ramalingaraju
-
సత్యం రామలింగరాజుతోపాటు ఆ నలుగురికి రూ.624 కోట్లు లాభం..
సత్యం కంప్యూటర్స్ కంపెనీ ఆదాయ, వ్యయాలకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపించినట్లు అప్పటి సంస్థ ఛైర్మన్ రామలింగరాజు అంగీకరించిన విషయం తెలిసిందే. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో కంపెనీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా రామలింగరాజు, ఇతరులు కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టి అక్రమంగా లాభపడినట్లు సెబీ తెలిపింది. అయితే సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులు రూ.624 కోట్ల మేరకు అక్రమంగా లబ్ధి పొందినట్లు నిర్ధారించింది. ఆ సొమ్మును వడ్డీతో సహా వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ నలుగురిలో రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకు చెందిన ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో భాగంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సెబీ 96 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం రూ.624 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల ఈ సొమ్మును 2009 జనవరి 7వ తేదీ నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. 2018 అక్టోబరు, నవంబరులో సెబీ ఇచ్చిన రెండు ఉత్తర్వుల్లో రామలింగరాజు, ఆయన సహచరులు అక్రమంగా ఏ మేరకు లబ్ది పొందారో తెలిపింది. ఆ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) ఈ ఏడాది ఫిబ్రవరిలో నిలిపేసింది. ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటి నుంచి పరిశీలించి తాజా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. అందుకు ఈ ఏడాది నవంబరు 30వ తేదీని గడువుగా నిర్దేశించింది. దీన్ని అనుసరించి సెబీ కొత్త ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించడంతో పాటు గతంలో అనుసరించిన నియమాలను సైతం పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు సెబీ డైరెక్టర్ అనంత్ నారాయణ్ తెలిపారు. సత్యం ఖాతాల కుంభకోణం వెలుగు చూసిన తర్వాత రామలింగరాజు, రామరాజులను సెక్యూరిటీస్ మార్కెట్లో 2028 జూన్ 14 వరకు కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ నిషేధించింది. అయితే ఈ ఉత్తర్వుల్లో అంశాల అమలు ప్రక్రియ సుప్రీంకోర్టులోని అప్పీళ్లపై వెలువడే తీర్పులను బట్టి ఉంటుదని తెలుస్తోంది. గతంలో సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యూనల్ సూచనల మేరకు సెబీ రామలింగరాజు, ఇతరులకు 14 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎలాంటి మార్కెటింగ్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని పేర్కొంది. కాగా, అప్పటికే ఆదేశించిన రూ.1258.88 కోట్ల మొత్తాన్ని రూ.813.40 కోట్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ కంపెనీ రూ.675 కోట్లు, రామలింగరాజు రూ.27కోట్లు, సూర్య నారాయణరాజు 82 కోట్లు, రామరాజు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన 2009 జనవరి నుంచి వడ్డీతో సహా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అయితే రామలింగరాజు, ఇతరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో సెబీ సహేతుకంగా వివరించలేకపోయినట్లు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్) పేర్కొంది. అందువల్ల మళ్లీ కొత్త ఉత్వర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. షేర్ల లావాదేవీల్లో పొందిన లబ్ధిని కూడా తిరిగి లెక్కించాలని ఆదేశించింది. అనంతరం రామలింగరాజును సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 14 ఏళ్ల పాటు నిషేధిస్తూ సెబీ ఇచ్చిన ఉత్తర్వులను శాట్ నిలుపుదల చేసింది. ఈ వివాదాన్ని మళ్లీ పరిశీలించి, కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. దాంతో తాజాగా సెబీ శాట్‌కు అన్ని వివరాలతో నివేదించింది. ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు! ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో 1987లో కేవలం 20 మంది ఉద్యోగులతో ప్రారంభించిన సత్యం కంప్యూటర్స్ అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బిల్ గేట్స్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన రామలింగరాజు అంతే స్థాయిలో దిగజారిపోయారు. సత్యం కుంభకోణం అప్పుడు ఓ సంచలనంగా మారింది. ఎన్నో వాయిదాల అనంతరం సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు, అతని సోదరులు రామరాజు, సూర్య నారాయణ రాజు తదితరులకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. సెబీ ఆయన కంపెనీలపై నిషేధం విధించింది. వేలాది మంది ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన బాటపట్టారు. ఇదంతా జరిగి దాదాపు పద్నాలుగేళ్లు కావస్తుంది. ఇప్పటికీ వారి నుంచి ఎలాంటి నష్టపరిహారాన్ని రికవరీ చేయలేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. -
