సుప్రీం కోర్టు
ఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసు విచారణ ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది. ఓఎంసి అధినేత గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ పేరుతో 27 నెలలుగా గాలి జనార్థన్‌రెడ్డిని జైలులో ఉంచడం అన్యాయం అని అతని తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఇప్పటికే 3 చార్జీషీట్లు దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలని ముకుల్ రోహత్గి కోర్టును కోరారు.
సిబిఐ తరపు న్యాయవాది విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. విచారణను త్వరగా ముగించాల్సిన బాధ్యత సీబీఐదేనని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. కేసు విచారణను సుప్రీం కోర్టు మార్చి 28కి వాయిదా వేసింది.