Ramalinga Raju
-
తప్పుమీద తప్పుచేస్తూ.. వేలకోట్ల సామ్రాజ్యం నాశనం..
బైర్రాజు రామలింగరాజు అలియాస్ సత్యం రామలింగరాజు అంటే 2009కు పూర్వం ఒక సంచలనం. 1987లో హైదరాబాద్‌లోని ఓ చిన్న భవనంలో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ 2008 నాటికి ఏటా రూ.12 వేల కోట్లు రెవెన్యూ సంపాదించే స్థాయికి ఎదిగింది. ఆ 20 మంది ఉద్యోగులు కాస్తా 52000 వేల మంది అయ్యారు. దాంతో దేశంలోనే టాప్ 5 కంపెనీల్లో సత్యం కంప్యూటర్స్ చోటు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో ఫార్చున్ 500 కంపెనీల్లో 187 స్థానాన్ని చేజిక్కించుకుంది. కేవలం రూ.10కు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ షేర్ధర ఏకంగా రూ.544కు పెరిగింది. దేశంలోనే కాకుండా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోనూ సత్యం కంప్యూటర్స్ కంపెనీ ట్రేడయ్యేది. ఆ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలానుకున్న అప్పటి యువతకు రామలింగరాజు ఎంతో ఆదర్శంగా కనిపించేవారు. అంత సామ్రాజ్యాన్ని విస్తరించిన కంపెనీ వ్యవస్థాపకులు బి.రామలింగరాజు చేసిన చిన్న తప్పిదంతో అంతా కుప్పకూలింది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. బైర్రాజు రామలింగరాజు సెప్టెంబర్ 16, 1954లో ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జన్మించారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో బీకామ్ చదివారు. తర్వాత అమెరికాలో ఓహయో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. 1977లో భారతదేశానికి తిరిగి వచ్చిన రామలింగరాజు 22 ఏళ్ల వయసులో నందినిని వివాహం చేసుకున్నారు. రామలింగరాజు పలు వ్యాపారాల్లోకి ప్రవేశించారు. రూ.9 కోట్ల మూలధనంతో ధనంజయ హోటల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక సంఘం సహకారంతో శ్రీ సత్యం స్పిన్నింగ్ మిల్స్ వంటి సంస్థలు స్థాపించాడు. ఈ వ్యాపారాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంవైపు మొగ్గుచూపారు. దాంతో మేటాస్ ఇన్ఫ్రా అనే సంస్థను స్థాపించారు. రామలింగరాజు 1987లో సికింద్రాబాద్‌లోని పీ అండ్ టీ కాలనీలో 20 మంది ఉద్యోగులతో సత్యం కంప్యూటర్స్ పేరుతో కంప్యూటర్ సేవల సంస్థను స్థాపించారు. 1991లో సత్యం కంప్యూటర్స్ జాన్ డీర్ అనే ఫార్చ్యూన్ 500 సంస్థ నుంచి ప్రాజెక్టు దక్కించుకుంది. 1992లో ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో నమోదయింది. 1998లో రామలింగరాజు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యం కంప్యూటర్స్ సంస్థను 50 వేల ఉద్యోగులతో 50 దేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. 1999లో రాజు అప్పుడే ప్రజాదరణ పొందుతున్న ఇంటర్నెట్ను ఆధారం చేసుకుని సత్యం కంప్యూటర్స్‌కు అనుబంధ సంస్థగా సత్యం ఇన్ఫో వే (సిఫీ) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థను తర్వాత వేగేశ్న సంస్థకు విక్రయించారు. సత్యం కుంభకోణం జనవరి 2009లో సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు సత్యం కంపెనీ పటిష్ఠంగా ఉందని మదుపరులను ఆకర్షించడానికి గత అక్టోబర్‌లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించి విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. ‘ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థ ఇంతలా పడిపోతున్నా సత్యం కంపెనీ భారీ లాభాల్లో ఉంది’ అని రాజు అన్నారు. అప్పటికే కొంతకాలంగా మేటాస్ ఇన్ఫ్రాలో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దాంతోపాటు మేటాస్ ప్రాపర్టీస్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. కంపెనీకి అన్ని లాభాలు వస్తున్నపుడు మేటాస్‌లో వాటా కొనుగోలు చేయచ్చుకదా అనే ప్రశ్నలు మదుపరుల్లో ఎక్కువయ్యాయి. డిసెంబర్ 2008లో మేటాస్ కొనుగోలు ప్రయత్నం విఫలం కావడంతో భారతీయ పెట్టుబడిదారుల్లో కార్పొరేట్ పాలనపై ఆందోళన మొదలైంది. సత్యం షేరు ధరపడిపోయింది. జనవరి 2009లో సత్యం కంపెనీ బ్యాలెన్స్‌షీట్లలో కొన్ని సంవత్సరాలుగా తప్పుడు లెక్కలు చూపించానని రాజు ఒప్పకుంటూ లేఖ రాశారు. 2003–07లో సత్యం బ్యాలెన్స్ షీట్‌లోని మొత్తం ఆస్తులు వాస్తవ విలువ కంటే మూడు రెట్లు పెరిగి దాదాపు రూ.12 వేల కోట్లకు చేరుకున్నాయి. దాదాపు రూ.7,000 కోట్ల అకౌంటింగ్ మోసాన్ని అంగీకరించారు. ఒక చిన్న అబద్ధం.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తిరిగి తప్పు చేయడం.. ఇలా చేస్తూనే పోయామని ఆయన తన లేఖలో తెలిపారు. బ్యాలెన్స్ షీట్లో తెలిపిన లాభాలు, వాస్తవ లాభాల్లో చాలా తేడాలున్నాయి. 2003 నుంచి 2007 మధ్య కాలంలో ప్రతి త్రైమాసికంలో అధికంగానే చూపించామని చెప్పారు. ఏళ్ల గడుస్తున్న కొద్దీ అది పెరుగుతూ పోయిందని తెలిపారు. ఆ మధ్యలో కంపెనీలో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దానికితోడు 2008 ద్రవ్యోల్బణ ప్రభావంతో కంపెనీ కుప్పకూలిందని చెప్పారు. కొన్నిసార్లు నష్టాల్లో ఉన్న కంపెనీ త్రైమాసిక ఫలితాలను మెరుగ్గా చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఇది పులిపై స్వారీ చేస్తూ దానికి బలవుకుండా ఎలా దిగాలో తెలియనట్లుగా ఉందని రాజు వివరించారు. విచారణ సాగుతోందిలా.. రాజు ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సత్యం షేర్లలో వ్యాపారం చేయడానికి డమ్మీ ఖాతాలను ఉపయోగించారు. నిధులను పక్కదారి పట్టించేందుకు ఈ ఖాతాలే కారణమని ఆరోపణలు వచ్చాయి. కంపెనీ నగదు నిల్వలను రూ.7వేల కోట్లకు పెంచినట్లు రాజు అంగీకరించారు. జనవరి 2009న సత్యం బోర్డు నుండి రాజీనామా చేశారు. భారత ప్రభుత్వం సత్యం సంస్థ నిర్వహణను తాత్కాలికంగా కొందరు అధికారులకు అప్పచెప్పింది. తర్వాత 2009 ఏప్రిల్‌లో వేలం ప్రక్రియ నిర్వహించింది. దీనిలో టెక్ మహీంద్రా సత్యం కంపెనీని గెలుచుకుంది. దాంతో మహీంద్రా సత్యంగా పేరు మార్చింది. రాజు, అతడి సోదరుడు కంపెనీ ఎండీ బి.రామరాజును వీఎస్కె కౌముది నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సత్యం కంప్యూటర్స్‌లో భాగస్వాములైన రాజు కుటుంబ సభ్యులకు చెందిన 44 ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసింది. 2009 సెప్టెంబర్‌లో రాజు చిన్నపాటి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. రోజుకు ఒకసారి స్థానిక పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని, ప్రస్తుత సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను 26 అక్టోబర్ 2010న సుప్రీంకోర్టు రద్దు చేసి, నవంబర్ 2010లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సకాలంలో అభియోగాలను దాఖలు చేయడంలో విఫలమైనందున సుప్రీంకోర్టు నవంబర్ 2011న రాజుకు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ చట్టం ప్రకారం నిందితుడిపై 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉంటుంది. 2013 అక్టోబర్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాజుతో పాటు మరో 212 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేట్ ముసుగులో ఆదాయాన్ని దారి మళ్లించి అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారని తెలిపింది. 2015 ఏప్రిల్‌లో రామలింగ రాజు అతని సోదరులకు ఏడేళ్లు జైలు శిక్ష, రూ.5.5 కోట్ల జరిమానా విధించారు. 2015 మేలో దోషులుగా నిర్ధారించిన నెలలోపే రామలింగరాజు, మిగతా వారందరికీ హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు రాజు, అతడి సోదరునికి బెయిల్ కోసం రూ.10 లక్షలు, ఇతర దోషులకు రూ. 50 వేలు నిర్ణయించింది. 2018 జనవరిలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ డైరెక్టర్లు, ఉద్యోగులకు సహకరించినందుకు గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్హౌస్ను సెబీ దేశంలోని కంపెనీల్లో ఆడిట్ చేయకుండా రెండేళ్లపాటు నిషేధించింది. దాంతోపాటు సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ఇతరులకు 14 ఏళ్ల పాటు ఎలాంటి మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. 2018 అక్టోబరు, నవంబరులో సెబీ ఇచ్చిన రెండు ఉత్తర్వుల్లో రామలింగరాజు, ఆయన సహచరులు అక్రమంగా ఏ మేరకు లబ్ది పొందారో తెలిపింది. ఆ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపేసింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అందుకు ఈ ఏడాది నవంబరు 30వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు సెబీ తాజాగా 96 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్, జి.రామకృష్ణ రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించింది. ఈ మొత్తాన్ని 2009 జనవరి 7వ తేదీ నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 2000-2008 వరకు దాతృత్వ కార్యక్రమాలు.. బైర్రాజు ఫౌండేషన్ రామలింగరాజు తండ్రి బైర్రాజు సత్యనారాయణ రాజు జ్ఞాపకార్థం రాజు, అతడి సోదరులు రామరాజు, సూర్య నారాయణ రాజు కలిసి జులై 2001లో బైర్రాజు ఫౌండేషన్ స్థాపించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాల్లో 200 గ్రామాలను దత్తత తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, ప్రాథమిక విద్య, అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి వంటి 40 విభిన్న కార్యక్రమాలను అందించింది. అత్యవసర నిర్వహణ, పరిశోధనా సంస్థ (EMRI 108) ఆగస్టు 2005లో రాజు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (EMRI 108) పేరుతో 24X7 అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సత్వర సేవలను అందించేలా ఉచిత ఫోన్ నంబరు సాకర్యం కల్పించారు. మొదట్లో కేవలం 75 అంబులెన్స్‌లతో ప్రారంభమైన ఎమ్రీ ప్రస్తుతం 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 10,697 అంబులెన్స్‌లకు విస్తరించింది. రోజుకు 26,710 అత్యవసర సేవలు అందిస్తోంది. ఆరోగ్య నిర్వహణ, పరిశోధన సంస్థ (HMRI 104) సత్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో 2007లో హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (HMRI 104) సేవలు ప్రారంభించారు. అర్హత కలిగిన వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సమాచారం అందుబాటులో లేని గ్రామీణ పేదల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: ఆ విషయాలు పంచుకోవడంలో పురుషులకు సిగ్గు.. : టాప్ హీరో నాంది ఫౌండేషన్ 1998లో నాంది ఫౌండేషన్‌ను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన వ్యాపార సంస్థల అధిపతులైన కె.అంజి రెడ్డి-డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రమేష్ గెల్లి-గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వ్యవస్థాపకులు, బైర్రాజు రామలింగరాజు-సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఛైర్మన్, కె.ఎస్.రాజు నాగార్జున గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్లతో కలిపి దీన్ని రూపొందించారు. దీని వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను పెంచాలని నిర్ణయించారు. దాంతో సమాజంలోని పేద, అట్టడుగు వర్గాల ప్రజల్లో అక్షరాస్యత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పాఠశాలలలో ప్రతిరోజూ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించినట్లు సమాచారం. -
కుంభకోణం బయటపడే ఏడాది ముందే రామలింగరాజును కలిశా : ఆనంద్ మహీంద్రా
ముంబై: సత్యం కంప్యూటర్స్ సంక్షోభం బైటపడటానికి ఏడాది ముందే అందులో తమ ఐటీ సంస్థ టెక్ ఎంను విలీనం చేద్దామనుకున్నట్లు మహీంద్రా గ్రూ ప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఇందుకు సంబంధించి అప్పట్లో సత్యం చైర్మన్ రామలింగరాజుకు ప్రతిపాదన కూడా చేసినట్లు తెలిపారు. కానీ ఆయన నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని మహీంద్రా తెలిపారు. బహుశా కంపెనీ ఖాతాల్లో లొసుగులు ఉండటమే ఇందుకు కారణమై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2009 లో సత్యం కంప్యూటర్స్‌ను టెక్ మహీంద్రా టేకోవర్ చేసే క్రమంలో 100 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలపై పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటైనప్పుడు రామలింగ రాజుతో పరిచయం ఏర్పడిందని మ హీంద్రా చెప్పారు. అప్పట్లో టెక్ ఎం, సత్యం వ్యా పారాల మధ్య సారూప్యతలు ఉండేవని తెలిపారు. అందుకే టెక్ ఎంను సత్యంలో విలీనం చేసే ఉద్దేశంతో రాజుకు ఆఫర్ ఇచ్చినట్లు మహీంద్రా పేర్కొన్నారు. 2009లో రూ. 5,000 కోట్ల స్కాము బైటపడిన తర్వాత సత్యంను టెక్ ఎం టేకోవర్ చేసింది. -
ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీఎంసెట్–2020 ప్రాథమికకీ శనివారం విడుదల చేసినట్లు ఎంసెట్ చైర్మన్, జేఎన్టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్– మెడికల్ విభాగాలకు జరిగిన పరీక్షలకు సంబంధించి మొత్తం 14 పేపర్ల ప్రాథమిక ‘కీ’ రెస్పాన్స్ షీట్లను ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్ సైట్లో పొందుపర్చారు. ప్రాథమిక కీ లోని అభ్యంతరాలకు సంబంధించి ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఎంసీఈటీ’ వెబ్సైట్లో అభ్యంతరాల స్వీకరణకు నమూనా ఫారం పొందుపరిచారు. కీ పై అభ్యంతరాలు ఉంటే నమూనా ఫారం పూర్తిచేసి ఈ నెల 28 సాయంత్రం 5లోగా ‘ఏపీఈఏఎంసీఈటీ 2020ఓబీజేఈసీటీఐఓఎన్ఎస్ ఎట్దరేట్ జీమెయిల్.కామ్’ మెయిల్ ఐడీకి పంపించాలి. -
‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ వీక్షించనున్న టీ. హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్'లోని సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజుపై రూపొందించిన ఎపిసోడ్‌ను తెలంగాణ హైకోర్టు వీక్షించనుంది. 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ డాక్యుమెంటరీని విడుదల చేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ క్రమంలో ఈ సిరీస్‌ను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి అనుమతించాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు రామలింగరాజుకు సంబంధించిన ఎపిసోడ్‌ను తాము మొదట చూస్తానని ఇద్దరు జడ్జీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. (‘అలా చేయొద్దని చట్టంలో ఎక్కడుంది’) నెట్‌ఫ్లిక్స్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌ను ఆన్లైన్ వేదికల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా తీసినట్లు పేర్కొన్నారు. కేవలం 49 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ను చూడటం ద్వారా డాక్యుమెంటరీ విడుదలను నిలిపివేయడం రచయితలు,చిత్రనిర్మాతల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం అవుందని పేర్కొన్నారు. అలాగే ట్రయల్ కోర్టు తమ వాదనలు వినకుండా వెబ్ సిరీస్ విడుదలను నిలిపివేసిందన్నారు. అయితే ఇప్పటికే సత్యం కేసులో రామలింగరాజు దోషిగా తేలడంతో ఆయనకు సంబంధించిన ప్రతి విషయం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తుందన్నారు. కాబట్టి రామలింగరాజు దాఖలు చేసిన అప్పీల్‌పై ఈ సిరీస్ ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 న హైదరాబాద్‌లోని స్థానిక సివిల్ కోర్టు నెట్‌ఫ్లిక్స్ తన వెబ్ సిరీస్ 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్-ఇండియా' ప్రసారం చేయకుండా తాత్కాలిక మధ్యంతర స్టే జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కు సంబంధించి 7 వేల కోట్ల అకౌంటింగ్ కుంభకోణంలో దోషిగా తేలిన బి రామలింగరాజు ఆ వెబ్ సీరీస్ ఆపాలంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. బాయ్స్ బిలియనీర్స్ సీరిస్ సత్యం కుంభకోణం నేపథ్యంలోనే తనపై తీశారనే అనుమానం ఉందని తనకు ఉన్న గోప్యత హక్కులను ఈ సీరీస్ ఉల్లంఘిస్తుందని రామలింగ రాజు ఆరోపించారు. తనపై ఉన్న కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న కారణంగా తనను నేరస్తుడిగా చూపించే ప్రయత్నంలో భాగంగా వస్తున్న వెబ్ సీరీస్ ఆపాలని కోర్టును కోరారు నెట్‌ఫ్లిక్స్ వాదనలు విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రత్యేక వెబ్ లింక్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్ న్యాయవాది అందించిన పాస్వర్డ్ ద్వారా ఎపిసోడ్ చూడటానికి అంగీకరించారు. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణ సెప్టెంబర్ 25 న జరుగుతుంది. కాగా వివాదాస్పద బాడ్ బాయ్ బిలియనీర్స్ వెబ్ సిరీస్ సత్యం కంప్యూటర్స్ రామలింగరాజుతోపాటు మరో 3 మంది భారతీయ బిలియనీర్ల కథ ఆధారంగా రూపొందించారు. బ్యాంకులను, జనాన్ని మోసగించి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా , సహారా సుబ్రతా రాయ్ పీఎన్ బీ స్కాంలో నిందితులైన నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీలను ఉద్దేశించి తీసినట్లు అర్ధమవుతుంది. -
రూ. 813 కోట్లు కట్టండి సత్యం రామలింగరాజు
న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ. 813 కోట్లు కట్టాలంటూ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు తదితరులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. అలాగే 14 ఏళ్ల పాటు వారు సెక్యురిటీస్ మార్కెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా నిషేధం విధించింది. సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ సూచనల ప్రకారం సెబీ ఈ మేరకు కొత్తగా మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆదేశించిన రూ. 1,258.88 కోట్ల మొత్తాన్ని తాజాగా రూ. 813.40 కోట్లకు తగ్గించింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ రూ. 675 కోట్లు, రామలింగ రాజు దాదాపు రూ. 27 కోట్లు, సూర్యనారాయణ రాజు రూ. 82 కోట్లు, రామ రాజు సుమారు రూ. 30 కోట్లు, కట్టాల్సి ఉంటుంది. స్కాము వెలుగులోకి వచ్చిన 2009 జనవరి 7 నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలి. మరోవైపు, నిషేధానికి సంబంధించి ఇప్పటికే అమలైన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని సెబీ పేర్కొంది. -
రామలింగరాజు కుటుంబ సభ్యుల పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి.రామలింగరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, మరదలు ఝాన్సీ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. ఐటీ శాఖ అధికారుల నిర్ణయాన్ని అప్పిలెట్ ట్రిబ్యునల్ సమర్థించిన నేపథ్యంలో ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
సత్యం రాజు కుటుంబీకులను ట్రేడింగ్‌కు అనుమతించొద్దు
స్టాక్ బ్రోకర్లకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సూచన న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానాలు విధించిన దరిమిలా స్టాక్ ఎక్స్చేంజీలు తదుపరి చర్య లు మొదలుపెట్టాయి. స్కామ్ లో నిందితులైన సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజుతో పాటు ఆయన సంబంధీకులు, సంస్థలు స్టాక్‌మార్కెట్ లావాదేవీల్లో ఏడేళ్ల పాటు పాల్గొనకుండా చూడాలని ట్రేడింగ్ సభ్యులకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచించాయి. నిషేధం ఎదుర్కొంటున్న వారిలో రామలింగ రాజు తల్లి బి. అప్పలనరసమ్మ, ఆయన ఇద్దరు కుమారులు తేజ రాజు .. రామ రాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఝాన్సీ రాణి (సూర్యనారాయణ రాజు భార్య), చింతలపాటి శ్రీనివాస రాజు (అప్పట్లో సత్యం డెరైకర్)తో పాటు చింతలపాటి హోల్డింగ్స్, ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ సంస్థలు ఉన్నాయి. అక్రమంగా ఆర్జించిన రూ. 1,800 కోట్లు కట్టాలంటూ రామలింగ రాజు సంబంధీకులు, సంస్థలను సెబీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 2009 జనవరి 7 నుంచి వడ్డీ కింద మరో రూ. 1,500 కోట్లు కూడా వీరు కట్టాల్సి ఉంటుంది. సత్యం ఖాతాల్లో కుంభకోణం జరిగిందంటూ 2009లో రామలింగరాజు స్వయంగా వెల్లడించడంతో స్కామ్ వెలుగులోకి రావడం, ఆయన జైలుకెళ్లడం, కంపెనీని టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. -
3,349 కోట్లు కట్టండి..
సత్యం స్కామ్‌లో రామలింగరాజు సంబంధీకులకు సెబీ తాజా ఆదేశాలు - 45 రోజుల్లోగా చెల్లించాలని ఉత్తర్వులు ముంబై: సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి అక్రమంగా ఆర్జించిన రూ. 1,849 కోట్లు, వడ్డీతో పాటు 45 రోజుల్లోగా కట్టాలని సంస్థ వ్యవస్థాపకుడు రామలింగరాజు సంబంధీకులైన 10 మంది వ్యక్తులు, సంస్థలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. జరిమానా కింద.. 2009 జనవరి 7 నుంచి ఈ మొత్తంపై వడ్డీ సుమారు రూ. 1,500 కోట్లు కూడా వారు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 3,349 కోట్లు దాకా కట్టాల్సి వస్తుంది. గతంలోనూ ఈ మొత్తానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. తాజా ఆదేశాల్లో రాజు, ఆయన సోదరులు, తల్లితో పాటు మరికొందరు వ్యక్తులు, ప్రమోటరు కుటుంబానికి చెందిన కంపెనీ వేర్వేరుగా కట్టాల్సిన మొత్తాలను సెబీ నిర్ణయించింది. దీని ప్రకారం రామలింగరాజు.. ఆయన సోద రుడు రామరాజు రూ. 56 కోట్లు, మరో సోదరుడు సూర్యనారాయణరాజు రూ. 90 కోట్లు, వారి తల్లి అప్పలనరసమ్మ రూ. 8 కోట్లు కట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు సూర్యనారాయణరాజు భార్య ఝాన్సీరాణి రూ. 8.5 కోట్లు, రామలింగరాజు ఇద్దరు కుమారులు తేజరాజు, రామరాజు సుమారు రూ. 95 కోట్లు కట్టాలి. ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ రూ. 1,259 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రమోటరు గ్రూప్, రాజు సోదరులకు ఫ్రంట్ కంపెనీగా ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ వ్యవహరించిందని 39 పేజీల ఉత్తర్వులో సెబీ పేర్కొంది. అటు సత్యం మాజీ డెరైక్టరు చింతలపాటి శ్రీనివాస్ రాజు, ఆయన తండ్రి అంజిరాజు చింతలపాటి (విచారణ దశలోనే కన్నుమూశారు), చింతలపాటి హోల్డింగ్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఐఈసీసీఎల్) కూడా నిర్దేశిత మొత్తాలను కట్టాల్సి ఉంటుంది. 2009 జనవరి 7 నుంచి 12 శాతం వడ్డీ సహా ఈ మొత్తాలను 45 రోజుల్లోగా కట్టాలని ఆదేశించింది. ఐఈసీసీఎల్ తర్వాత దశల్లో మేటాస్‌ను కొనుగోలు చేసినందున ఇన్సైడర్ ట్రేడింగ్‌లో దాని ప్రమేయం ఉండదు కనుక సంస్థపై నిషేధ చర్యలు తీసుకోవడం లేదని సెబీ పేర్కొంది. అయితే, మేటాస్ ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన నిధులను అది తిరిగివ్వాల్సిందేనని తెలిపింది. సత్యం ఖాతాల్లో కుంభకోణం జరిగిందంటూ 2009లో రామలింగరాజు వెల్లడించడంతో స్కామ్ వెలుగులోకి రావడం, ఆయన జైలుకెళ్లడం, కంపెనీని టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. -
సత్యం రామలింగరాజు విడుదల
-
సత్యం రామలింగరాజు విడుదల
హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజు మరో ఏడుగురు బెయిలుపై బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారమే వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందడం జాప్యం జరగడం వల్ల వారు ఈ రోజు విడుదలయ్యారు. సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రామలింగరాజు, అతని సోదరుడు రామరాజు లక్ష రూపాయల చొప్పున, మిగతా నిందితులు 50 వేల రూపాయల పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు వారు పూచీకత్తు సమర్పించి విడుదలయ్యారు. -
సత్యం రాజుకు హైకోర్టులో నిరాశ
-
సత్యం రాజుకు హైకోర్టులో నిరాశ
సత్యం కంప్యూటర్స్ స్కాం కేసులో నిందితులు రామలింగరాజు తదితరులకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవాలు చేస్తూ వాళ్లు దాఖలు చేసిన అప్పీలును విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలిన వాళ్లంతా తొలుత నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులోనే తమ అప్పీలును దాఖలు చేయాల్సి ఉంటుంది. -
పుస్తక పఠనంలో రామలింగరాజు
రోజుకు 10-15 గంటల పాటు వాటితోనే కాలక్షేపం సాధారణ ఖైదీలానే దినచర్య సోమవారం పని కేటాయించే అవకాశం.. హైదరాబాద్: ‘సత్యం’ కుంభకోణం కేసులో ఏడేళ్ల శిక్షఖారారై చర్లపల్లి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రామలింగరాజు అధికసమయం పుస్తక పఠనంతో గడిపేందుకే ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఆయన రోజుకు 10-15 గంటల పాటుగా రీడింగ్ రూంలో ఉంటూ పుస్తక పఠనం చేస్తున్నారు. ఎక్కువగా బయోలజీ, కెమిస్ట్రీ, సైన్స్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జైలులో ఆయన ఎవరితోను మాట్లాడటం లేదని, ఏకాంతంగా ఉండేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలేవీ కల్పించడం లేదు. అందరిలానే అల్పాహారం, భోజనాన్నే ఆయనా తీసుకుంటున్నారు. అయితే ఇతర ఖైదీల మాదిరిగా ఇంకా ఆయనకు నిబంధనల మేరకు ప్రత్యేక పని అప్పగించలేదు. సోమవారం నుంచీ రామలింగరాజు సోదరులతో సహా మిగతా వారికి కూడా అధికారులు పనిని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. రాజుకు జైలులో పాఠశాల, లైబ్రరీ, కంప్యూటర్ తరగతుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించే దిశగా జైల్ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. రామలింగరాజు మాత్రం లైబ్రరీ ఇన్చార్జీ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. రామలింగరాజు ఇప్పటికే మూడేళ్ల జైలు జీవితం గడిపినందున ప్రస్తుత శిక్షా కాలంలో అది మినహాయిస్తే ఓ నాలుగేళ్లు జైలులో ఉండే అవకాశాలుంటాయని, ఇక సత్ప్రవర్తనతో ఉంటే అది మూడేళ్లకే శిక్షాకాలం పూర్తికావచ్చని జైలు అధికారులు అంటున్నారు. -
సత్యం రామలింగరాజు రాయని డైరీ
మానస సరోవరంలో దోమలు ఉంటాయా?! ‘‘ఇక్కడవి మామూలే’’ అని, అతి మామూలుగా అన్నాడు జైలు వార్డెన్. వెనకా ముందూ అతడు నాకేం గౌరవాలు తగిలించలేదు. ఖైదీలకు కనీస సంబోధనా పూర్వక మానవ మర్యాదలను ఆశించే హక్కు ఉంటుందా? ఆ మర్యాదలను ఇచ్చే అవసరం వార్డెన్‌కు ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుందా? చట్టంలో ఎలా ఉందో మరి. అయినా గౌరవ మర్యాదలతో ముఖ విలువను, వాటావిలువను పెంచుకోవలసిన కంపెనీలు ఇప్పుడు నా చేతిలో ఏమున్నాయి కనుక. ముందు సీబీఐ ఇచ్చిన ఈ స్పైరల్ బౌండు కేసు పూర్వాపరాల కాపీలో ఏముందో చూడాలి. దీన్ని చదివి, అర్థం చేసుకునేందుకు ఏడేళ్ల కాలం సరిపోతుందా! ఇంటి నుంచి తెచ్చుకున్న పుస్తకాలు... వాటినెప్పుడు చదవాలి? నేనున్నది మానస సరోవర్ బ్లాకు. దోమలు ఉత్సాహంగా గుయ్యిమంటున్నాయి. కొత్త ఖైదీని దొరికాను కదా! మస్కిటో కాయిల్ తెప్పించి వెలిగించుకున్నాను. దోమలకు ముందుగా నేను అలవాటు పడతానా లేక మస్కిటో కాయిల్స్ అలవాటవుతాయా అన్నది త్వరలోనే తేలిపోవచ్చు. ఇది కోర్టులు నిర్ణయించే విషయం కాదు కాబట్టి. ఒకరోజు గడిచింది. చంచల్గూడా జైలుకు, చర్లపల్లి జైలుకు నాకేం పెద్ద తేడా కనిపించడం లేదు. అక్కడి స్పెషల్ కేటగిరీ, ఇక్కడి సాధారణ ఖైదీగిరీ రెండూ ఒకేలా ఉన్నాయి. జీవితంలోని ఎత్తుల్నీ, పల్లాల్నీ చూసినవాడికి బిర్యానీ అయితే ఏమిటి? మిర్యాల చారు అయితే ఏమిటి? నా డ్రెస్ నేను వేసుకుంటే ఏమిటి? జైలువాళ్లిచ్చే తెల్ల చొక్కా పైజమా అయితే ఏమిటి? ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకి కిచిడి. మధ్యాహ్న భోజనంలోకి చపాతీ, అన్నం, పప్పు, రసం, అప్పడం. రాత్రి డిన్నర్‌లోకి మళ్లీ ఇదే వరుస. కానీ ఇక్కడ లంచ్ లంచ్‌టైమ్‌లో, డిన్నర్ డిన్నర్‌టైమ్‌లో లేదు. పావు తక్కువ తొమ్మిదికి బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక.. పదిన్నరకి లంచ్. సాయంత్రం నాలుగింటికి డిన్నర్! సత్యం రోజులు గుర్తొస్తున్నాయి. ఉదయం ఇంత తిని, మధ్యాహ్నం తిన్నాననిపించి, సాయంత్రం తినీతినకుండా, రాత్రి తింటే తిని... ఎంత అక్రమబద్ధంగా గడిచాయి! పేరు కోసం పరుగు. పేరు నిలుపుకోవడం కోసం పరుగు. పరువు గురించి పట్టించుకోనంత పరుగు. చివరికి ఇక్కడి వరకు తెచ్చిన పరుగు. ఈ మనసు, శరీరం అన్నిటికీ అలవాటు పడ్డాయి. టీవీకి తప్ప! జైలుకు వచ్చీరాగానే జైలు అధికారులను అభ్యర్థించాను నన్ను టీవీలేని బ్యారక్‌లోకి మార్చమని. సాధ్యం కాదన్నారు. టీవీ సెట్ లేని బ్యారక్సే జైల్లో లేవట! కానీ దేవుడు దయతలిచాడు. ఓ బ్యారక్‌లో టీవీ పనిచేయడం లేదు. నన్ను అందులోకి మార్చారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా?! - మాధవ్ శింగరాజు -
సమాజానికి ఎంతో చేశాం
వాటిని పరిగణనలోకి తీసుకొని శిక్ష విధించండి శిక్ష ఖరారుకు ముందు న్యాయమూర్తికి రామలింగరాజు నివేదన సాక్షి, హైదరాబాద్: ‘మీపై నేరం రుజువైంది. మీకు గరిష్టంగా 14 ఏళ్ల జైలుశిక్ష, అపరిమిత జరిమానా విధించవచ్చు. అందువల్ల శిక్ష ఖరారుకు ముందు మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా?’ అంటూ న్యాయమూర్తి రామలింగరాజును అడిగారు. అందుకు రామలింగరాజు బదులిస్తూ తాను దేశం కోసం చేసిన కొన్ని సేవలను కోర్టు ముందుంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘అమెరికాలో 911 సర్వీసు తరహాలో దేశంలోనే తొలిసారిగా 108 సర్వీసును ప్రారంభించి 10 లక్షల మంది ప్రాణాలను కాపాడాం. ఆపదలో ఉన్న 3.5 కోట్ల మందికి సేవ చేశాం. ఈ సర్వీసు ద్వారా 40 వేల మందికి ఉపాధి కల్పించాం. దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది ప్రజలకు ఈ సర్వీసు ద్వారా సేవలు అందించాం. బైర్రాజు ఫౌండేషన్ ద్వారా 200 గ్రామాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్య, వైద్యం, జీవనోపాధి తదితర 30 రకాల సేవలు అందించాం. గ్రామాల్లో ఇంటి దగ్గరకే మినరల్ వాటర్‌ను మొదటిసారిగా అందించాం. స్వర్గీయ అంజిరెడ్డితో కలసి స్థాపించిన నాంది ఫౌండేషన్ 14 రాష్ట్రాల్లో ప్రజలకు సమర్ధంగా సేవలు అందిస్తోంది. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుల్లో నేనూ ఒకరిని. ప్రపంచంలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ బిజినెస్ స్కూల్‌ను ప్రారంభించిన సభ్యుల్లో నేనూ ఉన్నా. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 సర్వీసును ప్రారంభించాం. సత్యం కంప్యూటర్స్ ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించాం. అనేక సంస్థలకు ఐటీ సేవలను అందించాం. దేశంలోనే మొదటిసారిగా సిఫీ ఇంటర్నెట్ సంస్థను స్థాపించి ప్రజలకు ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చాం. శాటిలైట్ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా ఆఫ్ షోర్ సర్వీసులను అందించాం. జాయింట్ వెంచర్ ద్వారా కాగ్నిజెంట్ కంపెనీతో కలసి 2.11 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇందులో 80 శాతానికిపైగా భారతీయులే ఉన్నారు. సత్యం కంపెనీని టెక్ మహీంద్ర కొనుగోలు చేసే నాటికి షేర్ విలువ రూ. 58 ఉండగా ప్రస్తుతం రూ. 320గా ఉంది. ఇటీవలే మదుపుదార్లకు బోనస్ షేర్లను కూడా ఇచ్చారు. సమాజానికి ప్రయోజనకరమైన పనులెన్నో చేశా. 33 నెలలపాటు రిమాండ్‌లో ఉన్నా. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని శిక్షను ఖరారు చేయండి’ అని రామలింగరాజు న్యాయమూర్తికి నివేదించారు. కుటుంబానికి మేమే ఆధారం ‘కేసు నమోదైనప్పటి నుంచి తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాం. 30 నెలలుగా జైల్లో ఉన్నాం. మా కుటుంబాలు అన్ని రకాలుగా చితికిపోయాయి. బంధువులు, మిత్రులు మమ్మల్ని సాంఘికంగా బహిష్కరించారు. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు మా మీదే ఆధారపడి ఉన్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్నారు. వారిని పోషించాల్సిన బాధ్యత మాపైనే ఉంది. మేం చేసిన అపరాధానికి ఈ శిక్ష సరిపోతుందని భావిస్తున్నాం’ అని ఇతర దోషులు న్యాయమూర్తికి నివేదించారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నానని, ఈ కేసు తర్వాత తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదనిమరో దోషి ప్రభాకర్‌గుప్తా న్యాయమూర్తికి నివేదించారు. -
రాజుకు ఏడేళ్ల జైలు
⇒ రాజు సోదరులకు చెరో రూ. 5 కోట్లకు పైగా జరిమానా ⇒ ప్రత్యేక కోర్టు జడ్జి చక్రవర్తి తీర్పు ⇒ ఇది లోతైన కుట్రతో కూడిన తీవ్రమైన ఆర్థిక నేరం ⇒ కార్పొరేట్ ఖ్యాతితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీశారు ⇒ వీరి కుట్రతో మదుపుదారులు తీవ్రంగా నష్టపోయారు ⇒ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన జడ్జి ⇒ ఇలాంటి వారికి తీవ్రమైన శిక్షలు వేయాల్సిందేనని వ్యాఖ్య ⇒ చర్లపల్లి జైలుకు రాజు సహా నిందితుల తరలింపు ఈ కుట్రతో మదుపుదారులు తీవ్రంగా నష్టపోయారు. దీన్ని అంతే తీవ్రంగా పరిశీలించాలి. దేశ కార్పొరేట్ వ్యవస్థ ఖ్యాతిని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఘోర నేరంగా పరిగణించాలి. న్యాయం చేయడమంటే నేరానికి తగ్గ శిక్ష వేయడమే. శిక్ష విధించేటప్పుడు కోర్టులు చూడాల్సింది నేరగాళ్లకున్న హక్కుల్ని మాత్రమే కాదు. బాధితుల హక్కుల్ని, సమాజం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. - తీర్పు సందర్భంగా జడ్జి సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి గురువారం 971 పేజీల తీర్పు వెలువరించారు. రామలింగరాజుకు రూ. 5.74 కోట్లు, రామరాజుకు రూ. 5 కోట్ల 73 లక్షల 75 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులందరికీ కలిపి రూ. 13.84 కోట్లు జరిమానాగా విధించారు. వివిధ నేరాలకు వేర్వేరుగా శిక్షలు విధించినా వాటిని ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీని ప్రకారం దోషులంతా గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా చెల్లించకపోతే మరికొన్ని నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న కాలాన్ని మినహాయించి (సీఆర్పీసీ సెక్షన్ 428 కింద) మిగతా శిక్షా కాలాన్ని మాత్రమే దోషులు అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు ప్రతులను దోషులకు అందజేశారు. దీనిపై పైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయసహాయం పొందవచ్చని వారికి సూచించారు. విచారణలో సహకరించిన సీబీఐ స్పెషల్ పీపీ, నిందితుల తరఫు న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బందికి న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. తీవ్రమైన ఆర్థిక నేరం నిందితులపై నేరం రుజువైనట్లుగా తొలుత న్యాయమూర్తి ప్రకటించారు. ఈ నేరాల్లో గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు అపరిమితమైన జరిమానా విధించవచ్చని స్పష్టం చేశారు. శిక్ష కాలపరిమితి విధింపుపై దోషుల అభిప్రాయాలను అడిగారు. ‘‘శిక్షకాలంపై దోషుల అభిప్రాయాలను విన్నాక.. కేసులోని వాస్తవాలు, పరిస్థితులు, నేరం తీవ్రత చూశాక ఇది చాలా లోతైన కుట్రతో కూడిన ఆర్థిక నేరమని నేను భావిస్తున్నా. ఈ కుట్రవల్ల మదుపుదారులు దారుణంగా నష్టపోయారు. దీన్ని అంతే తీవ్రంగా పరిశీలించాలి. దేశ కార్పొరేట్ వ్యవస్థ ఖ్యాతిని, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఘోర నేరంగా పరిగణించాలి. ప్రొబేషనర్స్ ఆఫ్ అఫెండర్స్ యాక్టును పరిగణలోకి తీసుకొని శిక్షా కాలంపై ఉదాసీనత చూపించాల్సిన నేరం కాదిది. ధనుంజయ్ ఛటర్జీ అలియాస్ ధన వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లుగా... నేరగాళ్లపై తీర్పులు వెలువరించేటప్పుడు సమాజం వేదనను అర్థం చేసుకొని దానికి తగ్గ శిక్ష వేయడమే కోర్టుల ప్రతిస్పందనగా భావించాలి. న్యాయం చేయడమంటే నేరానికి తగ్గ శిక్ష వేయడమే. శిక్ష విధించేటప్పుడు కోర్టులు చూడాల్సింది నేరగాళ్లకున్న హక్కుల్ని మాత్రమే కాదు. బాధితుల హక్కుల్ని, సమాజం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు వింటూనే రామలింగరాజు తదితర నిందితుల బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం రాజు సహా నిందితులందరినీ గురువారం సాయంత్రం 7 గంటలప్పుడు చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. రామలింగరాజుకు 4148, రామరాజుకు 4147 నంబర్లు కేటాయించినట్టు జైలు అధికారులు తెలిపారు. ‘‘వారిద్దరినీ మానస బ్యారక్‌కు తరలించాం. మిగతావారిని అడ్మిషన్ బ్యారక్‌లో ఉంచాం. శుక్రవారం ఉదయం మరో బ్యారక్‌లోకి మారుస్తాం’’ అని తెలిపారు. బాక్సులుసెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో నిందితులు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు విధించిన జరిమానాను చెల్లించాకే అప్పీలుకు అవకాశముంటుంది. అప్పీల్లో నేరం రుజువయ్యేదాకా శిక్ష అమలును నిలిపివేయాలని కోర్టును కోరవచ్చు. అందుకు కోర్టు అనుమతిస్తే, వారిని జైలు నుంచి బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించవచ్చు. అతి పెద్ద ఆర్థిక నేరమిది: సీబీఐ స్పెషల్ పీపీ ‘‘దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరమిది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు తప్పుడు ఖాతాలు సృష్టించారు. ఖాతాలు తారుమారు చేసి మదుపుదారులను మోసం చేశారు. దోషులందరికీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది’’అని స్పెషల్ పీపీ సురేంద్ర తెలిపారు. ‘నేర తీవ్రతతో పాటు కార్పొరేట్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిన తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి దోషులకు శిక్ష ఖరారు చేయండి’’ అని అంతకు ముందు న్యాయమూర్తికి ఆయన నివేదించారు. తీర్పు సందర్భంగా సీబీఐ డీఐజీ చంద్రశేఖర్, డీఎస్పీ శంకర్రావు కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్‌తో సరిపెట్టండి: నిందితుల లాయర్లు ‘రామలింగరాజు 33 నెలలు, రామరాజు 30 నెలలు, మిగతా నిందితులు కొన్ని నెలల పాటు జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసు ద్వారా వ్యక్తిగతంగా నిందితులకు తప్ప ఎవరికీ నష్టం జరగలేదు. ప్రస్తుతం సత్యం కంపెనీ షేరు విలువ కూడా గణనీయంగా పెరిగింది. కేసు విచారణ కాలంలో తీవ్రమైన క్షోభను అనుభవించారు గనుక విచారణ ఖైదీగా ఉన్న కాలంతో సరిపెట్టి వారిని విడిచిపెట్టండి’’ అని నిందితుల లాయర్లు ఉమామహేశ్వర్రావు, రవీందర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ప్రత్యేక హోదాకు జడ్జి నో తనకు జైలులో ప్రత్యేక ఖైదీ హోదా కల్పించాలన్న రామలింగరాజు అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ప్రత్యేక హోదా కింద సౌకర్యాలు కల్పించాలని ఆదేశించలేనని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. ఆ డాక్యుమెంట్లు తిరిగిచ్చేయండి కేసు దర్యాప్తులో భాగంగా బైర్రాజు ఫౌండేషన్, సత్యం కంప్యూటర్స్సంస్థల నుంచి సీబీఐ అనేక డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని సీజ్ చేసింది. కేసుతో సంబంధం లేనివాటిని అప్పీల్ గడువు ముగిసిన తర్వాత సంబంధిత అధికారులకు తిరిగి అప్పగించాలని న్యాయమూర్తి సీబీఐని ఆదేశించారు. అతి పెద్ద ఆర్థిక నేరమిది సీబీఐ స్పెషల్ పీపీ ‘‘దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరమిది. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు తప్పుడు ఖాతాలు సృష్టించారు. ఖాతాలు తారుమారు చేసి మదుపుదారులను మోసం చేశారు. దోషులందరికీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది’’అని స్పెషల్ పీపీ సురేంద్ర తెలిపారు. ‘నేర తీవ్రతతో పాటు కార్పొరేట్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసిన తీవ్రమైన ఆర్థిక నేరంగా పరిగణించి దోషులకు శిక్ష ఖరారు చేయండి’’ అని అంతకు ముందు న్యాయమూర్తికి ఆయన నివేదించారు. తీర్పు సందర్భంగా సీబీఐ డీఐజీ చంద్రశేఖర్, డీఎస్పీ శంకర్రావు కోర్టుకు హాజరయ్యారు. వడ్లమాని శ్రీనివాస్ (మాజీ సీఎఫ్‌వో) ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.33.75 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 25 నెలల జైలు శిక్ష. సుబ్రమణ్యం గోపాలకృష్ణన్ (ఆడిటర్) ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.33.75 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 24 నెలల జైలు శిక్ష. తాళ్లూరి శ్రీనివాస్ ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.30.25 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 24 నెలల జైలు శిక్ష. బి.సూర్యనారాయణ రాజు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.26 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 9 నెలల జైలు శిక్ష. జి.రామకృష్ణ ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 34.50 లక్షల జరిమానా. . జరిమానా చెల్లించకపోతే మరో 28 నెలల జైలు శిక్ష. జి.వెంకటపతిరాజు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.27.75 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 16 నెలల జైలు శిక్ష. సీహెచ్ శ్రీశైలం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.27.75 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 16 నెలల జైలు శిక్ష. వీఎస్ ప్రభాకర్ గుప్తా ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.26 లక్షల జరిమానా. జరిమానా చెల్లించకపోతే మరో 9 నెలల జైలు శిక్ష. తీర్పు మొత్తం పేజీలు -971 జరిమానా.. (కోట్లలో) రామలింగరాజు -5.74 రామరాజు - 5.74 మిగతా అందరికీ కలిపి -13.84 -
దేశం కోసం చాలా చేశా... కాస్త చూడండి!
శిక్షకు ముందు న్యాయమూర్తితో రామలింగరాజు 108, 104 సహా 30 రకాల సేవలు అందించాం ఇంటర్నెట్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం బైర్రాజు ఫౌండేషన్‌తో 30 రకాల సేవలు అందించాం ఇండియన్ బిజినెస్ స్కూల్ వ్యవస్థాపకుల్లో నేనూ ఉన్నా అన్నీ గమనించి శిక్ష విధించాలని విజ్ఞప్తి హైదరాబాద్: దేశం కోసం, సమాజం కోసం తాను చాలా చేశానని, వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని శిక్షను ఖరారు చేయాలని సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపక చైర్మన్ బైర్రాజు రామలింగరాజు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని వేడుకున్నారు. మీపై నేరం రుజువైందని, మీకు గరిష్ఠంగా 14 ఏళ్లు జైలు శిక్ష, అపరిమితమైన జరిమానా విధించవచ్చని, శిక్ష ఖరారు చేసేముందు చెప్పుకునేది ఏమైనా ఉందా అని న్యాయమూర్తి రామలింగరాజును అడిగినప్పుడు ఆయనీ విధంగా చెప్పారు.... ''నేను దేశం కోసం చేసిన కొన్ని సేవలను మీ ముందుంచాలని భావిస్తున్నాను. దేశంలోనే మొదటిసారిగా 108 సర్వీసులను ప్రారంభించాను. అమెరికాలో 911 సర్వీసు తరహాలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం. 108 సర్వీసుల ద్వారా ఒక మిలియన్ ప్రాణాలను కాపాడాం. ఆపదలో ఉన్న 35 మిలియన్ల ప్రజలకు సర్వీసు అందించాం. ఈ సర్వీసు ద్వారా 40 వేల మందికి ఉపాధి కల్పించాం. దేశవ్యాప్తంగా 700 మిలియన్ల ప్రజలకు ఈ సర్వీసు ద్వారా సేవలు అందించాం. బైర్రాజు ఫౌండేషన్ ద్వారా 200 గ్రామాలకు ప్రత్యక్షంగా, సమీపంలోని గ్రామాలకు పరోక్షంగా 30 రకాల సేవలను అందించాం. ఇందులో విద్య, వైద్యం, పర్యావరణం, జీవనోపాధి తదితర సేవలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు ఇంటి దగ్గరకే మినరల్ వాటర్‌ను తొలిసారిగా అందించాం. స్వర్గీయ అంజిరెడ్డితో కలిసి నాంది ఫౌండేషన్‌ను స్థాపించాం. ఈ సంస్థ 14 రాష్ట్రాల్లో సమర్ధంగా ప్రజలకు సేవలు అందిస్తోంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించిన వ్యక్తుల్లో నేనూ ఉన్నాను. ప్రజలకు వైద్యం అందివ్వడంలో ఈ సంస్థ బాగా పనిచేస్తోంది. ప్రపంచంలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ బిజినెస్ స్కూల్‌ను ప్రారంభించిన సభ్యుల్లో నేనూ ఉన్నా. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 సర్వీసును ప్రారంభించాం. సత్యం కంప్యూటర్స్ ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించాం. అనేక సంస్థలకు ఐటీ సేవలను అందించాం. దేశంలోనే మొదటిసారిగా సిఫీ ఇంటర్నెట్ సంస్థను స్థాపించి ప్రజలకు ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చాం. ఈ సంస్థకు 260 మిలియన్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. శాటిలైట్ వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా ఆఫ్ షోర్ సర్వీసులను అందించాం. జాయింట్ వెంచర్ ద్వారా కాగ్నిజెంట్ కంపెనీతో కలిసి 2.11 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇందులో 80 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. సత్యం కంపెనీని టెక్ మహీంద్ర కొనుగోలు చేసేనాటికి షేర్ విలువ 58 రూపాయలు ఉండగా ప్రస్తుతం 320 రూపాయలు ఉంది. ఇటీవలే మదుపుదార్లకు బోనస్ షేర్లను కూడా ఇచ్చారు. సమాజానికి ప్రయోజనకరమైన పనులు ఎన్నో చేశా. 33 నెలలపాటు రిమాండ్‌లో ఉన్నా. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని శిక్షను ఖరారు చేయండి'' అని రామలింగరాజుకు న్యాయమూర్తికి నివేదించారు. ''కుటుంబానికి మేమే ఆధారం. ఈ కేసు నమోదు చేసినప్పటి నుంచి ఆరేళ్లుగా తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. 30 నెలలు జైల్లో ఉన్నాం. మా కుటుంబాలు అన్ని రకాలుగా చితికిపోయాయి. బంధువులు, మిత్రులు మమ్మల్ని సాంఘికంగా బహిష్కరించారు. మా మీదే ఆధారపడి పిల్లలు, భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్నారు. వారిని పోషించాల్సిన బాధ్యత మాపైనే ఉంది. దాదాపు మూడేళ్లు విచారణ ఖైదీలుగా ఉన్నాం. చాలా నెలలు రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నాం. మేం చేసిన అపరాధానికి ఈ శిక్ష సరిపోతుందని భావిస్తున్నాం'' అని ఇతర నిందితులు కూడా న్యాయమూర్తికి నివేదించారు. తాను తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నానని, ఈ కేసు తర్వాత తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు మరో నిందితుడు ప్రభాకర్‌గుప్తా న్యాయమూర్తికి నివేదించారు. -
సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష
-
సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష
ఆయనకు, రామరాజుకు రూ. 5 కోట్ల వంతున జరిమానా మిగిలిన 8 మంది నిందితులకు రూ. 25 లక్షల జరిమానా మొత్తం పదిమంది దోషులకూ ఏడేళ్ల జైలుశిక్ష ఇప్పటికే 33 నెలల శిక్ష అనుభవించిన రామలింగరాజు దేశ విదేశాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బైర్రాజు రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఆయన సోదరుడు రామరాజుకు కూడా ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఈ కేసులో మొత్తం పది మంది దోషులు ఉన్నారు. మొదటి దోషి రామలింగరాజు కావడంతో ఆయన మీద తీర్పు ముందుగా వెలువడింది. ఇప్పటికే ఆయన 33 నెలల పాటు రిమాండు ఖైదీగా ఉన్నారు కాబట్టి మిగిలిన కాలానికి ఆయన జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. హైకోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. ఉంది. ఆయనతో పాటు మొత్తం పది మంది దోషులకు కూడా ఏడేళ్ల జైలుశిక్షనే విధించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు మినహా మిగిలిన 8 మంది దోషులకు మాత్రం రూ. 25 లక్షల చొప్పున జరిమానా విధించారు. దోషులను నేరుగా కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. తాను పలు సేవా కార్యక్రమాలు చేపట్టానని, వాటిని దృష్టిలో పెట్టుకునైనా శిక్ష తగ్గించాలని రామలింగరాజు కోర్టును వేడుకున్నారు. తాను ఈఎంఆర్ఐ, 108, తాగునీటి పథకాల లాంటి అనేక సేవలు చేశానని, వయోవృద్ధులైన తల్లిదండ్రులను కూడా చూసుకోవాల్సి ఉందని.. అందువల్ల శిక్ష తగ్గించాలని కోరారు. అయితే ప్రత్యేక న్యాయమూర్తి చక్రవర్తి మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి తన తీర్పును గురువారం నాడు ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంస్థ చైర్మన్ రామలింగరాజును న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, సంస్థ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలంపై నేరం రుజువైంది. 2009 జనవరిలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణంలో రూ.14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477ఎ (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద సీబీఐ అభియోగాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు మొత్తం 226 మంది సాక్షులను విచారించగా, సీబీఐ సమర్పించిన 3,037 డాక్యుమెంట్లను, నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి ఆర్నెల్ల క్రితమే తుది విచారణను పూర్తి చేసింది. కాగా సత్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది. ఈ కేసు ముఖ్యాంశాలు.... 2009 జనవరి 7: సత్యం కంప్యూటర్స్‌లో 7,100 కోట్లు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. తాను పులి మీద స్వారీ చేస్తున్నట్లు వెల్లడించారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. జనవరి 9: రామలింగరాజు మోసం చేశారని నగరానికి చెందిన లీలామంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 9: ఈ కేసులో విచారణ మరింత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. జనవరి 11: రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫిబ్రవరి 14: కేసు విచారణకు సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో మల్టీ డిసిప్లెయినరీ ఇన్వెస్టిగేషన్ టీం (ఎండీఐటీ) ఏర్పాటు. ఏప్రిల్ 7: సీబీఐ కోర్టుకు ప్రధాన చార్జిషీట్‌ను సమర్పించింది. -
మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్ష ఖరారు!
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్ష ఖరారు కానుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను దోషులుగా ప్రకటించింది. తీర్పు అనంతరం న్యాయమూర్తి ...దోషులతో విడివిడిగా న్యాయమూర్తి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దోషులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు ఆరు నెలల క్రితమే పూర్తయ్యాయి. మరోవైపు సమాజానికి తాను చేసిన సేవ చూసి అయినా శిక్ష తగ్గించాలని రామలింగరాజు ...న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ తీర్పుపై రామలింగరాజు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. -
శిక్ష ఐదేళ్లు మించితే బెయిల్..
-
శిక్షనుబట్టే బెయిల్ వస్తుంది..
హైదరాబాద్: సత్యం కేసులో దోషులకు మూడేళ్ల లోబడి శిక్ష పడితే ప్రత్యేక కోర్టుకు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సత్యం రామలింగ రాజు తరఫు న్యాయవాదులు వెల్లడించారు. అంతకుమించి శిక్షపడితే... పైకోర్టులోనే బెయిల్ తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. సెక్షన్ 409, 402 సెక్షన్ల కింద దోషిగా నిర్థారిస్తే... సాధారణంగా ఐదేళ్లకు పైబడి శిక్ష విధిస్తారన్నారు. కానీ కేసు పరిధిని బట్టి, సాక్ష్యాలను బట్టి... శిక్ష విషయంలో అటు ఇటూ కావచ్చని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. అలాగే నిందితులు దోషులని తేలితే... వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటారన్నారు. అయితే న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం ఉంటుందని న్యాయవాదులు పేర్కొన్నారు. -
నన్ను క్షమించండి..నాలుగు పేజీల లేఖ
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు తుదితీర్పు అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ...దోషులతో విడి విడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రామలింగరాజు అరగంట పాటు సుదీర్ఘంగా న్యాయమూర్తితో తన కేసు పరిస్థితిని విన్నవించుకున్నారు. తనను క్షమించాలని కోరుతూ ఆయన ... న్యాయమూర్తికి నాలుగు పేజీల లేఖను సమర్పించారు. ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని రామలింగరాజు ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం. 108,104, భైర్రాజు, నాంది ఫౌండేషన్ల ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశానని, తాను చేసిన సేవా కార్యక్రమాలను పక్క రాష్ట్రాలు కూడా అమలు చేశాయని ఆయన తెలిపారు. తన సేవలు గుర్తించి అయినా శిక్షను తగ్గించాలని కోరారు. పిల్లల బాధ్యత చూసుకోవాల్సి ఉందని, వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సి ఉందని ఆయన...న్యాయమూర్తికి తెలిపారు. 33 నెలల జైలు శిక్ష కాలంలో ఎంతో క్షోభను అనుభవించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఈకేసులో రామలింగరాజు సహా పదిమందిని దోషులుగా కోర్టు నిర్థారించిన విషయం తెలిసిందే. దోషులకు శుక్రవారం శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. -
శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం
-
సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం
హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో దోషులకు శుక్రవారం శిక్ష ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రామలింగరాజును దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామలింగరాజు సహా పదిమందిపై నేరం రుజువైంది. మరోవైపు దోషులకు శిక్షలపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాగా ఈ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి 46 పేజల తీర్పును చదివి వినిపించారు. దోషులకు గరిష్టంగా ఏడేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సత్యం కేసులో రామలింగరాజు దోషిగా నిర్థారణ
హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి తీర్పు ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంస్థ చైర్మన్ రామలింగరాజును న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, సంస్థ వైస్‌ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలంపై నేరం రుజువైంది. దీంతో వీరికి ఏడు నుంచి పదేళ్లపాటు శిక్ష పడే అవకాశ ఉంది. 2009 జనవరిలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటపడింది. ఈ కేసులో ఈ కుంభకోణంలో రూ.14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477ఎ (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద సీబీఐ అభియోగాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టు మొత్తం 226 మంది సాక్ష్యులను విచారించగా, సీబీఐ సమర్పించిన 3,037 డాక్యుమెంట్లను, నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి ఆర్నెల్ల క్రితమే తుది విచారణను పూర్తి చేసింది. కాగా సత్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది. ఈ కేసు ముఖ్యాంశాలు.... 2009 జనవరి 7: సత్యం కంప్యూటర్స్‌లో 7,100 కోట్లు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. తాను పులి మీద స్వారీ చేస్తున్నట్లు వెల్లడించారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ షేర్హోల్డర్లకు లేఖ రాశారు. జనవరి 9: రామలింగరాజు మోసం చేశారని నగరానికి చెందిన లీలామంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 9: ఈ కేసులో విచారణ మరింత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. జనవరి 11: రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫిబ్రవరి 14: కేసు విచారణకు సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో మల్టీ డిసిప్లెయినరీ ఇన్వెస్టిగేషన్ టీం (ఎండీఐటీ) ఏర్పాటు. ఏప్రిల్ 7: సీబీఐ కోర్టుకు ప్రధాన చార్జిషీట్‌ను సమర్పించింది. -
మార్చి 9న సత్యం కేసు తీర్పు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రత్యేకకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే మార్చి 9న తీర్పును వెలువరించనున్నట్టు ప్రత్యేకన్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి మంగళవారం ప్రకటించారు. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు రామలింగరాజు సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు. -
‘సత్యం’ డెరైక్టర్లకు ఆర్నెల్ల జైలుశిక్ష
* కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు * రామలింగరాజు సహా ఇతర డెరైక్టర్లకు రూ. 10.5 లక్షల చొప్పున జరిమానా * మరో డెరైక్టర్ కృష్ణాజీకి రూ. 2.66 కోట్ల జరిమానా * అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నెల రోజులు వాయిదా * కంపెనీల చట్టం ఉల్లంఘన కేసులోనే ఈ శిక్షలు.. * సీబీఐ కేసులో 23న వెలువడనున్న తీర్పు.. విచారణలోనే సెబీ కేసు సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ సంస్థ డెరైక్టర్లు కంపెనీల చట్టంలోని అనేక నిబంధనలను ఉల్లంఘించారని నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఎఫ్ఐవో) 2009లో దాఖలు చేసిన ఏడు వేర్వేరు ఫిర్యాదుల్లో.. ఆరింటిలో వారిని దోషులుగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. అప్పటి సత్యం కంప్యూటర్స్ సంస్థ డెరైక్టర్లుగా ఉన్న రామలింగరాజు, జయరామన్, ఎన్నారై రామ్ మైనంపాటిలకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.10.5 లక్షల చొప్పున జరిమానా విధించారు. రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌కు ఆరునెలల జైలు, రూ.50 వేల వరకు జరిమానా విధించారు. మరో డెరైక్టర్ కృష్ణాజీ పాలెపునకు రూ.2.66 కోట్లు జరిమానా విధిస్తూ.. చెల్లించేం దుకు రెండు నెలలు గడువిచ్చారు. మిగతావారు జరిమానా చెల్లించేందుకు న్యాయమూర్తి నెల రోజులు గడువు ఇచ్చారు. రూ. 50 వేలు జరిమానా చెల్లించడంతో శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేస్తూ.. హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. సీబీఐ కేసులో.. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 23న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఐదేళ్ల విచారణ తర్వాత ఇటీవల ఈకేసులో తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఇందులో రామలింగరాజు, రామరాజు, సూర్యనారాయణరాజుతోపాటు ఏడుగురు నిందితులుగా ఉన్నారు. ఆ కేసులో కోర్టు 216 మంది సాక్షులను విచారించగా.. సీబీఐ సమర్పించిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది. 2009 జనవరి 7న సత్యం కంపెనీలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. ఈ మేరకు రామలింగరాజుపై హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసు విచారణ సీబీఐకి బదిలీ అయ్యింది. విచారణలో సెబీ కేసు ఈ కుంభకోణంపై సెబీ ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టులో మూడు ఫిర్యాదులు దాఖలు చేసింది. అందులో రామలింగరాజు సోదరులు, ఇతర కుటుంబ సభ్యు లు, టీవీ-9 అధినేత శ్రీనిరాజు నిందితులు. ఆరోపణలు రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. -
స్కామ్ నుంచి తీర్పు వరకూ...
సత్యం కుంభకోణం పరిణామాల క్రమం ఇదీ.. పెనుసంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తాజాగా ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శిక్షలు ప్రకటించింది. వ్యవస్థాపకుడు రామలింగ రాజు సహా ఇతర డెరైక్టర్లకు సోమవారం జైలు శిక్షలు, జరిమానాలు విధించింది. ఈ నేపథ్యంలో సత్యం కుంభకోణం, దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలపై కథనం. 2009లో బయటపడిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. సత్యం కంప్యూటర్స్‌ను 1987లో ప్రారంభించిన రామలింగరాజు 2009 జనవరి దాకా దానికి చైర్మన్‌గా కొనసాగారు. 2008 డిసెంబర్లో మేటాస్‌ను కొనుగోలు చేసే అంశం తిరగబడటంతో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకి చెందిన మేటాస్ని రామలింగరాజు కుమారులే నిర్వహించేవారు. అప్పట్లో రియల్ ఎస్టేట్‌కి బాగా బూమ్ ఉండటంతో రామలింగరాజు కంపెనీలో తన షేర్లను తనఖా పెడుతూ.. వచ్చిన నిధులను మేటాస్ ద్వారా భారీ స్థాయిలో స్థలాలను కొనడానికి మళ్లించారన్న అభియోగాలున్నాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే షేరుకు మంచి రేటు వస్తుంది కాబట్టి.. అందుకోసం అకౌంటింగ్ కుంభకోణానికి తెరతీశారు. లేని లాభాలు ఉన్నట్లుగా చూపడం ద్వారా కంపెనీ పటిష్టమైన స్థితిలో ఉన్నట్లు చూపారు. కానీ, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభ ప్రభావంతో రియల్టీ ధరలు పతనమయ్యాయి. మరోవైపు, తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునేందుకు నిధులూ లేకుండా పోయాయి. ఈ దశలో గణనీయంగా ల్యాండ్‌బ్యాంక్ ఉన్న మేటాస్‌ను సత్యం కంప్యూటర్స్‌లో విలీనం చేసేందుకు రాజు ప్రయత్నం చేశారు. కానీ, సత్యం కంప్యూటర్స్ నిధులను నిరర్ధకమైన రియల్టీలోకి మళ్లిస్తున్నారనే ఉద్దేశంతో కంపెనీ ఇన్వెస్టర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సత్యం అకౌంట్ల గోల్మాల్ జరుగుతోన్న వ్యవహారాన్ని 2009 జనవరిలో రాజు బయట పెట్టారు. లేని లాభాలను లెక్కల్లో చూపినట్లు ఆయన ప్రకటించారు. దాదాపు రూ. 7,000 కోట్ల అకౌంటింగ్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ భారీ ఖాతాల కుంభకోణం వెలుగులోకిరావడం... సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన అరెస్టయ్యారు. ఇందుకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో), అటు సెబీ దర్యాప్తు చేపట్టాయి. ఎస్ఎఫ్ఐవో మొత్తం ఏడు కేసులు పెట్టింది. బ్యాలెన్స్ షీట్లలో అవకతవకలకు పాల్పడటం, షేర్హోల్డర్లను మోసం చేయడం, అక్రమంగా ప్రయోజనాలు పొందటం, చెల్లించని డివిడెండ్లను చెల్లించినట్లుగా చూపడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. తాజాగా ఇందులోనే ఆరు కేసుల్లో కోర్టు శిక్షలు విధించింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా.. మరోవైపు, సత్యం కుంభకోణంపై అటు స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కూడా విచారణ జరిపింది. ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత తుది ఉత్తర్వులు ఇచ్చింది. సెబీ దర్యాప్తు ప్రకారం ఈ స్కామ్ విలువ రూ.12,320 కోట్లుగా అంచనా వేసింది. దీనికి సంబంధించి సెబీ రామలింగరాజుపై, మరో నలుగురిపై 14 ఏళ్ల నిషేధం విధించింది. రూ. 1,849 కోట్ల అక్రమార్జనను వడ్డీతో సహా కట్టాలని ఆదేశించింది. వడ్డీతో కలిపితే ఈ మొత్తం రూ. 3 వేల కోట్ల పైచిలుకు ఉంటుందని తేలింది. కనుమరుగైన బ్రాండ్.. స్కామ్‌లో కూరుకుపోయిన కంపెనీని విక్రయించేందుకు ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టెక్ మహీంద్రా... సత్యంను చేజిక్కించుకుని దాని పేరును మహీంద్రా సత్యంగా మార్చింది. ఆతర్వాత మహీంద్రా సత్యంకూడా టెక్ మహీంద్రాలో పూర్తిగా విలీనంకావడంతో సత్యం కంపెనీ పేరు కాలగర్భంలో కలిసిపోయింది. -
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష
-
సత్యం రామలింగరాజు మరో ఇద్దరికి జరిమానా, జైలుశిక్ష
ఐదేళ్ల క్రితం నాటి సత్యం కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఎట్టకేలకు తీర్పును వెలువరించింది. మొత్తం ఆరు కేసులకు సంబంధించి ఈ కోర్టు తన తీర్పును సోమవారం వెల్లడించింది. సత్యం రామలింగరాజు, రామరాజుకు మూడు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. అలాగే వారితో పాటు రామ్ మైనంపాటికి కూడా రూ. 10 లక్షల జరిమానా విధించారు. మరో రెండు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. రామలింగరాజు, రామరాజులకు ఒక్కో కేసులో ఆరునెలల పాటు నాలుగు కేసుల్లో జైలుశిక్ష కూడా విధించారు. ఎస్ఎఫ్ఐఓ మొత్తం ఏడు కేసులు నమోదు చేయగా, వాటిలో ఒక కేసును కోర్టు కొట్టేసింది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. వడ్లమాని శ్రీనివాస్‌కు మూడు కేసుల్లో రూ. 20 వేల జరిమానా, మూడు కేసుల్లో 6 నెలల జైలుశిక్ష విధించారు. సంస్థ మాజీ డైరెక్టర్లు కృష్ణ జి.పాలెపు, ఎన్.శ్రీనివాస్, వినోద్ కె. దామ్, టి.ఆర్. ప్రసాద్‌లకు రూ. 20 వేల వంతున జరిమానాలు విధించారు. ఐదేళ్ల క్రితం.. అంటే 2009 సంవత్సరంలో సత్యం స్కాం బయటపడి ఒక్కసారిగా ఐటీ రంగాన్ని పెద్ద కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. దాదాపు 147 కోట్ల డాలర్ల ఈ కుంభకోణం ఫలితంగా గ్రూపు ఛైర్మన్ రామలింగరాజు 2009 జనవరి 7వ తేదీన తన పదవులకు రాజీనామా చేశారు. అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలను తీసుకుంది. తర్వాతి నుంచి పలు మలుపులు తిరిగింది. చివరకు ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టులో కూడా ఈ కేసుల విచారణ సాగింది. ఇప్పుడు దానికి సంబంధించి తీర్పు వెలువడింది. -
సెబీ కేసులో కోర్టు ముందుకు రామలింగరాజు
సాక్షి, హైదరాబాద్: మదుపుదారులను మోసం చేశారంటూ స్టాక్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) దాఖలు చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు గురువారం ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితుల జాబితాలో ఉన్న ఆయన భార్య నందిని, కుమారుడు తేజరాజు, సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, కుటుంబ సభ్యులు రామరాజు, ఝాన్సీరాణి, సత్యం మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, మాజీ వీపీ (ఫైనాన్స్) జి.రామకృష్ణ, ఆడిటింగ్ విభాగం హెడ్ వీఎస్ ప్రభాకర్‌గుప్తా, మాజీ డెరైక్టర్, టీవీ-9 అధినేత చింతలపాటి శ్రీనివాసరాజు అలియాస్ శ్రీని రాజు తదితరులు హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి లక్ష్మణ్...రూ.20 వేల చొప్పున పూచీకత్తు బాండ్లు సమర్పించాలని షరతు విధించారు. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ, ఆడిటర్ తళ్లూరి శ్రీనివాస్‌లకు సమన్లు అందకపోవడంతో వారు కోర్టుకు హాజరుకాలేదు. ఇదిలా ఉండగా ఇదే కేసులో శ్రీని రాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (మైటాస్ ఇన్ఫ్రా), సూర్యనారాయణ రాజుకు చెందిన ఎస్ఆర్ ఎస్ఆర్ హోల్డింగ్స్‌లు కూడా నిందితుల జాబితాలో ఉండగా ఆ సంస్థల తరఫు ప్రతినిధులు హాజరయ్యారు. -
