Nampally Cbi court
-
డిసెంబర్ 23న సత్యం కేసులో తుది తీర్పు
హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు డిసెంబర్ 23న వెలువడనుంది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం కేసు తుది తీర్పు తేదీని ప్రకటించింది. కాగా కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. -
'సత్యం' కేసులో తుదితీర్పు 30కి వాయిదా
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీని నాంపల్లి సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు తుది తీర్పును న్యాయస్థానం అక్టోబర్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. -
సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ సమన్లు
హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. జూన్ 4వ తేదీన సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఓఎంసీ కేసులో ఆమెపై దాఖలైన చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సబితా ఇంద్రారెడ్డిని నిందితురాలిగా చేర్చాలన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంపై అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. -
బెయిల్ షరతులు సడలించాలని జగన్ పిటిషన్
హైదరాబాద్ : బెయిల్ షరతులను సడలించాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఎంపీగా ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన భాద్యత తనపై ఉందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులోఉండాలని...ప్రజల మనోభావాలను ,వారి కష్ట నష్టాలను తెలుసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఓదార్పు యాత్రను కూడా కొనసాగించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి నివ్వాలని జగన్ కోర్టును కోరారు. -
నాంపల్లి కోర్టుకు హాజరైన వైఎస్ జగన్
-
నాంపల్లి కోర్టుకు హాజరైన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి ఆయన సీబీఐ కోర్టుకు బయల్దేరారు. తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ జగన్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు అయ్యారు. బెయిల్ పొందిన తర్వాత ఆయన మొదటిసారిగా కోర్టుకు హాజరు అయ్యారు. గత నెల 23న బెయిల్ మంజూరు చేసిన సీబీఐ కోర్టు.. కేసు విచారణలో భాగంగా ప్రతి వాయిదాకు హాజరుకావాలని షరతు విధించిన విషయం తెలిసిందే. కాగా జగన్‌ను చూసేందుకు ఆయన నివాసం వద్దకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాగా ఇదే కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి కోర్టుకు హాజరు కాగా మోపిదేవి వెంకట రమణ కోర్టుకు హాజరు కావల్సి ఉన్నా.... అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. మరోవైపు జగన్ కోర్టుకు హాజరు అయిన నేపథ్యంలో ....పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, మీడియా ప్రతినిధులను తప్ప, అనుమతి పత్రాలు ఉంటేనే మిగతావారిని కోర్టు లోపలకు అనుమతిస్తున్నారు. -
జగన్ బెయిల్ ఆంక్షలు సడలించవద్దు: సీబీఐ
హైదరాబాద్ : ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం తెలిపింది. నాంపల్లి సీబీఐ కోర్టులో సోమవారం సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జగన్ బెయిల్ ఆంక్షలు సడలించవద్దని కోరింది. సాక్షులంతా హైదరాబాద్ వెలుపలే ఉన్నారని, జగన్ పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున...వారిని ప్రభావితం చేయవచ్చని ని న్యాయస్థానంలో పేర్కొంది. ఈ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని..... వారి బెయిల్ పిటిషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపింది. బెయిల్ షరతులు సడలిస్తే తమ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని కౌంటర్ పిటిషన్లో వెల్లడించింది. సీబీఐ కౌంటర్ పిటిషన్‌పై జగన్ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. జగన్‌పై ఉన్నది హైలీ టెక్నికల్ కేసు అని. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రతి సాక్ష్యం డాక్యుమెంట్‌గా రికార్డు అయ్యిందన్నారు. 70మంది నిందితుల్లో 2౦మందిని నిర్దోషులని సీబీఐ చెప్పిందన్నారు. 9 కంపెనీల్లో క్విడ్ ప్రో కోనే లేదని సీబీఐ చెప్పిందన్నారు. కోర్టు కల్పించిన స్వేచ్చను తాము కోల్పోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులు ఉల్లంఘించమని సుశీల్ కుమార్ న్యాయస్థానానికి విన్నవించారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికే జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారని.... ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారని ఆ తర్వాత 4వ తేదీన గుంటూరు వెళ్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది. -
జగన్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు
-
జగన్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు
హైదరాబాద్ : ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయ సందర్శనకు, అక్టోబర్ 4న గుంటూరు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనేందుకు జగన్ అనుమతి కోరారు. విచారణ చేపట్టిన సీబీఐ నాంపల్లి కోర్టు ..... ఇరు వర్గాల వాదనలు విని... తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది. -
నేడు జగన్ పిటిషన్ విచారించనున్న సీబీఐ కోర్టు
-
నేడు జగన్ పిటిషన్ విచారించనున్న సీబీఐ కోర్టు
హైదరాబాద్ : ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు విచారించనుంది. బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2న ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరుతూ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు... విచారణను నేటికి వాయిదా వేశారు. -
ఇడుపులపాయకు అనుమతిపై విచారణ 30కి వాయిదా
హైదరాబాద్ : తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు అనుమతించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌పై సోమవారంలోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశించింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతుల సమావేశంలో, ట్రాక్టర్ల ర్యాలీని అక్టోబర్ 1న విజయమ్మ నేతృత్వంలో తలపెట్టడం, అనంతర పరిణామాల్లో జగన్ బెయిల్‌పై విడుదలవడం తెలిసిందే. ర్యాలీకి తాను స్వయంగా సారథ్యం వహించాలని ఆయన భావిస్తున్నారు. అయితే 1, 2 తేదీల్లో ఇడుపులపాయ వెళ్లాలని జగన్ యోచిస్తుండటం, 3న విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో ర్యాలీని 4న జరపాలని యోచిస్తున్నారు. అందులో పాల్గొనేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును జగన్ కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు అక్టోబర్ నాలుగో తేదీకి వాయిదా వేసింది. -
'ఇడుపాలపాయ వెళ్తా, అనుమతించండి'
-
'ఇడుపులపాయ వెళ్తా, అనుమతించండి'
హైదరాబాద్ : ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఇడుపులపాయ వెళ్లేందుకు, నాలుగో తేదీన గుంటూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే అక్టోబర్ 4న గుంటూరులో రైతులు నిర్వహిస్తున్న ర్యాలీ, సమావేశంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. జగన్మోహన్ రెడ్డికి జామీను మంజూరు సందర్భంగా ఆయనను హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
జగన్ విడుదలకు కోర్టు ఉత్తర్వులు జారీ
-
జగన్ విడుదలకు కోర్టు ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలకు నాంపల్లి సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల ఆర్డర్‌పై న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు మంగళవారం సంతకం చేస్తారు. కోర్టు సిబ్బంది ఆ ఉత్తర్వులను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేయనున్నారు. కోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి అయిదు గంటల మధ్యలో జగన్ మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. జగన్ విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. కోర్టు తెలిపిన అన్ని ష్యూరిటీలను అందచేసినట్లు తెలిపారు. -
జగన్ జామీను పత్రాల పరిశీలన పూర్తి
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌కు సంబంధించి జామీను పత్రాల పరిశీలన పూర్తయింది. వైఎస్ అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి మంగళవారం ష్యూరిటీ పత్రాలను నాంపల్లి సీబీఐ కోర్టుకు సమర్పించారు. వీరు సమర్పించిన పత్రాలను న్యాయమూర్తి దుర్గాప్రసాద్ పరిశీలించారు. జామీను ఇచ్చిన అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి వ్యక్తిగత వివరాలను న్యాయమూర్తి తెలుసుకున్నారు. ష్యూరిటీ పత్రాలను పరిశీలించిన కోర్టు... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలకు సంబంధించిన పత్రాలు సిద్ధమని సిబ్బందిని ఆదేశించింది. విడుదల ఆర్డర్ సిద్ధమైన వెంటనే... న్యాయమూర్తిపై వాటిపై సంతకం చేస్తారు. కోర్టు సిబ్బంది ఆ ఆదేశాలను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేస్తారు. జైల్లో కోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టవచ్చు. -
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆయనకు సీబీఐ కోర్టు మధ్యంతర బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ మామ రామ్ ప్రకాష్ ఆర్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీబీఐ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు నిమ్మగడ్డ సుప్రీంకోర్టు, హైకోర్టు, నాంపల్లి కోర్టుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినా... సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ సీబీఐ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. -
అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి ష్యూరిటీ పత్రాల సమర్పణ
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ కోసం కోర్టు ఆదేశాల ప్రకారం సొంత పూచీకత్తు సమర్పించారు. మంగళవారం ఉదయం జామీను పత్రాలతో అవినాష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి.... నాంపల్లి కోర్టుకు వచ్చారు. పత్రాలను న్యాయమూర్తి పరిశీలించిన అనంతరం కోర్టు ఆర్డర్స్ ఇవ్వనుంది. కాగా నాంపల్లి కోర్టు వద్దకు జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు వారిని లోనికి అనుమతించటం లేదు. -
కోర్టులో జామీను పత్రాలు సమర్పించనున్న లాయర్లు
-
కోర్టులో జామీను పత్రాలు సమర్పించనున్న లాయర్లు
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదలకు సంబంధఙంచిన జామీను పత్రాలను సమర్పించేందుకు ఆయన తరపు న్యాయవాదులు మంగళశారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. జామీను పత్రాలు పరిశీలించి విడుదల ఆర్డర్స్‌ను కోర్టు ఇవ్వనుంది. కోర్టు ప్రక్రియ ముగిసేసరికి రెండు గంటల సమయం పట్టనుంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. కోర్టు ఆర్డర్స్ ...చంచలగూడ జైలు అధికారులకు అందగానే ....జగన్ విడుదల కానున్నారు. నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఇద్దరు జామీన్‌దారులు రెండు లక్షల పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. -
జగన్ బెయిల్ పిటిషన్‌పై 23న తీర్పు
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి కాగా, తీర్పు ఈనెల 23వ తేదీకి వాయిదా పడింది. క్విడ్ ప్రో కో కేసులో దర్యాప్తు పూర్తైనందున బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు న్యాయవాది బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టును కోరారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. బెయిల్ అనేది ప్రాథమిక హక్కని... వ్యక్తిపై ఆధారపడి బెయిల్ నిరాకరించడం తగదని అన్నారు. విచారణలో తనను తాను డిఫెండ్ చేసుకునే నిందితుడికి బెయిల్ మంజూరు చేయొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను జగన్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఒకవేళ సాక్ష్యుల్ని ప్రభావితం చేశారని భావిస్తే... బెయిల్‌ను రద్దు చేయొచ్చని ఆయన తెలిపారు. -
మోపిదేవి బెయిల్‌పై తీర్పు 16కి వాయిదా
హైదరాబాద్ : మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యచికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోపిదేవి వెంకటరమణ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి తరఫున ఆయన న్యాయవాది సురేందర్‌రావు గత గురువారం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా తాను తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నానని, గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ఇటీవల కేర్ ఆసుపత్రి వైద్యులతో పరీక్షలు చేయించుకున్నానని మోపిదేవి తెలిపారు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఈ మేరకు కేర్ వైద్యుల అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించారు. చికిత్సలో భాగంగా డాక్టర్ల పర్యవేక్షణలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్లకు తగ్గకపోతే శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో తనకు మూడు నెలల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువాదనలు పూర్తవటంతో తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. -
గడువు కావాలన్న సీబీఐ.. జగన్ బెయిల్‌పై విచారణ 18కి వాయిదా
కౌంటర్ దాఖలు చేయడానికి తమకు మరింత సమయం కావాలని సీబీఐ కోరడంతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. జగన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటే తమకు కనీసం ఐదు రోజుల గడువు కావాలని సీబీఐ కోరింది. దీంతో సెప్టెంబర్ 18వ తేదీన కోర్టు ఎదుట అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించి, అదే రోజుకు విచారణను వాయిదా వేసింది. ఆస్తుల కేసులో విచారణను నాలుగు నెలల్లోగా ముగించాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 9వ తేదీతోనే ముగియడంతో, సుప్రీం సూచన మేరకు వైఎస్ జగన్.. నాంపల్లి సీబీఐ కోర్టులో బుధవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 10వ తేదీన సీబీఐ మూడు అదనపు చార్జిషీట్లు దాఖలు చేసింది. దాంతో కలిపి మొత్తం ఇప్పటివరకు 8 చార్జిషీట్లు దాఖలుచేసినట్లయింది. ఆస్తుల కేసులో సీబీఐ గత సంవత్సరం మే 27వ తేదీన జగన్మోహనరెడ్డిని విచారణకు పిలిపించి, ఆ పేరుతో అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన చంచల్‌గూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండులో ఉండాలి. తాము త్వరలోనే తుది చార్జిషీటు దాఖలుచేయనున్నట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాల్లోనూ ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నందున తాను ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందని జగన్ తన న్యాయవాది ద్వారా కోర్టుకు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. -
జగన్ బెయిల్‌పై విచారణ 18కివ వాయిదా
-
జగన్ బెయిల్‌పై విచారణ 18కి వాయిదా
హైదరాబాద్ : బెయిల్ కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఐదు రోజులు గడువివ్వాలన్న సీబీఐ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అదే రోజు వాదనలు వింటానని కోర్టు ప్రకటించింది. సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు నెలల గడువు పూర్తవడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ కోరుతూ నిన్న సీబీఐ కోర్టులో బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణను తాను ఏ విధంగానూ ప్రభావితం చేయకపోయినా 'సాక్షి' పెట్టుబడుల వ్యవహారంలో 15 నెలలకు పైగా తనను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారని... ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తనకు బెయిల్ మంజూరు చేయాలని జగన్మోహన్ రెడ్డి సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
జగన్ బెయిల్‌పై నేడు విచారణ
హైదరాబాద్ : బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ కోసం ఆయన నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ అంశంపై నేడు విచారణ జరగనుంది. సీబీఐ విచారణను తాను ఏ విధంగానూ ప్రభావితం చేయకపోయినా 'సాక్షి' పెట్టుబడుల వ్యవహారంలో 15 నెలలకు పైగా తనను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారని... ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తనకు బెయిల్ మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. జగన్ తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి ఈ మేరకు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదుగుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ సీపీయే నని ఈ విషయాన్ని జాతీయ మీడియా సైతం సర్వేలు జరిపి తేల్చిందని జగన్ తన పిటిషన్లో తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని విభజిస్తూ అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. విభజనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని... విభజనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జగన్ తన పిటిషన్లో తెలిపారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రజలతో కలిసి వారి ఆకాంక్షల మేరకు పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. వివాదాస్పద నిర్ణయంతో ఏర్పడిన ఉద్రిక్తతలను నివారించడానికి, శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి తాను కీలకపాత్ర పోషించగలనన్నారు. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని జగన్ తన పిటిషన్లో కోరారు. కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి 2011 ఆగస్టు 17న జగన్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాదాపు తొమ్మిది నెలల పాటు... విచారణలో అధిక భాగం పూర్తయి, మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత గత ఏడాది మే 27న అరెస్టుకు సరైన కారణాలు చూపకుండానే సీబీఐ అదుపులోకి తీసుకుంది. తనను అరెస్ట్ చేసి 15 నెలలుగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచడం న్యాయ సమ్మతం కాదని.. తన హక్కులను హరించడమేనని జగన్ తన పిటిషన్లో తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుందని... అందుకని ఈ దర్యాప్తును అడ్డుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేయటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సీసీ నంబర్ 8 చార్జిషీట్‌తోపాటు ఈ కేసు మొత్తానికి తన రిమాండ్ వర్తిస్తుందని, 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయకపోతే బెయిల్‌కు అర్హుడినని గత ఏడాది హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బెయిల్ అనేది నిబంధన... కేసు రుజువయ్యే వరకూ నిందితులందరినీ నిరపరాధులుగానే భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టం చేసింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 9న తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని జగన్ తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. -
సెప్టెంబర్ 6వరకూ జగన్ రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్‌ను సెప్టెంబర్ 6వ తేదీవరకూ పొడిగిస్తూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, కేవీ బ్రహ్మానందరెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న వీరందరినీ సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. మరోవైపు ఒఎంసీ కేసులో గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్ సోమవారం సీబీఐ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కాగా ఐఏఎస్ అధికారణి శ్రీలక్ష్మి అనారోగ్య కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరపు న్యాయవాదులు మెడికల్ రిపోర్టును సమర్పించారు. కాగా జగన్ పెట్టుబడుల కేసులో విచారణ నిమిత్తం మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సోమవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వారు తమ వాదనలను కోర్టుకు తెలియచేశారు.