క్విడ్ ప్రో కో కేసులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు సోమవారం ఉదయం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఇదే సమయంలో ఓఎంసీ కేసు కూడా విచారణకు వచ్చింది.
అయితే, ఈ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈ విషయమై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యం కారణంగానే ఆమె హాజరు కాలేదని తెలిసింది. అయితే, ఈ విషయంలో కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మరుసటి వాయిదాకు కూడా శ్రీలక్ష్మి హాజరు కాలేకపోతే తప్పనిసరిగా మెడికల్ రిపోర్టు సమర్పించాలని ఆమె తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.
శ్రీలక్ష్మి గైర్హాజరుపై కోర్టు ఆగ్రహం
Published Mon, Aug 12 2013 11:28 AM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM
Advertisement
Advertisement