Satyam Computers
-
సత్యం కేసులో సెబీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: ఆడిటర్లను నిషేధించే అధికారం మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీకి లేదంటూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసు విషయంలో సెప్టెంబర్ 9న శాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెబీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన డివిజన్ బెంచ్ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వివరాలు ఇవీ... - రూ.7,800 కోట్ల సత్యం కుంభకోణానికి సంబంధించిన పాత్రపై ప్రైస్ వాటర్‌హౌస్‌కూపర్స్ ఇండియా విభాగం ప్రైస్ వాటర్‌హౌస్(పీడబ్ల్యూసీ)పై సెబీ 2018 జనవరి 10వ తేదీన రెండు సంవత్సరాల నిషేధం విధించింది. సంబంధింత రెండేళ్ల సమయంలో లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్యులను శాట్‌లో పీడబ్ల్యూసీ సవాలు చేసింది. - కేసును విచారించిన ట్రిబ్యునల్, ఆడిట్ సంస్థ– ప్రైస్‌వాటర్‌హౌస్‌పై సెబీ నిషేధం విధించడం సరికాదని తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. అయితే తప్పు చేసిన ఆడిటర్ల నుంచి రూ.13 కోట్ల ఫీజు వాపసు నిర్ణయాన్ని పాక్షికంగా అనుమతించింది. - ఆడిటర్లపై చర్య తీసుకునే అధికారం కేవలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)కి మాత్రమే ఉందని కూడా శాట్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆడిటింగ్‌లో నిర్లక్ష్యం ప్రాతిపదికనే మోసాలను నిరూపించజాలమని పేర్కొంది. ఆడిట్, ఆడిటింగ్ సేవల నాణ్యత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం సెబీకి లేదని శాట్ తన ఉత్తర్వు్యల్లో తెలిపింది. - ‘‘తప్పు జరక్కుండా ముందస్తు చర్యలు, లేదా తదుపరి చర్యలను మాత్రమే సెబీ తీసుకోగదు. అయితే ఇక్కడ అటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ శిక్ష విధించిన దాఖలాలే కనిపిస్తున్నాయి. ఈ అధికారం సెబీకి లేదు’’ అని శాట్ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. సత్యం కేసు ఇదీ... ఒకప్పటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌లో కోట్లాది రూపాయల మోసం జరిగిన విషయం 2009 జనవరి 8న వెలుగుచూసింది. అప్పటికి కొన్నేళ్లుగా రూ.5,004 కోట్ల మేర ఖాతాల్లో అవకతవకలకు పాల్పడినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు బహిరంగంగా అంగీకరించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచి్చంది. ఈ మోసపూరిత ఆరి్థక కుంభకోణం విలువ దాదాపు రూ.7,800 కోట్లని సెబీ విచారణలో ఉంది. -
రూ. 813 కోట్లు కట్టండి సత్యం రామలింగరాజు
న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ. 813 కోట్లు కట్టాలంటూ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు తదితరులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. అలాగే 14 ఏళ్ల పాటు వారు సెక్యురిటీస్ మార్కెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా నిషేధం విధించింది. సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ సూచనల ప్రకారం సెబీ ఈ మేరకు కొత్తగా మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆదేశించిన రూ. 1,258.88 కోట్ల మొత్తాన్ని తాజాగా రూ. 813.40 కోట్లకు తగ్గించింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ రూ. 675 కోట్లు, రామలింగ రాజు దాదాపు రూ. 27 కోట్లు, సూర్యనారాయణ రాజు రూ. 82 కోట్లు, రామ రాజు సుమారు రూ. 30 కోట్లు, కట్టాల్సి ఉంటుంది. స్కాము వెలుగులోకి వచ్చిన 2009 జనవరి 7 నుంచి 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలి. మరోవైపు, నిషేధానికి సంబంధించి ఇప్పటికే అమలైన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని సెబీ పేర్కొంది. -
‘సత్యం’ కేసులో సెబీ ఉత్తర్వులు చెల్లవు
► రామలింగరాజు వ్యవహారంలో అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు ► ఆ జరిమానా; మార్కెట్ల నుంచి నిషేధించటం సరికాదు ► సెబీ సభ్యుడు తన బుద్ధిని ఉపయోగించినట్లు లేదు ► నాలుగు నెలల్లోగా తాజా ఉత్తర్వులివ్వాలి: శాట్ ముంబై: సత్యం కంప్యూటర్స్ కేసుకు సంబంధించి దాని వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో సహా మరికొందరికి వ్యతిరేకంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ (శాట్) ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి వారు అక్రమంగా ఆర్జించిన మొత్తాన్ని వెనక్కివ్వాలని గతంలో సెబీ ఉత్తర్వులిచ్చింది. అంతేకాకుండా వారిని స్టాక్ మార్కెట్లలో షేర్లు కొనటం, అమ్మటం వంటి కార్యకలాపాల నుంచి నిషేధించింది కూడా. ‘‘సెబీ ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని తోసిపుచ్చుతున్నాం. నాలుగు నెలల్లో తాజా ఉత్తర్వులివ్వాల్సిందిగా సెబీని ఆదేశిస్తున్నాం’’ అని శుక్రవారం శాట్ స్పష్టం చేసింది. రామలింగరాజు తదితరులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్ప డ్డారని, మోసపూరిత కార్యకలాపాలకు దిగారని సెబీ ఇచ్చిన ఉత్తర్వులతో శాట్ కూడా ఏకీభవించింది. అయితే కారణాలు చెప్పకుండా వారందరికీ ఒకే రీతిలో జరిమానా వెయ్యటాన్ని మాత్రం తప్పుబట్టింది. సెబీ హోల్‌టైమ్ సభ్యుడిచ్చిన ఉత్తర్వులు చట్టానికి నిలబడవని, అవి ఆలోచించి ఇచ్చిన ఉత్తర్వుల్లా అనిపించటం లేదని శాట్ సభ్యుడు జస్టిస్ జె.పి.దేవధర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సత్యం వ్యవహారంలో లేని లాభాల్ని ఉన్నట్లుగా చూపించినట్లు 2009లో రామలింగరాజు అంగీకరించారు. అది జరిగిన ఎనిమిదేళ్లకు శాట్ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపిన సెబీ... సత్యంకు చెందిన ఐదుగురు ఉన్నతస్థాయి అధికారులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి మోసపూరితంగా లాభాలు ఆర్జించారని, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని పేర్కొంది.ఈ మేరకు 2014 జూలై 5న సెబీ ఉత్తర్వులిస్తూ... రామలింగరాజు, ఇతరులు కలిసి రూ.1,848.93 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. వారిని 14 ఏళ్ల పాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించింది కూడా. ఈ ఉత్తర్వుల్ని ఇపుడు శాట్ పక్కనపెట్టింది. -
సత్యం దక్కకపోవడం దురదృష్టకరం
* ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ * నంబర్ 1 స్థానానికి చేరుకుంటాం: నాయక్ న్యూఢిల్లీ: ‘సత్యం’ కంప్యూటర్స్‌ను ఎల్ఎండ్టీ సొంతం చేసుకోకపోవడం దురదృష్టకరంగా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏఎం నాయక్ అభిప్రాయపడ్డారు. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకలు వెలుగు చూడడంతో ప్రభుత్వం కల్పించుకుని తర్వాత దాన్ని వేలం వేయడం, మహింద్రా గ్రూపు కొనుగోలు చేయడం తెలిసిందే. సత్యంలో అవకతవకల గురించి కంపెనీ అప్పటి చైర్మన్‌గా ఉన్న రామలింగరాజు స్వయంగా ప్రకటించడంతో షేరు ధర ఓ దశలో రూ.6.30కి పడిపోయింది. దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన సత్యం కంప్యూటర్స్‌లో ఎల్అండ్టీఅప్పటికే వాటాలు కలిగి ఉండీ దాన్ని దక్కించుకోకపోవడంపై నాయక్ తన అభిప్రాయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చివరిలో చేజారింది..: ‘సత్యం కంప్యూటర్స్‌ను సొంతం చేసుకునేందుకు మేము ముందు నుంచీ ప్రయత్నించాం. సత్యం కంప్యూటర్స్ షేర్ ధర పతనం మొదలైన తర్వాత రూ.210 దగ్గర, రూ.125 స్థాయిలో కూడా కొనుగోళ్లు జరిపాం. తర్వాత కూడా జరిపిన కొనుగోళ్లతో సగటున ఓ షేరు కొనుగోలు ధర రూ.80 రూపాయలుగా ఉంది. వేలంలో సత్యం కంప్యూటర్స్ షేరు ధర రూ.55-60 మధ్యలో ఉంటుందని భావించాం. అప్పటికే రూ.80 పెట్టి షేర్లు కొన్నందున... సగటు కొనుగోలు ధర తగ్గించుకునేందుకు రూ.47 కోట్ చేయాలని నిర్ణయించాం. అప్పుడు మొత్తం మీద సగటు ధర రూ.58 అవుతుంది. అయితే, మహీంద్రా సత్యం షేర్లను కొనుగోలు చేసి లేదు కనుక ఆలస్యంగా రంగంలోకి వచ్చినా షేర్‌కు 57-58 రూపాయలుగా బిడ్ వేసింది. దాంతో సత్యం ఆ కంపెనీ పరమైంది. ఇది దురదృష్టకరం. అయితే, ఎల్ అండ్ టీ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీని సృష్టించింది. 90 కోట్ల డాలర్ల ఆదాయంతో, 20వేల మంది ఉద్యోగులతో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ దేశంలో ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీ స్థాయికి చేరుకుంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు స్థాయి 200 కోట్ల డాలర్లకు తీసుకెళ్లడంతోపాటు ఐటీ టెక్నాలజీ రంగంలోనూ ఎల్అండ్టీని అగ్రపథంలో నిలబెట్టడమే మా అంతిమ లక్ష్యం’’ అని నాయక్ పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ బలమైన నాయకత్వం చేతిలోనే.. 52 సంవత్సరాలుగా ఎల్అండ్టీ కంపెనీతో కలసి ప్రయాణిస్తూ 18 ఏళ్లుగా తన నాయకత్వంలో కంపెనీని అగ్రగామిగా నిలబెట్టిన ఏఎం నాయక్ (74)... వచ్చే ఏడాది తన బాధ్యతలను తన వారసుడు ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేతికి 2017 అక్టోబర్ 1న అప్పగించనున్నారు. ఈ పరిణామాలపై నాయక్ మాట్లాడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. * ఎల్ అండ్ నా జీవితం. భార్య, పిల్లలకు మించి ఎల్అండ్టీకి ప్రాధాన్యం ఉంటుంది. నా తర్వాత కూడా కంపెనీ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తాను. * నా స్థానంలో వచ్చే వారికి పరిస్థితులు అంత సులువు కాదు. అయితే, ఎల్అండ్టీ భవిష్యత్తులోనూ బలమైన నాయకత్వం చేతిలోనే, దృఢంగానే ఉంటుంది. * సుబ్రహ్మణ్యన్ ప్రస్తుతం ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరక్టర్, డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్, ప్రెసిడెంట్ బాధ్యతలు చూస్తున్నారు. * మొదట షిప్‌బిల్డింగ్ బాధ్యతలు, తర్వాత హైదరాబాద్ మెట్రో పర్యవేక్షణ బాధ్యతలు సుబ్రహ్మణ్యన్‌కు అప్పగించాను. ఆ తర్వాత క్రమంగా ఐటీ వ్యాపారంలోకి తీసుకొచ్చాను. ఏడాదిగా మరిన్ని బాధ్యతలు అప్పగించాను. ఓ మార్గదర్శకుడిగా నేను చేయాల్సింది చేశా. * దేశంలో తయారీ, ప్రాజెక్టుల వ్యాపార రంగంలో ప్రతిభగల నాయకుల కొరత ఉంది. ఈ పరిస్థితి ఎల్అండ్టీ గ్రూపు వంటి వాటికి మరింత ఇబ్బందికరం. ఐఐటీ, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఉన్నవారు కూడా ఐటీ, టెక్నాలజీ, ఫైనాన్షియల్ రంగాల్లో పనిచేస్తున్నారు. దీంతో మేమే సాన పెట్టే కార్యక్రమాన్ని అంతర్గతంగా చేపట్టాం. దీంతో ఐఐటీ పట్టభద్రుల కంటే స్మార్ట్‌గా తయారవుతారు. నేటి నుంచి ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ లార్సెన్ అండ్ టుబ్రో అనుబంధ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 13న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.1,243 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. ఈ ఐపీఓకు ధర శ్రేణి రూ.705-710. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం 20 షేర్లకు బిడ్ చేయాలి. ఈ ఐపీఓలో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.710 ధరకు యాంకర్ ఇన్వెస్టర్లకు విక్రయించడం ద్వారా కంపెనీ ఇప్పటికే రూ.373 కోట్లు సమీకరించింది. -
స్పెషల్ కోర్టు తీర్పును కొట్టేయండి
మెట్రోపాలిటన్ కోర్టులో ‘సత్యం’ నిందితుల పిటిషన్ విచారణార్హతను ఈ నెల 15న తేల్చనున్న జడ్జి సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారి తరపు న్యాయవాదులు సోమవారం అప్పీళ్లు దాఖలు చేశారు. నేర విచారణ చట్టం(సీఆర్పీసీ) సెక్షన్ 374 కింద వాటిని సమర్పించారు. కుట్ర పన్నామనేందుకు ఆధారాలేమీ లేవని, తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిందని మొరపెట్టుకున్నారు. తమ అప్పీళ్లను విచారణకు స్వీకరించాలని, శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. పిటిషన్లను పరిష్కరించే వరకూ తమకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లను పరిశీలించిన జడ్జి టి.రజని విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. కాగా, ఈ కేసులో మరో ఇద్దరు దోషులు అప్పీళ్లు దాఖలు చేయాల్సి ఉంది. -
నేడు ‘సత్యం’ కుంభకోణం తీర్పు
6 నెలల క్రితమే వాదనలను పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన కోర్టు సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి తీర్పును ప్రకటిస్తామని, ఆ రోజున నిందితులు వారి తరఫు న్యాయవాదులతో హాజరుకావాలని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులుగా సంస్థ చైర్మన్ రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, సంస్థ వైస్‌ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం ఉన్నారు. రూ.14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477ఎ (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. కోర్టు మొత్తం 226 మంది సాక్ష్యులను విచారించగా, సీబీఐ సమర్పించిన 3,037 డాక్యుమెంట్లను, నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి ఆర్నెల్ల క్రితమే తుది విచారణను పూర్తి చేసింది. తీర్పును రిజర్వు చేసింది. కాగా సత్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది. ఈ కేసు ముఖ్యాంశాలు.... 2009 జనవరి 7: సత్యం కంప్యూటర్స్‌లో 7,100 కోట్లు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. తాను పులి మీద స్వారీ చేస్తున్నట్లు వెల్లడించారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ షేర్హోల్డర్లకు లేఖ రాశారు. జనవరి 9: రామలింగరాజు మోసం చేశారని నగరానికి చెందిన లీలామంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 9: ఈ కేసులో విచారణ మరింత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. జనవరి 11: రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫిబ్రవరి 14: కేసు విచారణకు సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో మల్టీ డిసిప్లెయినరీ ఇన్వెస్టిగేషన్ టీం (ఎండీఐటీ) ఏర్పాటు. ఏప్రిల్ 7: సీబీఐ కోర్టుకు ప్రధాన చార్జిషీట్‌ను సమర్పించింది. -
ఏప్రిల్ 9న సత్యం కేసు తుది తీర్పు
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. తుది తీర్పును సోమవారం న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ కొద్ది నెలల క్రితమే పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ప్రత్యేక న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 23 నాటికే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. కేసును క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరించాల్సి ఉందంటూ ప్రత్యేక జడ్జి తీర్పును మార్చి 9కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ అనంతరం 2010లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల పాటు సాగిన కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది. -
‘సత్యం’ తీర్పు నేడే!
-
‘సత్యం’ తీర్పు నేడే!
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సోమవారం తీర్పు వెలువడే అవకాశముంది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ కొద్ది నెలల క్రితమే పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ప్రత్యేక న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 23 నాటికే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. కేసును క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరించాల్సి ఉందంటూ ప్రత్యేక జడ్జి దీన్ని మార్చి 9కి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సంస్థ మాజీ సీఎఫ్ఓ శ్రీనివాస్ వడ్లమాని, పీడబ్ల్యూసీ ఆడిటర్లు ఎస్.గోపాలకృష్ణన్, టి.శ్రీనివాస్ సహా రామలింగరాజు మరో సోదరుడు సూర్యనారాయణరాజు, సంస్థ మాజీ ఉద్యోగులు జి.రామకృష్ణ, డి.వెంకటపతి రాజు, సీహెచ్ శ్రీశైలం, వి.ఎస్.ప్రభాకర్ గుప్తా ప్రధాన నిందితులుగా ఉన్నారు. సత్యం కేసును తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ దీని ప్రాధాన్యత ను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క కేసు విచారణ కోసం 2010లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. సత్యం కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది. -
మార్చి 9న సత్యం కేసు తీర్పు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రత్యేకకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే మార్చి 9న తీర్పును వెలువరించనున్నట్టు ప్రత్యేకన్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి మంగళవారం ప్రకటించారు. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు రామలింగరాజు సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు. -
టెక్ మహీంద్రాపై కేసు తగదు..
ఈడీ కేసును కొట్టివేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి టెక్ మహీంద్రాకు హైకోర్టులో ఊరట లభించింది. సత్యం కుంప్యూటర్స్ కుంభకోణం విషయంలో టెక్ మహీంద్రాపై మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన అవకతవకలకు టెక్ మహీంద్రా బాధ్యత వహించాలనడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్ మహీంద్రాపై ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ అభియోగాలన్నింటినీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ మేర టెక్ మహీంద్రాపై ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు సోమవారం తీర్పు వెలువరించారు. సత్యం కంప్యూటర్స్‌పై నమోదు చేసిన కేసును ఆ కంపెనీని విలీనం చేసుకున్న తరువాత కూడా ఈడీ తమపై కొనసాగించడాన్ని, చార్జిషీట్లో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాలు చేస్తూ టెక్ మహీంద్రా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి, సోమవారం మధ్యాహ్నం తీర్పునిచ్చారు. టెక్ మహీంద్రా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ రుజువు చేయలేకపోయిందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు, ఆ కంపెనీకి చెందిన ఇతరులు చేసిన తప్పులను టెక్ మహీంద్రాకు ఆపాదించడం తగదని స్పష్టం చేశారు. అధికరణ 226 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసే అధికారం హైకోర్టుకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
‘సత్యం’ డెరైక్టర్లకు ఆర్నెల్ల జైలుశిక్ష
* కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు * రామలింగరాజు సహా ఇతర డెరైక్టర్లకు రూ. 10.5 లక్షల చొప్పున జరిమానా * మరో డెరైక్టర్ కృష్ణాజీకి రూ. 2.66 కోట్ల జరిమానా * అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నెల రోజులు వాయిదా * కంపెనీల చట్టం ఉల్లంఘన కేసులోనే ఈ శిక్షలు.. * సీబీఐ కేసులో 23న వెలువడనున్న తీర్పు.. విచారణలోనే సెబీ కేసు సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ సంస్థ డెరైక్టర్లు కంపెనీల చట్టంలోని అనేక నిబంధనలను ఉల్లంఘించారని నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఎఫ్ఐవో) 2009లో దాఖలు చేసిన ఏడు వేర్వేరు ఫిర్యాదుల్లో.. ఆరింటిలో వారిని దోషులుగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు. అప్పటి సత్యం కంప్యూటర్స్ సంస్థ డెరైక్టర్లుగా ఉన్న రామలింగరాజు, జయరామన్, ఎన్నారై రామ్ మైనంపాటిలకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.10.5 లక్షల చొప్పున జరిమానా విధించారు. రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌కు ఆరునెలల జైలు, రూ.50 వేల వరకు జరిమానా విధించారు. మరో డెరైక్టర్ కృష్ణాజీ పాలెపునకు రూ.2.66 కోట్లు జరిమానా విధిస్తూ.. చెల్లించేం దుకు రెండు నెలలు గడువిచ్చారు. మిగతావారు జరిమానా చెల్లించేందుకు న్యాయమూర్తి నెల రోజులు గడువు ఇచ్చారు. రూ. 50 వేలు జరిమానా చెల్లించడంతో శిక్ష అమలును నెల రోజుల పాటు వాయిదా వేస్తూ.. హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. సీబీఐ కేసులో.. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 23న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఐదేళ్ల విచారణ తర్వాత ఇటీవల ఈకేసులో తీర్పును కోర్టు రిజర్వు చేసింది. ఇందులో రామలింగరాజు, రామరాజు, సూర్యనారాయణరాజుతోపాటు ఏడుగురు నిందితులుగా ఉన్నారు. ఆ కేసులో కోర్టు 216 మంది సాక్షులను విచారించగా.. సీబీఐ సమర్పించిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది. 2009 జనవరి 7న సత్యం కంపెనీలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. ఈ మేరకు రామలింగరాజుపై హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసు విచారణ సీబీఐకి బదిలీ అయ్యింది. విచారణలో సెబీ కేసు ఈ కుంభకోణంపై సెబీ ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టులో మూడు ఫిర్యాదులు దాఖలు చేసింది. అందులో రామలింగరాజు సోదరులు, ఇతర కుటుంబ సభ్యు లు, టీవీ-9 అధినేత శ్రీనిరాజు నిందితులు. ఆరోపణలు రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. -
స్కామ్ నుంచి తీర్పు వరకూ...
సత్యం కుంభకోణం పరిణామాల క్రమం ఇదీ.. పెనుసంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తాజాగా ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శిక్షలు ప్రకటించింది. వ్యవస్థాపకుడు రామలింగ రాజు సహా ఇతర డెరైక్టర్లకు సోమవారం జైలు శిక్షలు, జరిమానాలు విధించింది. ఈ నేపథ్యంలో సత్యం కుంభకోణం, దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలపై కథనం. 2009లో బయటపడిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. సత్యం కంప్యూటర్స్‌ను 1987లో ప్రారంభించిన రామలింగరాజు 2009 జనవరి దాకా దానికి చైర్మన్‌గా కొనసాగారు. 2008 డిసెంబర్లో మేటాస్‌ను కొనుగోలు చేసే అంశం తిరగబడటంతో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకి చెందిన మేటాస్ని రామలింగరాజు కుమారులే నిర్వహించేవారు. అప్పట్లో రియల్ ఎస్టేట్‌కి బాగా బూమ్ ఉండటంతో రామలింగరాజు కంపెనీలో తన షేర్లను తనఖా పెడుతూ.. వచ్చిన నిధులను మేటాస్ ద్వారా భారీ స్థాయిలో స్థలాలను కొనడానికి మళ్లించారన్న అభియోగాలున్నాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే షేరుకు మంచి రేటు వస్తుంది కాబట్టి.. అందుకోసం అకౌంటింగ్ కుంభకోణానికి తెరతీశారు. లేని లాభాలు ఉన్నట్లుగా చూపడం ద్వారా కంపెనీ పటిష్టమైన స్థితిలో ఉన్నట్లు చూపారు. కానీ, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభ ప్రభావంతో రియల్టీ ధరలు పతనమయ్యాయి. మరోవైపు, తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునేందుకు నిధులూ లేకుండా పోయాయి. ఈ దశలో గణనీయంగా ల్యాండ్‌బ్యాంక్ ఉన్న మేటాస్‌ను సత్యం కంప్యూటర్స్‌లో విలీనం చేసేందుకు రాజు ప్రయత్నం చేశారు. కానీ, సత్యం కంప్యూటర్స్ నిధులను నిరర్ధకమైన రియల్టీలోకి మళ్లిస్తున్నారనే ఉద్దేశంతో కంపెనీ ఇన్వెస్టర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సత్యం అకౌంట్ల గోల్మాల్ జరుగుతోన్న వ్యవహారాన్ని 2009 జనవరిలో రాజు బయట పెట్టారు. లేని లాభాలను లెక్కల్లో చూపినట్లు ఆయన ప్రకటించారు. దాదాపు రూ. 7,000 కోట్ల అకౌంటింగ్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ భారీ ఖాతాల కుంభకోణం వెలుగులోకిరావడం... సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన అరెస్టయ్యారు. ఇందుకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో), అటు సెబీ దర్యాప్తు చేపట్టాయి. ఎస్ఎఫ్ఐవో మొత్తం ఏడు కేసులు పెట్టింది. బ్యాలెన్స్ షీట్లలో అవకతవకలకు పాల్పడటం, షేర్హోల్డర్లను మోసం చేయడం, అక్రమంగా ప్రయోజనాలు పొందటం, చెల్లించని డివిడెండ్లను చెల్లించినట్లుగా చూపడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. తాజాగా ఇందులోనే ఆరు కేసుల్లో కోర్టు శిక్షలు విధించింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా.. మరోవైపు, సత్యం కుంభకోణంపై అటు స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కూడా విచారణ జరిపింది. ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత తుది ఉత్తర్వులు ఇచ్చింది. సెబీ దర్యాప్తు ప్రకారం ఈ స్కామ్ విలువ రూ.12,320 కోట్లుగా అంచనా వేసింది. దీనికి సంబంధించి సెబీ రామలింగరాజుపై, మరో నలుగురిపై 14 ఏళ్ల నిషేధం విధించింది. రూ. 1,849 కోట్ల అక్రమార్జనను వడ్డీతో సహా కట్టాలని ఆదేశించింది. వడ్డీతో కలిపితే ఈ మొత్తం రూ. 3 వేల కోట్ల పైచిలుకు ఉంటుందని తేలింది. కనుమరుగైన బ్రాండ్.. స్కామ్‌లో కూరుకుపోయిన కంపెనీని విక్రయించేందుకు ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టెక్ మహీంద్రా... సత్యంను చేజిక్కించుకుని దాని పేరును మహీంద్రా సత్యంగా మార్చింది. ఆతర్వాత మహీంద్రా సత్యంకూడా టెక్ మహీంద్రాలో పూర్తిగా విలీనంకావడంతో సత్యం కంపెనీ పేరు కాలగర్భంలో కలిసిపోయింది. -
నాంపల్లి కోర్టుకు సెషన్స్ హోదాపై పూర్తి వివరాలను సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని 21వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సెషన్స్ హోదా ఇవ్వడంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ సంస్థలకు సంబంధించిన కేసులను విచారించే పరిధి ఆ కోర్టుకు లేదని సత్యం కంప్యూటర్స్ మాజీ ఎండీ రామరాజు గతవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ పుర్కర్ సోమవారం విచారించారు. ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానానికి తమ కేసులను విచారించే పరిధిని కట్టబెట్టడం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
సెబీ కేసులో కోర్టు ముందుకు రామలింగరాజు
సాక్షి, హైదరాబాద్: మదుపుదారులను మోసం చేశారంటూ స్టాక్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) దాఖలు చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు గురువారం ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితుల జాబితాలో ఉన్న ఆయన భార్య నందిని, కుమారుడు తేజరాజు, సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, కుటుంబ సభ్యులు రామరాజు, ఝాన్సీరాణి, సత్యం మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, మాజీ వీపీ (ఫైనాన్స్) జి.రామకృష్ణ, ఆడిటింగ్ విభాగం హెడ్ వీఎస్ ప్రభాకర్‌గుప్తా, మాజీ డెరైక్టర్, టీవీ-9 అధినేత చింతలపాటి శ్రీనివాసరాజు అలియాస్ శ్రీని రాజు తదితరులు హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి లక్ష్మణ్...రూ.20 వేల చొప్పున పూచీకత్తు బాండ్లు సమర్పించాలని షరతు విధించారు. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ, ఆడిటర్ తళ్లూరి శ్రీనివాస్‌లకు సమన్లు అందకపోవడంతో వారు కోర్టుకు హాజరుకాలేదు. ఇదిలా ఉండగా ఇదే కేసులో శ్రీని రాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (మైటాస్ ఇన్ఫ్రా), సూర్యనారాయణ రాజుకు చెందిన ఎస్ఆర్ ఎస్ఆర్ హోల్డింగ్స్‌లు కూడా నిందితుల జాబితాలో ఉండగా ఆ సంస్థల తరఫు ప్రతినిధులు హాజరయ్యారు. -
ఆడిటర్లు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్‌కు ఆడిటింగ్ నిర్వహించిన ఆడిటర్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, తప్పుడు ఆడిటింగ్ నివేదికలు ఇచ్చి లక్షలాది మంది మదుపరులను మోసం చేశారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆరోపించింది. సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం ప్రభుత్వానికి, పర్యవేక్షణ సంస్థలకు తప్పుడు నివేదికలు సమర్పించి దేశప్రతిష్టను దెబ్బతీసిందని పేర్కొంది. సెబీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సెబీ రెండు వేర్వేరు ఫిర్యాదులు దాఖలు చేసింది. సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సత్యం కంప్యూటర్స్ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, ఆడిటింగ్ నిర్వహించిన పీడబ్ల్యుసీ ఆడిటింగ్ సంస్థతోపాటు ఆడిటర్లు తళ్లూరి శ్రీనివాస్, గోపాలకృష్ణన్‌తోపాటు దాదాపు 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నేర విచారణ చట్టంలోని సెక్షన్ 200తోపాటు సెబీ చట్టంలోని సెక్షన్లు 12(ఎ), 24(1), 26, 27ల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సెబీ స్పెషల్ పీపీ బీఎస్ శివప్రసాద్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదుతోపాటు 18 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా సమర్పించారు. సెబీ దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ప్రదీప్ రామకృష్ణన్ ఉండగా, సాక్షులుగా సెబీ సీజీఎం ఎ.సునీల్‌కుమార్, జీఎం బి.ముఖర్జీలను పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్...ఈ ఫిర్యాదులను విచారించే అవకాశం ఉంది. -
సత్యం కుంభకోణం కేసు...
టెక్ మహీంద్ర పిటిషన్‌పై 30న హైకోర్టు తీర్పు హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టెక్ మహీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఈ నెల 30న తీర్పు వెలువరిస్తానని స్పష్టం చేశారు. సత్యం కంప్యూటర్స్‌పై నమోదు చేసిన కేసును ఆ కంపెనీని విలీనం చేసుకున్న తరువాత కూడా ఈడీ తమపై కొనసాగిస్తూ చార్జిషీట్లో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాలు టెక్ మహీంద్ర హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపించారు. సత్యం కుంభకోణం తరువాత ఆ కంపెనీ బాధ్యతలు చూడాలని కేంద్రం కోరితేనే తాము ఆ బాధ్యతలు స్వీకరించామని, అటువంటి తమను నిందితుల జాబితాలో చేర్చడం ఎంత మాత్రం సరికాదని తెలిపారు. సత్యం కంప్యూటర్స్, టెక్ మహీంద్ర విలీనానికి ఆమోదముద్ర వేస్తూ ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని, సత్యంపై ఉన్న కేసులన్నింటికీ కూడా టెక్ మహీంద్ర బాధ్యత వహించాలని ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. -
టెక్ మహీంద్రా లాభం రూ. 614 కోట్లు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా జనవరి-మార్చి(క్యూ4) కాలానికి దాదాపు 4% తక్కువగా రూ. 614 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 638 కోట్లను ఆర్జిం చింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఇదే కాలానికి కంపెనీ ఆదాయం మాత్రం 34%పైగా పుంజుకుని రూ. 5,058 కోట్లయ్యింది. అంతక్రితం రూ. 3,767 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీలో సత్యం కంప్యూటర్స్ విలీనమైన సంగతి తెలిసిందే. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 10.1 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం 18%పైగా ఎగసి 82.5 కోట్ల డాలర్లను తాకింది. వేగంగా మారుతున్న ప్రపంచంలో కస్టమర్ల నుంచి డీల్స్ పొందడం, వృద్ధిని అందుకోవడం వంటి అంశాలలో పటిష్ట పనితీరును చూపుతున్నామని, ఈ విషయాన్ని ఫలితాలు వెల్లడిస్తున్నాయని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ వ్యాఖ్యానించారు. వాటాదారులకు షేరుకి రూ. 10 డివిడెండ్‌ను చెల్లించనుంది. పూర్తి ఏడాదికి పూర్తి ఏడాదికి(2013-14) మాత్రం కంపెనీ నికర లాభం దాదాపు 55% జంప్‌చేసి రూ. 3,029 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ. 1,956 కోట్ల లాభం నమోదైంది. ఇదే కాలానికి ఆదాయం కూడా 31%పైగా ఎగసి రూ. 18,831 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 14,332 కోట్ల ఆదాయాన్ని సాధించింది. డాలర్ల రూపేణా నికర లాభం 49.8 కోట్ల డాలర్లుకాగా, ఆదాయం దాదాపు 18% పుంజుకుని 309 కోట్ల డాలర్లుగా నమోదైంది. దేశీయంగా అతిపెద్ద విలీనాన్ని పూర్తిచేయడం ద్వారా సమీకృత కంపెనీగా ఎదిగినట్లు కంపెనీ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. కొత్తగా 6,333 మందికి ఉద్యోగాలివ్వడం ద్వారా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 89,441ను చేరింది. దీనిలో సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య 60,997కాగా, బీపీవో విభాగంలో 21,830 మంది పనిచేస్తున్నారు. మార్చి చివరికల్లా రూ. 363 కోట్లమేర రుణాలు నమోదుకాగా, నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 3,599 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 1% లాభపడి రూ. 1,838 వద్ద ముగిసింది. -
'సత్యం’రామలింగరాజు సతీమణికి జైలుశిక్ష
రామలింగరాజు సతీమణి సహా 20 మంది కుటుంబసభ్యులకు జైలుశిక్ష సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను ఎగవేత కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి.రామలింగరాజు కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. రామలింగరాజు కుటుంబానికి చెందిన 19 అనుబంధ కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న 20 మందికి నాంపల్లిలోని ప్రత్యేక ఆర్థిక నేరాల న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష ఉత్తర్వుల అమలును నెల రోజుల పాటు వాయిదా వేసింది. జైలుశిక్ష పడిన వారిలో రామలింగరాజు సతీమణి బి.నందినీరాజు, కుమారుడు బి.తేజరాజు, సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణరాజు, సోదరుడి భార్య బి.రాధారాజు, మాజీ సీఎఫ్‌వో ఎన్.రామరాజులతో పాటు పలువురు సమీప బంధువులు ఉన్నారు. మహిళా డెరైక్టర్లకు ఆర్నెల్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధించగా, మిగిలిన వారికి ఏడాది జైలు, రూ. 10 వేల జరిమానా విధించింది. శిక్ష పడిన నిందితులంతా అప్పటికప్పుడు రూ. 8.40 లక్షలు పూచీకత్తు చెల్లించి ఇంటికి వెళ్లారు. రామలింగరాజుకు చెందిన మరో సంస్థ మేటాస్ హిల్కౌంట్ నిర్మించిన అపార్ట్మెంట్, విల్లాలకు ఈ 19 అనుబంధ సంస్థల పేరు మీద భూముల బదలాయింపు జరిగింది. మేటాస్ సంస్థ తనకు వచ్చిన ఆదాయాన్ని ఈ 19 కంపెనీలకు ఇచ్చింది. ఈ కంపెనీలు కూడా రికార్డుల్లో ఆ ఆదాయాన్ని చూపించాయి. పెట్టుబడి లాభాలకు ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని చూపుతూ రిటర్న్స్ దాఖలు చేసిన ఈ కంపెనీలు, పన్ను మాత్రం చెల్లించలేదు. ముందస్తు పన్ను చెల్లింపులూ చేయలేదు. ఈ కంపెనీలన్నీ ఆదాయ పన్ను శాఖకు రూ. 90 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు బకాయి పడ్డాయి. పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఈ కంపెనీలకు నోటీసులు జారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో... అవి ఆదాయ పన్ను ఎగవేశాయంటూ ఐటీ విభాగం ప్రత్యేక ఆర్థిక నేరాల న్యాయస్థానంలో ఫిర్యాదులు చేసింది. వీటిపై విచారించిన కోర్టు... ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 276సీ(2) కింద పన్ను చెల్లించకపోవడాన్ని నేరంగా పరిగణిస్తూ ఆయా డెరైక్టర్లకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 19 అనుబంధ కంపెనీలివే... నాగవల్లి గ్రీన్‌ల్యాండ్స్, గోమతి ఆగ్రోఫార్మ్స్, నల్లమల ఆగ్రోఫార్మ్స్, చిత్రావతి ఆగ్రోఫార్మ్స్, గోమన్ ఆగ్రోఫార్మ్స్, కాంచన్‌జంగా గ్రీన్‌ల్యాండ్స్, హిమగిరి గ్రీన్‌ఫీల్డ్స్, కోనార్ గ్రీన్‌ఫీల్డ్స్, హిమగిరి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, మేదరవతి ఆగ్రోఫార్మ్స్, సింధూ గ్రీన్‌ఫీల్డ్స్, స్వర్ణగిరి గ్రీన్‌ఫీల్డ్స్, వింధ్యా గ్రీన్‌ల్యాండ్స్, వార్దా గ్రీన్‌ఫీల్డ్స్, యమునా ఆగ్రోఫార్మ్స్, వంశధార ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, పర్బతి ఆగ్రోఫార్మ్స్, ఉత్తరాషాడ బయోటెక్ లిమిటెడ్, స్వర్ణముఖి గ్రీన్‌ఫీల్డ్స్ కంపెనీల్లో డెరైక్టర్లు వీరే... బీవీఎస్ సుబ్బరాజు, ఐవీ కృష్ణంరాజు, బి.ఝాన్సీ, ఎన్.రామరాజు, బి.నందినీరాజు, ఏవీ రాఘవరాజు, బి.రాధారాజు, బి.సూర్యనారాయణరాజు, ఎం.సూర్యనారాయణరాజు, బి.తేజరాజు, కె.గోపాలకృష్ణరాజు, మంతెన హరిప్రసాద్‌రాజు, ఎన్ఎస్ఎల్ఆర్ ప్రసాదరాజు, మల్లప్పరాజు, డి.శ్రీనివాసరాజు, కె.గోపీకృష్ణంరాజు, కేవీవీ కృష్ణంరాజు, జానకీరామరాజు, డీజీకే రాజు, బి.రామరాజు -
సత్యం రామలింగరాజు భార్యకు జైలు శిక్ష
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థల ఆదాయనుపన్ను ఎగవేత కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 19 సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థలకు చెందిన 84 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో సత్యం రామలింగరాజు భార్య నందిని, కుమారులు రామరాజు, తేజరాజు సోదరుడి భార్య రాధ ఉన్నారు. మహిళా నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించింది. పురుషులకు ఏడాది జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా వేసింది. -
'సత్యం' రామలింగరాజుపై ఈడీ చార్జిషీట్!
వ్యాపార ప్రపంచాన్ని కుదిపేసిన సత్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగ రాజు, ఇతర 212 మందితోపాటు కొన్ని కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చార్జిషీట్ ను దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (పీఎమ్ఎల్ఏ) కింద మనీలాండరింగ్ పాల్పడ్డారనే ఆరోపణలతో 21వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తికి దర్యాప్తు రిపోర్టును ఈడీ సమర్పించింది. సత్యం కంప్యూటర్ అండ్ సర్విసెస్ లిమిటెడ్ (ఎస్‌సీఎస్‌ఎల్) షేర్లను చట్టవ్యతిరేకంగా రామలింగరాజు, ఇతరుల అమ్మకాలు జరిపారని నివేదికలో వెల్లడించింది. ఈ కేసును సీబీఐ కూడా విచారించింది. -
మన షేర్లు ముంచేశాయ్
ఒకప్పుడు భారీ లాభాలందించిన రాష్ట్ర కంపెనీలిపుడు ఇన్వెస్టర్లను నిండా ముంచుతున్నాయి. గడిచిన రెండేళ్లలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు లాభపడినా... రాష్ట్ర కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు మాత్రం ఆవిరైపోయాయి. అతితక్కువ కంపెనీలు తప్ప రాష్ట్రానికి చెందిన దిగ్గజాలు కూడా మదుపరులను ముంచేశాయి. స్టాక్ మార్కెట్లో రాష్ట్ర కంపెనీలు గతంలో ఓ వెలుగు వెలిగాయి. ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ముందంజ వేస్తే... సాఫ్ట్వేర్ రంగంలో సత్యం కంప్యూటర్స్, విజువల్ సాఫ్ట్ వంటివి ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు సృష్టించాయి. ఇక ఇన్ఫ్రా రంగంలోనైతే జీఎంఆర్, జీవీకే, ఐవీఆర్సీఎల్, ల్యాంకో, ఎన్సీసీ వంటివి పోటీపడి కాంట్రాక్ట్‌లను దక్కించుకుంటూ దూసుకెళ్లాయి. సిమెంట్ రంగంలో కూడా రాశి, సాగర్ సిమెంట్స్, ప్రియా సిమెంట్స్ వంటివి మంచి పనితీరు కనబరిచాయి. దీంతో ఇన్వెస్టర్లు రాష్ర్ట కంపెనీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. కానీ నాలుగేళ్లుగా ఈ పరిస్థితులు తారుమారయ్యాయి. గడిచిన రెండేళ్లలో అయితే పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన ఆర్థిక సంక్షోభం ఒక కారణమైతే... ఆ ప్రభావంతో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, యాజమాన్య వైఫల్యాలు, షేర్ల తనఖాలు వంటివి కూడా తోడయ్యాయి. దీంతో షేర్లు కుప్పకూలుతున్నాయి. ఒకో కంపెనీది ఒకో సమస్య యాజమాన్య వైఫల్యాలతో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు చరిత్రలో కలిసిపోయాయి. సత్యం... టెక్ మహీంద్రాలో విలీనంకాగా, విజువల్ సాఫ్ట్... మెగా సాఫ్ట్‌లో కలసిపోయింది. దేశ ముఖచిత్రాన్ని మార్చగల ఇన్ఫ్రా కంపెనీలు జీఎంఆర్, జీవీకే, ల్యాంకో, ఐవీఆర్సీఎల్, ఎన్సీసీ భారీ రుణాలతో కుదేలయ్యాయి. ఇక యానిమేషన్ వండర్ డీక్యూ ఎంటర్టైన్మెంట్, రైళ్లు ఢీకొనకుండా చూసే పరికరాలను అభివృద్ధి చేసిన కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, ఎల్ఈడీ ఉత్పత్తులు మిక్ ఎల క్ట్రానిక్స్, ఖనిజాల జాడకనిపెట్టే సీస్మిక్ సర్వేల్ని విశ్లేషించే అల్ఫాజియో వంటి ప్రత్యేక తరహా కంపెనీలు కూడా సమస్యల్లో పడ్డాయి. రుణ భారంలో ఇరుక్కుపోయిన ఇన్ఫ్రా కంపెనీలు... పోటీపడి దక్కించుకున్న కాంట్రాక్ట్‌లను సైతం వదులుకునే స్థితికి చేరాయి. బ్యాంకింగ్ రంగంలో పెరిగిన మొండిబకాయిల వల్ల ఆంధ్రాబ్యాంక్, ఆతిథ్య రంగ మందగమనం వల్ల తాజ్ జీవీకే హోటల్స్ వంటి సంస్థలు కూడా వెనకబడ్డాయి. ఈ ప్రభావమంతా షేర్లను తాకటంతో ఇన్వెస్టర్ల నెత్తిన పిడుగులు పడుతున్నాయి. నిలదొక్కుకున్న కంపెనీలూ ఉన్నాయ్... ఆటుపోట్లను తట్టుకుంటూ కచ్చితమైన భవిష్యత్ వ్యూహాలతో విస్తరిస్తున్న రాష్ట్ర కంపెనీలు కూడా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్నే తీసుకుంటే... పరిశోధన రంగంలోనూ భారీ పెట్టుబడులు పెడుతూ ముందుకెళుతోంది. దీంతో షేరు ధర కూడా గత రెండేళ్లలో దాదాపు 38% లాభాలను అందించటమే కాక సెన్సెక్స్‌లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తూ బిజినెస్‌ను పెంచుకుంటున్న అపోలో హాస్పిటల్స్ షేరు ఈ రెండేళ్లలో 79 శాతం దూసుకెళ్లింది. అంకాలజీ (కేన్సర్ చికిత్స) ఔషధాలలో తన ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు చౌక ధరల్లో జనరిక్స్‌ను అందిస్తూ నాట్కో ఫార్మా కూడా నిలదొక్కుకుంది. దీంతో ఈ షేరు ధర రెట్టింపై ఇన్వెస్టర్ల పంట పండించింది. టెలికం రంగానికి అవసరమయ్యే యూపీఎస్ బ్యాటరీలతో మొదలుపెట్టిన అమరరాజా బ్యాటరీస్, తీవ్రమైన పోటీలో కూడా అమరాన్ బ్రాండ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది. నిజానికి పతనమైన రాష్ట్ర కంపెనీలతో పోలిస్తే ఇన్వెస్టర్లకు లాభాలిచ్చినవి అతితక్కువే కావచ్చు. కానీ ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు ఏ పరిస్థితిలోనైనా దూసుకెళతాయని మాత్రం ఇవి చెబుతున్నాయి. - సాక్షి, బిజినెస్ డెస్క్