సత్యం కేసులో  సెబీకి ‘సుప్రీం’ ఊరట | Stay for sat orders on ban on auditors | Sakshi
Sakshi News home page

సత్యం కేసులో  సెబీకి ‘సుప్రీం’ ఊరట

Published Tue, Nov 19 2019 3:41 AM | Last Updated on Tue, Nov 19 2019 3:41 AM

Stay for sat orders on ban on auditors - Sakshi

న్యూఢిల్లీ: ఆడిటర్లను నిషేధించే అధికారం మార్కెట్స్‌ నియంత్రణ సంస్థ సెబీకి లేదంటూ సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.  సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కేసు విషయంలో  సెప్టెంబర్‌ 9న శాట్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెబీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.  

వివరాలు ఇవీ... 
- రూ.7,800 కోట్ల సత్యం కుంభకోణానికి సంబంధించిన పాత్రపై ప్రైస్‌ వాటర్‌హౌస్‌కూపర్స్‌ ఇండియా విభాగం  ప్రైస్‌ వాటర్‌హౌస్‌(పీడబ్ల్యూసీ)పై సెబీ  2018 జనవరి 10వ తేదీన రెండు సంవత్సరాల నిషేధం విధించింది. సంబంధింత రెండేళ్ల సమయంలో లిస్టెడ్‌ కంపెనీల ఆడిటింగ్‌ నిర్వహించరాదని స్పష్టం చేసింది.  ఈ ఉత్తర్యులను శాట్‌లో పీడబ్ల్యూసీ సవాలు చేసింది.  
- కేసును విచారించిన ట్రిబ్యునల్, ఆడిట్‌ సంస్థ– ప్రైస్‌వాటర్‌హౌస్‌పై సెబీ నిషేధం విధించడం సరికాదని తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. అయితే తప్పు చేసిన ఆడిటర్ల నుంచి రూ.13 కోట్ల ఫీజు వాపసు నిర్ణయాన్ని  పాక్షికంగా అనుమతించింది.   
- ఆడిటర్లపై చర్య తీసుకునే అధికారం కేవలం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ)కి మాత్రమే ఉందని కూడా శాట్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆడిటింగ్‌లో నిర్లక్ష్యం ప్రాతిపదికనే మోసాలను నిరూపించజాలమని పేర్కొంది.  ఆడిట్, ఆడిటింగ్‌ సేవల నాణ్యత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం సెబీకి లేదని శాట్‌ తన ఉత్తర్వు్యల్లో తెలిపింది.  
- ‘‘తప్పు జరక్కుండా ముందస్తు చర్యలు, లేదా తదుపరి చర్యలను మాత్రమే సెబీ తీసుకోగదు. అయితే ఇక్కడ అటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ శిక్ష విధించిన దాఖలాలే కనిపిస్తున్నాయి. ఈ అధికారం సెబీకి లేదు’’ అని శాట్‌ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది.  

సత్యం కేసు ఇదీ... 
ఒకప్పటి సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌లో కోట్లాది రూపాయల మోసం జరిగిన విషయం 2009 జనవరి 8న వెలుగుచూసింది. అప్పటికి కొన్నేళ్లుగా రూ.5,004 కోట్ల మేర ఖాతాల్లో అవకతవకలకు పాల్పడినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు బహిరంగంగా అంగీకరించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచి్చంది. ఈ మోసపూరిత ఆరి్థక కుంభకోణం విలువ దాదాపు రూ.7,800 కోట్లని సెబీ విచారణలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement