జూన్ 26 తేదిన సత్యం కుంభకోణం కేసు తుది తీర్పు | Court to fix date for Satyam verdict on June 26 | Sakshi
Sakshi News home page

జూన్ 26 తేదిన సత్యం కుంభకోణం కేసు తుది తీర్పు

Published Mon, Jun 23 2014 1:26 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

జూన్ 26 తేదిన సత్యం కుంభకోణం కేసు తుది తీర్పు

జూన్ 26 తేదిన సత్యం కుంభకోణం కేసు తుది తీర్పు

హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు జూన్ 26 తేదిన వెల్లడించనున్నారు. కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పును జూన్ 26 తేదిన వెల్లడించనున్నట్టు 25వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి తెలిపారు. 
 
సత్యం కేసులో అడిషినల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు విచారణ గతవారం పూర్తి చేసింది. తుది తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 
 
2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడం ప్రపంచ కార్పోరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement