Relaxation of bail
-
జగన్ బెయిల్ షరతుల పిటిషన్ 18కి వాయిదా
-
జగన్ బెయిల్ షరతుల పిటిషన్ 18కి వాయిదా
హైదరాబాద్ : బెయిల్ షరతుల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈనెల 18కు వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలంటూ సీబీఐ ఈ సందర్భంగా కోర్టును కోరింది. దీంతో పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు సడలింపు నివ్వాలని జగన్ కోర్టును కోరారు. సమైకాంధ్ర ఉద్యమంలో పాల్గొనాల్సి ఉంది. ప్రజల మనోభావాలను తెలుసుకోవాల్సిన అవసరం పార్టీ అధినేతగా తనపై ఉందని జగన్ కోరారు. మరోవైపు బెంగళూరు, చెన్నై వెళ్లేందుకు షరతులను సడలించాలంటూ ఆడిటర్ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును సీబీఐ కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. కోర్టు వాయిదాకు హాజరైతే షరతుల నుంచి మినహాయింపు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని సీబీఐ- కోర్టుకు తెలిపింది. -
బెయిల్ షరతులు సడలించాలని జగన్ పిటిషన్
హైదరాబాద్ : బెయిల్ షరతులను సడలించాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఎంపీగా ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన భాద్యత తనపై ఉందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులోఉండాలని...ప్రజల మనోభావాలను ,వారి కష్ట నష్టాలను తెలుసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఓదార్పు యాత్రను కూడా కొనసాగించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి నివ్వాలని జగన్ కోర్టును కోరారు.