
శిక్షనుబట్టే బెయిల్ వస్తుంది..
హైదరాబాద్: సత్యం కేసులో దోషులకు మూడేళ్ల లోబడి శిక్ష పడితే ప్రత్యేక కోర్టుకు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సత్యం రామలింగ రాజు తరఫు న్యాయవాదులు వెల్లడించారు. అంతకుమించి శిక్షపడితే... పైకోర్టులోనే బెయిల్ తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. సెక్షన్ 409, 402 సెక్షన్ల కింద దోషిగా నిర్థారిస్తే... సాధారణంగా ఐదేళ్లకు పైబడి శిక్ష విధిస్తారన్నారు.
కానీ కేసు పరిధిని బట్టి, సాక్ష్యాలను బట్టి... శిక్ష విషయంలో అటు ఇటూ కావచ్చని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. అలాగే నిందితులు దోషులని తేలితే... వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటారన్నారు. అయితే న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం ఉంటుందని న్యాయవాదులు పేర్కొన్నారు.