డిసెంబర్ 23న సత్యం కేసులో తుది తీర్పు
హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు డిసెంబర్ 23న వెలువడనుంది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం కేసు తుది తీర్పు తేదీని ప్రకటించింది. కాగా కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. -
'సత్యం' కేసులో తుదితీర్పు 30కి వాయిదా
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీని నాంపల్లి సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు తుది తీర్పును న్యాయస్థానం అక్టోబర్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. -
'సత్యం' కేసులో 22 మందికి సమన్లు
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజుకు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. సత్యం కేసులో సెబీ దాఖలు చేసిన తాజా చార్జిషీటును కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో 22 మందికి సమన్లు జారీ చేసింది. సెబీ దాఖలు చేసిన మొదటి చార్జిషీటులో 14 మందిని నిందితులకు పేర్కొనగా, రెండో చార్జిషీటులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. వీరంతా నవంబర్ 13 వ తేదీన కోర్టు ముందుకు హాజరుకావాలని నిందితులకు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో.. సత్యం రామలింగరాజు, బి.రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, రామకృష్ణ, ప్రభాకర్ గుప్తా, బి.సూర్యనారాయణ రాజుతో సహా మొత్తం 22 మంది ఉన్నారు. -
నేడు సత్యం' కేసు తుదితీర్పు
-
'సత్యం' కేసులో తుదితీర్పు ఆగస్టు 11కి వాయిదా
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీని నాంపల్లి సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు తుది తీర్పును న్యాయస్థానం ఆగస్ట్ 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ కేసు విచారణకు రామలింగరాజుతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కాగా సత్యం కంపెనీలో రూ.9 వేల కోట్ల కుంభకోణం కేసులో సీబీఐ రామలింగరాజుపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడం ప్రపంచ కార్పోరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. కాగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రామలింగరాజు కోర్టుకు హాజరు అయ్యారు. మరోవైపు సత్యం కంప్యూటర్స్ కేసులో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. సుమారు ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజు, మరో నలుగురిని స్టాక్ మార్కెట్లలో ఎలాంటి లావాదేవీలు జరపకుండా 14 ఏళ్లపాటు నిషేధం విధిస్తూ ఇటీవలే ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా... ఈ స్కామ్‌లో చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.1,849 కోట్ల మొత్తాన్ని వడ్డీతోసహా చెల్లించాలని స్పష్టం చేసింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
'సత్యం రాజు' బృందం రూ.1850 కోట్లు చెల్లించాలి: సెబి
ముంబై: సత్యం కంప్యూటర్స్ సంస్థ వ్యవస్థాపకుడు బి.రామలింగ రాజు, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు నలుగురు 1850 కోట్ల రూపాయలు చెల్లించాలని సెబి ఆదేశించింది. దేశంలోనే అతి పెద్ద కార్పోరేట్ మోసంగా పేరుపడిన దీనిపై అయిదున్నర సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాలపై 14 ఏళ్లు నిషేధం కూడా విధించారు. ఈ డబ్బుకు 2009 జనవరి 7 నుంచి ఏడాదికి 12 శాతం వడ్డీతో 45 రోజులలోపల సెబికి చెల్లించాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని రాజలింగ రాజు స్వయంగా అంగీకరించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రామలింగ రాజుతోపాటు అతని సోదరుడు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.రామరాజు, సంస్థ మాజీ సిఎఫ్ఓ వడ్లమూడి శ్రీనివాస్, మాజీ వైస్ ప్రసిడెంట్ జి.రామకృష్ణ, సంస్థ అంతర్గత ఆడిటింగ్ విభాగం మాజీ చీఫ్ విఎస్ ప్రభాకర గుప్తలకు ఈ ఆదేశాలు జారీ చేశారు. -
సత్యం కేసు తుది తీర్పు తేదీ మళ్లీ వాయిదా
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీని నాంపల్లి సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. తుది తీర్పు వెల్లడించే తేదీని జులై 28న ప్రకటిస్తామని 25వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి గురువారం తెలిపారు. కాగా కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడం ప్రపంచ కార్పోరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. కాగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రామలింగరాజు కోర్టుకు హాజరు అయ్యారు. -
జూన్ 26 తేదిన సత్యం కుంభకోణం కేసు తుది తీర్పు
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు జూన్ 26 తేదిన వెల్లడించనున్నారు. కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పును జూన్ 26 తేదిన వెల్లడించనున్నట్టు 25వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి తెలిపారు. సత్యం కేసులో అడిషినల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు విచారణ గతవారం పూర్తి చేసింది. తుది తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడం ప్రపంచ కార్పోరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. -
సత్యం కుంభకోణం కేసులో తీర్పుపై రేపు నిర్ణయం!
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పుపై సోమవారం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తొంది. కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్విసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతోంది. సత్యం కేసులో అడిషినల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు విచారణ గతవారం పూర్తి చేసింది. తుది తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి తీర్పు తేదిని బహుశా రేపు ప్రకటించే అవకాశం ఉంది. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడం ప్రపంచ కార్పోరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. -
సత్యం స్కాం బయటపడి ఇప్పటికి సరిగ్గా అయిదేళ్లు
-
'సత్యం' రామలింగరాజుపై ఈడీ చార్జిషీట్!
వ్యాపార ప్రపంచాన్ని కుదిపేసిన సత్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగ రాజు, ఇతర 212 మందితోపాటు కొన్ని కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చార్జిషీట్ ను దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (పీఎమ్ఎల్ఏ) కింద మనీలాండరింగ్ పాల్పడ్డారనే ఆరోపణలతో 21వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తికి దర్యాప్తు రిపోర్టును ఈడీ సమర్పించింది. సత్యం కంప్యూటర్ అండ్ సర్విసెస్ లిమిటెడ్ (ఎస్‌సీఎస్‌ఎల్) షేర్లను చట్టవ్యతిరేకంగా రామలింగరాజు, ఇతరుల అమ్మకాలు జరిపారని నివేదికలో వెల్లడించింది. ఈ కేసును సీబీఐ కూడా విచారించింది. -
‘సత్యం’ను వెంటాడుతున్న పాత విదేశీ కేసులు
న్యూయార్క్: ఐటీ సంస్థ సత్యం కంప్యూటర్స్.. మహీంద్రా గ్రూప్‌లో విలీనమైనప్పటికీ, పాత కేసులు దాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. సత్యం కంప్యూటర్స్ తమను మభ్యపెట్టి భాగస్వామ్యం కుదుర్చుకునేలా చేసిందంటూ ఒకప్పటి భాగస్వామి వెంచర్ గ్లోబల్ ఇంజనీరింగ్ (వీజీఈ) తాజాగా మరోసారి దావా వేసింది. దీనిపై విచారణ జరపాలంటూ అమెరికాలోని అప్పీల్స్ కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో సత్యం కంప్యూటర్స్కి అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. పిటిషన్ వివరాల ప్రకారం.. ఆటో పరిశ్రమకు ఇంజినీరింగ్ సర్వీసులు అందించే ఉద్దేశంతో ల్యారీ వింగెట్ లివింగ్ ట్రస్టు సారథ్యంలోని వెంచర్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియాతో కలిసి 2000లో సత్యం.. జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేసింది. అయితే, విభేదాలు రావడంతో 2005లో రెండూ తెగతెంపులు చేసుకున్నాయి. దీనికి సంబంధించి అప్పట్లో వెంచర్ సంస్థ వాదనలను తోసిపుచ్చి, జేవీలో ఆ కంపెనీకి ఉన్న వాటాలను సత్యంకు బదలాయించాలంటూ మిషిగాన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశించింది. అకౌంటింగ్ స్కాం దరిమిలా.. తాజాగా వెంచర్ సంస్థతో పాటు ట్రస్టు ప్రస్తుతం అప్పీల్స్ కోర్టుకెళ్లాయి. అప్పట్లో కూడా సత్యం తన ఆర్థిక స్థితిగతుల గురించి మాయమాటలు చెప్పి భాగస్వామ్యం కుదుర్చుకుందని వాదించాయి. దీనిపైనే కోర్టు ప్రస్తుత ఆదేశాలు జారీ చేసింది.