సత్యం కుంభకోణం కేసులో తీర్పుపై రేపు నిర్ణయం!
సత్యం కుంభకోణం కేసులో తీర్పుపై రేపు నిర్ణయం!
Published Sun, Jun 22 2014 2:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పుపై సోమవారం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తొంది. కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్విసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతోంది.
సత్యం కేసులో అడిషినల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు విచారణ గతవారం పూర్తి చేసింది. తుది తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు.
ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి తీర్పు తేదిని బహుశా రేపు ప్రకటించే అవకాశం ఉంది. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడం ప్రపంచ కార్పోరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement