సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి.రామలింగరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, మరదలు ఝాన్సీ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. ఐటీ శాఖ అధికారుల నిర్ణయాన్ని అప్పిలెట్ ట్రిబ్యునల్ సమర్థించిన నేపథ్యంలో ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.