
సత్యం రాజుకు హైకోర్టులో నిరాశ
సత్యం కంప్యూటర్స్ స్కాం కేసులో నిందితులు రామలింగరాజు తదితరులకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవాలు చేస్తూ వాళ్లు దాఖలు చేసిన అప్పీలును విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది.
నాంపల్లిలోని ఎంఎస్జే కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలిన వాళ్లంతా తొలుత నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులోనే తమ అప్పీలును దాఖలు చేయాల్సి ఉంటుంది.