సాక్షి, హైదరాబాద్: తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే సీబీఐకోర్టు పిటిషన్‌ను కొట్టివేసిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టు వాదనలు వినిపించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఎలాంటి కొత్త అంశాలు లేకుండా అదనపు అభియోగ పత్రం దాఖలు చేస్తూ నిందితురాలిగా చేర్చారని సబితా ఇంద్రారెడ్డి నివేదించారు. తన డిశ్చార్జి పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ మరోసారి విచారణ చేపట్టారు.
ఆ అంశాలకు సమాధానం చెప్పలేదు
డిశ్చార్జి పిటిషన్‌లో తాను లేవనెత్తిన అభ్యంతరాలకు సీబీఐ కోర్టు సమాధానం చెప్పలేదని సబిత పేర్కొన్నారు. డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. గనుల శాఖ ప్రతిపాదనల ఆధారంగా మంత్రి ఆమోదం ఉంటుందని, ఆ శాఖ మంత్రిగా ఏం బాధ్యతలు ఉంటాయో కూడా సీబీఐ కోర్టు గుర్తించలేదని వివరించారు. వాదనలు విన్న సీజే...సీబీఐ వాదనల కోసం తదుపరి విచారణను వచ్చే ఈనెల 24కు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment