
సత్యం కేసులో తీర్పు రేపే
హైదరాబాద్: సత్యం కేసులో సోమవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. గతంలో జరిగిన విచారణలో భాగంగా ఈ మార్చి 9న తీర్పు వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి దాదాపు మూడు వేలకు పైగా డాక్యుమెంట్లు, 226 మంది సాక్షుల విచారణ చేసింది. ఎలాంటి రాబడి లేకపోయినప్పటికీ ఖాతాల్లో అక్రమాల ద్వారా కొన్నేళ్లపాటు తమ కంపెనీ లాభాల బాటలో ఉన్నట్లు సత్యం కంప్యూటర్ సర్వీస్ లిమిటెడ్ చూపించింది. సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం 2009, జనవరి 7న వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై విచారణ చేపట్టే బాధ్యత సీబీఐ చేతికి 2009 ఫిబ్రవరిలో సీబీఐ చేతికి వెళ్లింది.