హైదరాబాద్: ‘సత్యం’ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ సంస్థ మాజీ అధినేత రామలింగరాజు సహా దోషులు సోమవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించారు.
ఎంఎస్‌జే కోర్టుకు అప్పీళ్లను విచారించే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. దోషుల తరఫు న్యాయవాదులు సోమవారం పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.