సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని 21వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సెషన్స్ హోదా ఇవ్వడంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ సంస్థలకు సంబంధించిన కేసులను విచారించే పరిధి ఆ కోర్టుకు లేదని సత్యం కంప్యూటర్స్ మాజీ ఎండీ రామరాజు గతవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ పుర్కర్ సోమవారం విచారించారు. ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానానికి తమ కేసులను విచారించే పరిధిని కట్టబెట్టడం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
నాంపల్లి కోర్టుకు సెషన్స్ హోదాపై పూర్తి వివరాలను సమర్పించండి
Published Tue, Nov 25 2014 1:23 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement
Advertisement