది జి.శ్రీనివాసరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ‘2011 సెప్టెంబర్ 5న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఏడో నిందితునిగా ఉన్న అలీఖాన్ చెప్పిన విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకొని గతంలో నా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. దాదాపు 10 నెలలుగా సీబీఐ ఎటువంటి దర్యాప్తూ చేయలేదు.. బెయిల్ మంజూరు చేయండి’ అని శ్రీనివాసరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు...కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐకి గడువునిస్తూ విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.
రెండేళ్లు దాటింది.. బెయిలివ్వండి
Published Thu, Oct 10 2013 12:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement