
బెయిల్ షరతులు సడలించాలని జగన్ పిటిషన్
బెయిల్ షరతులను సడలించాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ : బెయిల్ షరతులను సడలించాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఎంపీగా ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన భాద్యత తనపై ఉందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులోఉండాలని...ప్రజల మనోభావాలను ,వారి కష్ట నష్టాలను తెలుసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఓదార్పు యాత్రను కూడా కొనసాగించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి నివ్వాలని జగన్ కోర్టును కోరారు.