హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్ష ఖరారు కానుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను దోషులుగా ప్రకటించింది. తీర్పు అనంతరం న్యాయమూర్తి ...దోషులతో విడివిడిగా న్యాయమూర్తి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దోషులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు ఆరు నెలల క్రితమే పూర్తయ్యాయి. మరోవైపు సమాజానికి తాను చేసిన సేవ చూసి అయినా శిక్ష తగ్గించాలని రామలింగరాజు ...న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ తీర్పుపై రామలింగరాజు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్ష ఖరారు!
Published Thu, Apr 9 2015 2:05 PM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM
Advertisement
Advertisement