ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ | Gali Janardhan Reddy gets bail | Sakshi
Sakshi News home page

ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్

Published Tue, Jan 20 2015 12:31 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ - Sakshi

ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్

హైదరాబాద్ : ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది.  సుప్రీంకోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.  బెయిల్ మంజూరుకు సీబీఐ అభ్యంతరం తెలపకపోవటంతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.  

ఓంఎసీ కేసులో 2011 సెప్టెంబర్ 5న జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.   ఏడు కేసుల్లోనూ గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావటంతో త్వరలో  జైలు నుంచి విడుదల కానున్నారు.  ప్రస్తుతం ఆయన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement