'సత్యం' రామలింగరాజుపై ఈడీ చార్జిషీట్!
వ్యాపార ప్రపంచాన్ని కుదిపేసిన సత్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగ రాజు, ఇతర 212 మందితోపాటు కొన్ని కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చార్జిషీట్ ను దాఖలు చేసింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (పీఎమ్ఎల్ఏ) కింద మనీలాండరింగ్ పాల్పడ్డారనే ఆరోపణలతో 21వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తికి దర్యాప్తు రిపోర్టును ఈడీ సమర్పించింది. సత్యం కంప్యూటర్ అండ్ సర్విసెస్ లిమిటెడ్ (ఎస్సీఎస్ఎల్) షేర్లను చట్టవ్యతిరేకంగా రామలింగరాజు, ఇతరుల అమ్మకాలు జరిపారని నివేదికలో వెల్లడించింది. ఈ కేసును సీబీఐ కూడా విచారించింది.