ఓఎంసీ కేసులో కోర్టుకు నివేదించిన సీబీఐ
హైదరాబాద్: ఓఎంసీ కేసులో స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్ విడుదలకు ఆ సంస్థ సమర్పించిన భూమి పూచీకత్తు చెల్లదని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఇప్పటికే ప్లాట్లు చేసి విక్రయించిన భూమిని పూచీకత్తుగా చూపించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ పూచీకత్తును అనుమతించరాదని విజ్ఞప్తి చేసింది. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీబీఐ ఓ హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకుంది. తర్వాత ఓఎంసీ విజ్ఞప్తి మేరకు 2013లో హెలికాప్టర్‌ను వారికి తాత్కాలికంగా అప్పగించేందుకు కోర్టు అంగీకరించింది.
అయితే హెలికాప్టర్‌ను విక్రయించడంగానీ, కుదవపెట్టడంగానీ చేయమంటూ వ్యక్తిగత పూచీకత్తుతోపాటు... హెలికాప్టర్ విలువ రూ.6.62 కోట్లకు సమానంగా మూడో వ్యక్తి పూచీకత్తు సమర్పిస్తే హెలికాప్టర్‌ను అప్పగిస్తామని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎల్.లక్ష్మణ్ అనే వ్యక్తి...తనకు ఖానాపూర్‌లో ఉన్న ఐదు ఎకరాల భూమిని పూచీకత్తుగా చూపించారు. దీని విలువ రూ.7.26 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కోర్టుకు పూచీకత్తు బాండ్లు సమర్పించారు. అయితే సీబీఐ...ఇప్పటికే విక్రయించిన భూమిని పూచీకత్తుగా చూపించారని, వాటిని ఆమోదించరాదని కోర్టుకు నివేదించింది. ఈ అంశంపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 13కు వాయిదా వేసింది.
ఆ పూచీకత్తు చెల్లదు
Published Sat, Mar 21 2015 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement