హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజుకు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. సత్యం కేసులో సెబీ దాఖలు చేసిన తాజా చార్జిషీటును కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో 22 మందికి సమన్లు జారీ చేసింది. సెబీ దాఖలు చేసిన మొదటి చార్జిషీటులో 14 మందిని నిందితులకు పేర్కొనగా, రెండో చార్జిషీటులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. వీరంతా నవంబర్ 13 వ తేదీన కోర్టు ముందుకు హాజరుకావాలని నిందితులకు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో.. సత్యం రామలింగరాజు, బి.రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, రామకృష్ణ, ప్రభాకర్ గుప్తా, బి.సూర్యనారాయణ రాజుతో సహా మొత్తం 22 మంది ఉన్నారు.