
'సత్యం' కేసులో తుదితీర్పు 30కి వాయిదా
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీని నాంపల్లి సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు తుది తీర్పును న్యాయస్థానం అక్టోబర్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.