Satyam case
-
సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం..
సత్యం కంప్యూటర్స్ కంపెనీ ఆదాయ, వ్యయాలకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపించినట్లు అప్పటి సంస్థ ఛైర్మన్ రామలింగరాజు అంగీకరించిన విషయం తెలిసిందే. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో కంపెనీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా రామలింగరాజు, ఇతరులు కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టి అక్రమంగా లాభపడినట్లు సెబీ తెలిపింది. అయితే సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించింది. ఆ సొమ్మును వడ్డీతో సహా వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ నలుగురిలో రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకు చెందిన ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో భాగంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సెబీ 96 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం రూ.624 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల ఈ సొమ్మును 2009 జనవరి 7వ తేదీ నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 2018 అక్టోబరు, నవంబరులో సెబీ ఇచ్చిన రెండు ఉత్తర్వుల్లో రామలింగరాజు, ఆయన సహచరులు అక్రమంగా ఏ మేరకు లబ్ది పొందారో తెలిపింది. ఆ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపేసింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అందుకు ఈ ఏడాది నవంబరు 30వ తేదీని గడువుగా నిర్దేశించింది. దీన్ని అనుసరించి సెబీ కొత్త ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించడంతో పాటు గతంలో అనుసరించిన నియమాలను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు సెబీ డైరెక్టర్ అనంత్ నారాయణ్ తెలిపారు. సత్యం ఖాతాల కుంభకోణం వెలుగు చూసిన తర్వాత రామలింగరాజు, రామరాజులను సెక్యూరిటీస్ మార్కెట్లో 2028 జూన్ 14 వరకు కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ నిషేధించింది. అయితే ఈ ఉత్తర్వుల్లో అంశాల అమలు ప్రక్రియ సుప్రీంకోర్టులోని అప్పీళ్లపై వెలువడే తీర్పులను బట్టి ఉంటుదని తెలుస్తోంది. గతంలో సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ఇతరులకు 14 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎలాంటి మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. కాగా, అప్పటికే ఆదేశించిన రూ.1258.88 కోట్ల మొత్తాన్ని రూ.813.40 కోట్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ కంపెనీ రూ.675 కోట్లు, రామలింగరాజు రూ.27కోట్లు, సూర్య నారాయణరాజు 82 కోట్లు, రామరాజు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన 2009 జనవరి నుంచి వడ్డీతో సహా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అయితే రామలింగరాజు, ఇతరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో సెబీ సహేతుకంగా వివరించలేకపోయినట్లు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) పేర్కొంది. అందువల్ల మళ్లీ కొత్త ఉత్వర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. షేర్ల లావాదేవీల్లో పొందిన లబ్ధిని కూడా తిరిగి లెక్కించాలని ఆదేశించింది. అనంతరం రామలింగరాజును సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 14 ఏళ్ల పాటు నిషేధిస్తూ సెబీ ఇచ్చిన ఉత్తర్వులను శాట్ నిలుపుదల చేసింది. ఈ వివాదాన్ని మళ్లీ పరిశీలించి, కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. దాంతో తాజాగా సెబీ శాట్‌కు అన్ని వివరాలతో నివేదించింది. ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు! ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో 1987లో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బిల్ గేట్స్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన రామలింగరాజు అంతే స్థాయిలో దిగజారిపోయారు. సత్యం కుంభకోణం అప్పుడు ఓ సంచలనంగా మారింది. ఎన్నో వాయిదాల అనంతరం సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు, అతని సోదరులు రామరాజు, సూర్య నారాయణ రాజు తదితరులకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. సెబీ ఆయన కంపెనీలపై నిషేధం విధించింది. వేలాది మంది ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన బాటపట్టారు. ఇదంతా జరిగి దాదాపు పద్నాలుగేళ్లు కావస్తుంది. ఇప్పటికీ వారి నుంచి ఎలాంటి నష్టపరిహారాన్ని రికవరీ చేయలేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. -
పీడబ్ల్యూసీకి సెబీ షాక్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్‌కు (పీడబ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గట్టి షాకిచ్చింది. సత్యం కంప్యూటర్స్ ఖాతాలను ఈ సంస్థే ఆడిట్ చేసినా... కంపెనీ లాభనష్టాలకు సంబంధించి వాస్తవాలు బయటకు వెల్లడికాలేదు. చివరకు ప్రమోటర్ రామలింగరాజు వెల్లడించాకే విషయాలన్నీ బయటికొచ్చాయి. సత్యం ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయిన ఈ వ్యవహారంలో... దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పీడబ్ల్యూసీని సెబీ దోషిగా తేల్చింది. ఫలితంగా పీడబ్ల్యూసీ నెట్వర్క్ సంస్థలు రెండేళ్ల పాటు భారత్‌లోని లిస్టెడ్ కంపెనీలకు ఆడిట్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా నిషేధం విధించింది. అలాగే సత్యం కంప్యూటర్స్ ఖాతాలు ఆడిటింగ్ ద్వారా పీడబ్ల్యూసీ, గతంలో దాని రెండు భాగస్వామ్య సంస్థలు అక్రమంగా ఆర్జించిన రూ.13 కోట్లకు పైగా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని 108 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, పీడబ్ల్యూ నెట్వర్క్ సంస్థలు 2017–18కి సంబంధించి ఇప్పటికే చేపట్టిన ఆడిటింగ్ అసైన్‌మెంట్స్‌పై దీని ప్రభావం ఉండదని తెలిపింది. సెబీ ఆదేశాలపై తాము స్టే తెచ్చుకుంటామని ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ ధీమా వ్యక్తం చేయగా, ఉత్తర్వులను పరిశీలించనున్నట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి.చౌదరి చెప్పారు. ఆడిటర్లకు సంబంధించి ఇప్పటికే కఠిన నిబంధనలు ఉన్నాయని, వాటిని అమలు మాత్రమే చేయాల్సి ఉందని తెలిపారు. దేశీ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసిన రూ. 7,000 కోట్ల సత్యం కంప్యూటర్స్ కుంభకోణం 2009లో బయటపడింది. ఆ తర్వాత కంపెనీ చైర్మన్ రామలింగరాజు జైలుకెళ్లడం, సంస్థను టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవధిలో పీడబ్ల్యూసీ రెండు సార్లు రాజీ యత్నాలకు ప్రయత్నించినా విఫలమయింది. అయితే, అమెరికాలో మాత్రం రాజీ చేసుకోగలిగింది. బిగ్ ఫోర్‌గా పరిగణించే నాలుగు దిగ్గజ ఆడిటింగ్ కంపెనీల విషయంలో ఇంత తీవ్రమైన ఆదేశాలు జారీ కావడం దేశంలో ఇదే ప్రథమం. గోపాలకృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరిలకు 3 ఏళ్లు.. ప్రైస్ వాటర్‌హౌస్ మాజీ భాగస్వాములు గోపాలకృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరి మూడేళ్ల పాటు లిస్టెడ్ సంస్థలకు ఆడిట్ సర్టిఫికెట్లు జారీ చేయరాదని సెబీ స్పష్టంచేసింది. 2000–2008 మధ్య కాలంలో ప్రైస్ వాటర్‌హౌస్ సంస్థలు ఆడిటింగ్ సేవలకు గాను సత్యం నుంచి రూ. 23 కోట్లు ఫీజుగా పొందగా.. ఇందులో రూ. 13 కోట్లు పీడబ్ల్యూ బెంగళూరుకి లభించాయని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రైస్ వాటర్‌హౌస్ బెంగళూరు విభాగంతో పాటు ఎస్ గోపాలకృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరి అనుచితంగా లబ్ధి పొందిన మొత్తం రూ. 13 కోట్లు, 2009 జనవరి 7 నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. ఇందుకు 45 రోజుల గడువు ఇచ్చింది. స్టే తెచ్చుకుంటాం: పీడబ్ల్యూసీ సెబీ విచారణ, తీర్పు తమను నిరాశపరిచినట్లు పీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చే లోగా స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంది. ‘గతంలో ఎన్నడూ చూడని విధంగా సత్యం యాజమాన్యం చేసిన మోసంలో పీడబ్ల్యూ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి తప్పూ చేయలేదనే 2009 నుంచీ చెబుతున్నాం. తాజా తీర్పు 2011లో బాంబే హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉంది. దీనిపై స్టే తెచ్చుకోగలమని భావిస్తున్నాం‘ అని వెల్లడించింది. కొత్త ఆడిటర్ల వేటలో కంపెనీలు.. ప్రైస్ వాటర్‌హౌస్ నెట్వర్క్ సంస్థలపై సెబీ నిషేధం విధించిన నేపథ్యంలో ప్రస్తుతం వాటి సర్వీసులు ఉపయోగించుకుంటున్న అనేక లిస్టెడ్ కంపెనీలు కొత్త ఆడిటర్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీడబ్ల్యూసీ నెట్వర్క్ కింద భారత్‌లో ప్రస్తుతం 11 సంస్థలు ఉండగా.. 3,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. దేశీయంగా 75 లిస్టెడ్ కంపెనీలకు ఈ సంస్థలు ఆడిటింగ్ సేవలు అందిస్తున్నాయి. 2017–18 ఏడాది ఆడిటింగ్‌పై తీర్పు ప్రభావం ఉండదని సెబీ చెప్పినప్పటికీ.. తర్వాతైనా సరే ఈ లిస్టెడ్ కంపెనీలు మరో ఆడిటర్‌ను వెతుక్కోవాలి. మరోవైపు, సెబీ ఆదేశాల నేపథ్యంలో పరోక్షంగానైనా.. అన్‌లిస్టెడ్, ఇతర సంస్థలకు ప్రైస్ వాటర్‌హౌస్ అందించే ఆడిటింగ్ సేవలపైనా ప్రశ్నలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
సెషన్స్ కోర్టులో ‘సత్యం’ దోషుల అప్పీళ్లు
హైదరాబాద్: ‘సత్యం’ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ సంస్థ మాజీ అధినేత రామలింగరాజు సహా దోషులు సోమవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించారు. ఎంఎస్‌జే కోర్టుకు అప్పీళ్లను విచారించే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. దోషుల తరఫు న్యాయవాదులు సోమవారం పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. -
సత్యం రాజుకు హైకోర్టులో నిరాశ
-
సత్యం రాజుకు హైకోర్టులో నిరాశ
సత్యం కంప్యూటర్స్ స్కాం కేసులో నిందితులు రామలింగరాజు తదితరులకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవాలు చేస్తూ వాళ్లు దాఖలు చేసిన అప్పీలును విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. నాంపల్లిలోని ఎంఎస్‌జే కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలిన వాళ్లంతా తొలుత నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులోనే తమ అప్పీలును దాఖలు చేయాల్సి ఉంటుంది. -
రామలింగరాజును దోషిగా ప్రకటించిన కోర్టు
-
ఏప్రిల్ 9న సత్యం కేసు తుది తీర్పు
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. తుది తీర్పును సోమవారం న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ కొద్ది నెలల క్రితమే పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ప్రత్యేక న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 23 నాటికే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. కేసును క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరించాల్సి ఉందంటూ ప్రత్యేక జడ్జి తీర్పును మార్చి 9కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ అనంతరం 2010లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల పాటు సాగిన కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది. -
‘సత్యం’ తీర్పు నేడే!
-
‘సత్యం’ తీర్పు నేడే!
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సోమవారం తీర్పు వెలువడే అవకాశముంది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ కొద్ది నెలల క్రితమే పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ప్రత్యేక న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 23 నాటికే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. కేసును క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరించాల్సి ఉందంటూ ప్రత్యేక జడ్జి దీన్ని మార్చి 9కి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సంస్థ మాజీ సీఎఫ్ఓ శ్రీనివాస్ వడ్లమాని, పీడబ్ల్యూసీ ఆడిటర్లు ఎస్.గోపాలకృష్ణన్, టి.శ్రీనివాస్ సహా రామలింగరాజు మరో సోదరుడు సూర్యనారాయణరాజు, సంస్థ మాజీ ఉద్యోగులు జి.రామకృష్ణ, డి.వెంకటపతి రాజు, సీహెచ్ శ్రీశైలం, వి.ఎస్.ప్రభాకర్ గుప్తా ప్రధాన నిందితులుగా ఉన్నారు. సత్యం కేసును తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ దీని ప్రాధాన్యత ను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క కేసు విచారణ కోసం 2010లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. సత్యం కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది. -
సత్యం కేసులో తీర్పు రేపే
హైదరాబాద్: సత్యం కేసులో సోమవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. గతంలో జరిగిన విచారణలో భాగంగా ఈ మార్చి 9న తీర్పు వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి దాదాపు మూడు వేలకు పైగా డాక్యుమెంట్లు, 226 మంది సాక్షుల విచారణ చేసింది. ఎలాంటి రాబడి లేకపోయినప్పటికీ ఖాతాల్లో అక్రమాల ద్వారా కొన్నేళ్లపాటు తమ కంపెనీ లాభాల బాటలో ఉన్నట్లు సత్యం కంప్యూటర్ సర్వీస్ లిమిటెడ్ చూపించింది. సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం 2009, జనవరి 7న వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై విచారణ చేపట్టే బాధ్యత సీబీఐ చేతికి 2009 ఫిబ్రవరిలో సీబీఐ చేతికి వెళ్లింది. -
'సత్యం' కేసు తుది తీర్పు మార్చి 9కి వాయిదా
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు... 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పిం చిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది.కాగా సెబీ కేసులో ఆర్థిక నేరాల కోర్టుకు నిందితులు హాజరయ్యారు. అలాగే ఇదే కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిలిపివేసింది. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటాదారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ...ఈ వ్యవహారం లో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా పేర్కొంది. -
నేడు ‘సత్యం’ కేసులో తీర్పు
216 మంది సాక్షులను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు 3,038 డాక్యుమెంట్ల పరిశీలన సెబీ కేసులో సోమవారం ‘ఆర్థిక నేరాల’ కోర్టుకు హాజరైన నిందితులు ఈడీ కేసులో శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేసిన మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటాదారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ...ఈ వ్యవహారం లో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా పేర్కొంది. రామలింగరాజు సహా ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409(నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించ డం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477 (ఏ) (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద అభియోగాలు మోపింది. నిందితులుగా బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, వీఎస్.ప్రభాకర్‌గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్.శ్రీశైలం ఉన్నారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు... 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పిం చిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది. విచారణ పూర్తికావడంతో మంగళవారం తీర్పు వెలువరించనుంది. కాగా.. ఇదే కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది. సెబీ కేసులో కోర్టుకు హాజరు.. మదుపుదారులను మోసం చేశారంటూ సెబీ దాఖలు చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు సోమవారం ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆయన భార్య నందిని, కుమారుడు తేజరాజు, సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, కుటుంబసభ్యులు రామరాజు, ఝాన్సీరాణితో పాటు వడ్లమాని శ్రీనివాస్, రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్‌గుప్తా, చింతలపాటి శ్రీనివాసరాజు తదితరులు కూడా హాజరయ్యారు. హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి లక్ష్మణ్.. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న రామలింగరాజు తల్లి అప్పల నర్సమ్మకు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా ‘సత్యం’ మాజీ డెరైక్టర్లకు ఈడీ కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఇటీవల విధించిన ఆరు నెలల జైలు శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) తాత్కాలికంగా నిలుపుదల చేశారు. -
'సత్యం' కేసులో 22 మందికి సమన్లు
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజుకు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. సత్యం కేసులో సెబీ దాఖలు చేసిన తాజా చార్జిషీటును కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో 22 మందికి సమన్లు జారీ చేసింది. సెబీ దాఖలు చేసిన మొదటి చార్జిషీటులో 14 మందిని నిందితులకు పేర్కొనగా, రెండో చార్జిషీటులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. వీరంతా నవంబర్ 13 వ తేదీన కోర్టు ముందుకు హాజరుకావాలని నిందితులకు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో.. సత్యం రామలింగరాజు, బి.రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, రామకృష్ణ, ప్రభాకర్ గుప్తా, బి.సూర్యనారాయణ రాజుతో సహా మొత్తం 22 మంది ఉన్నారు. -
'సత్యం రాజు' బృందం రూ.1850 కోట్లు చెల్లించాలి: సెబి
ముంబై: సత్యం కంప్యూటర్స్ సంస్థ వ్యవస్థాపకుడు బి.రామలింగ రాజు, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు నలుగురు 1850 కోట్ల రూపాయలు చెల్లించాలని సెబి ఆదేశించింది. దేశంలోనే అతి పెద్ద కార్పోరేట్ మోసంగా పేరుపడిన దీనిపై అయిదున్నర సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాలపై 14 ఏళ్లు నిషేధం కూడా విధించారు. ఈ డబ్బుకు 2009 జనవరి 7 నుంచి ఏడాదికి 12 శాతం వడ్డీతో 45 రోజులలోపల సెబికి చెల్లించాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని రాజలింగ రాజు స్వయంగా అంగీకరించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రామలింగ రాజుతోపాటు అతని సోదరుడు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.రామరాజు, సంస్థ మాజీ సిఎఫ్ఓ వడ్లమూడి శ్రీనివాస్, మాజీ వైస్ ప్రసిడెంట్ జి.రామకృష్ణ, సంస్థ అంతర్గత ఆడిటింగ్ విభాగం మాజీ చీఫ్ విఎస్ ప్రభాకర గుప్తలకు ఈ ఆదేశాలు జారీ చేశారు.