సత్యం కేసులో సెబీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: ఆడిటర్లను నిషేధించే అధికారం మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీకి లేదంటూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసు విషయంలో సెప్టెంబర్ 9న శాట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెబీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన డివిజన్ బెంచ్ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వివరాలు ఇవీ... - రూ.7,800 కోట్ల సత్యం కుంభకోణానికి సంబంధించిన పాత్రపై ప్రైస్ వాటర్‌హౌస్‌కూపర్స్ ఇండియా విభాగం ప్రైస్ వాటర్‌హౌస్(పీడబ్ల్యూసీ)పై సెబీ 2018 జనవరి 10వ తేదీన రెండు సంవత్సరాల నిషేధం విధించింది. సంబంధింత రెండేళ్ల సమయంలో లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్యులను శాట్‌లో పీడబ్ల్యూసీ సవాలు చేసింది. - కేసును విచారించిన ట్రిబ్యునల్, ఆడిట్ సంస్థ– ప్రైస్‌వాటర్‌హౌస్‌పై సెబీ నిషేధం విధించడం సరికాదని తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. అయితే తప్పు చేసిన ఆడిటర్ల నుంచి రూ.13 కోట్ల ఫీజు వాపసు నిర్ణయాన్ని పాక్షికంగా అనుమతించింది. - ఆడిటర్లపై చర్య తీసుకునే అధికారం కేవలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)కి మాత్రమే ఉందని కూడా శాట్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆడిటింగ్‌లో నిర్లక్ష్యం ప్రాతిపదికనే మోసాలను నిరూపించజాలమని పేర్కొంది. ఆడిట్, ఆడిటింగ్ సేవల నాణ్యత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం సెబీకి లేదని శాట్ తన ఉత్తర్వు్యల్లో తెలిపింది. - ‘‘తప్పు జరక్కుండా ముందస్తు చర్యలు, లేదా తదుపరి చర్యలను మాత్రమే సెబీ తీసుకోగదు. అయితే ఇక్కడ అటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ శిక్ష విధించిన దాఖలాలే కనిపిస్తున్నాయి. ఈ అధికారం సెబీకి లేదు’’ అని శాట్ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. సత్యం కేసు ఇదీ... ఒకప్పటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌లో కోట్లాది రూపాయల మోసం జరిగిన విషయం 2009 జనవరి 8న వెలుగుచూసింది. అప్పటికి కొన్నేళ్లుగా రూ.5,004 కోట్ల మేర ఖాతాల్లో అవకతవకలకు పాల్పడినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు బహిరంగంగా అంగీకరించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచి్చంది. ఈ మోసపూరిత ఆరి్థక కుంభకోణం విలువ దాదాపు రూ.7,800 కోట్లని సెబీ విచారణలో ఉంది. -
సత్యం రామలింగరాజు విడుదల
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో శిక్ష ఖరారై 35 రోజులుగా శిక్ష అనుభవిస్తున్న సత్యం రామలింగరాజు బుధవారం బెయిల్‌పై చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాల్‌కృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణరాజు, సంస్థ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్‌గుప్త, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం కూడా జైలునుంచి విడుదలయ్యారు. బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజుల తర్వాత జైలు అధికారులకు బెయిల్ ఉత్తర్వులు అందాయి. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత జైలు అధికారులకు బెయిల్ ఉత్తర్వులు అందగా.. వెంటనే పని పూర్తిచేసి 6:30 గంటల సమయంలో వారిని జైలు నుంచి విడుదల చేశారు. బెయిల్ ఉత్తర్వులు రావడంలో జాప్యం వల్లే విడుదల ఆలస్యమైందని అధికారులు తెలిపారు. మరోవైపు జైలు నుంచి విడుదలైన రామలింగరాజు మీడియాకంట పడకుండా బయటకువెళ్లేందుకు జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో జైలు లోపల గేటు వరకు మీడియాను అనుమతించే అధికారులు బుధవారం మాత్రం జైలు వెలుపల గేటు వద్దే మీడియాను ఆపేశారు. రామలింగరాజు విడుదల నేపథ్యంలో ఆయన పీఏ చర్లపల్లి జైలు వద్ద హల్చల్ చేశాడు. జైలు ఆవరణలో తిరుగుతూ ఏ వాహనాన్ని లోనికి పంపాలో జైలు సిబ్బందికి సూచిస్తూ హడావుడి చేశాడు. -
సత్యం రామలింగ రాజు రేపు విడుదల
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బీ రామలింగరాజు మరో తొమ్మిదిమంది బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా.. అది ఇంకా జైలు అధికారులకు చేరకపోవడంతో ఆయన విడుదల ఒక రోజు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు చర్లపల్లి సెంట్రల్ జైళ్లో ఉన్నారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో వీరికి ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన నాలుగు వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. దీంతోపాటు బెయిల్ కోసం రామలింగరాజు, రామరాజులు రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, మిగతా 8 మంది దోషులు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
‘సత్యం’ రాజుకు బెయిల్
జైలు శిక్ష అమలును నిలిపివేసిన ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన 4 వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. విచారణను జాప్యం చేసే యత్నం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన నాలుగు వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. దీంతోపాటు బెయిల్ కోసం రామలింగరాజు, రామరాజులు రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, మిగతా 8 మంది దోషులు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెల 9న దోషులకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రామలింగరాజు, రామరాజులకు రూ. 5.75 కోట్లు, మిగతా దోషులకు రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై వారు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టులో అప్పీలు దాఖలు చేయగా.. సోమవారం దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా దోషుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో, సమాజానికి ప్రమాదకరమని భావించే కేసుల్లో మినహా దోషులను అప్పీళ్ల విచారణ సమయంలో జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టం చేసిందని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మదుపుదారులెవరికీ నష్టం జరగలేదని, దోషులు మాత్రమే బాధితులుగా మిగిలిపోయారని చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. అప్పీళ్ల విచారణకు సహకరించాలని, పదేపదే వాయిదాలు కోరరాదని దోషులకు స్పష్టం చేశారు. వారు కోర్టు విచారణలో జాప్యం చేసే ప్రయత్నం చేస్తే బెయిల్ రద్దు చేయాల్సిందిగా సీబీఐ న్యాయస్థానాన్ని కోరవచ్చని పేర్కొన్నారు. -
రామలింగరాజుకు బెయిల్
-
రామలింగరాజుకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : రామలింగరాజుకు ఊరట లభించింది. సత్యం కుంభకోణం కేసులో ఆయనకు న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు మిగతా నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రామలింగరాజు, రామరాజు రూ.లక్ష చొప్పున, మిగతా నిందితులు రూ.50 వేలు పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
రామలింగరాజుకు లైబ్రరీ బాధ్యతలు
హైదరాబాద్ సిటీక్రైం: ‘సత్యం’ కుంభకోణం కేసులో చర్లపల్లి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న రామలింగరాజుకు జైలు అధికారులు గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఆయనతోపాటు జైలులో ఉన్న రామరాజుకు వయోజన విద్య బాధ్యతలను గురువారం అప్పగించారు. ఈ మేరకు జైలు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. -
'ఆ అధికారం మాకు లేదు..హైకోర్టుకు వెళ్లండి'
హైదరాబాద్: సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సత్యం రామలింగరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకల కేసులో ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షను సవాల్ చేస్తూ రామలింగరాజు, ఇతర నిందితులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారు పెట్టుకున్న అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్‌ను సమీక్షించే అధికారం తమకు లేదన్న నాంపల్లి కోర్టు.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. -
'సత్యం' శిక్షను సవాలుచేసిన రామలింగరాజు
-
'సత్యం' శిక్షను సవాలుచేసిన రామలింగరాజు
సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలుచేస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక సీఈవో రామలింగరాజు సోమవారం నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టుకు సమర్పించారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి గత గురువారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
నేడు ‘సత్యం’ కుంభకోణం తీర్పు
6 నెలల క్రితమే వాదనలను పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన కోర్టు సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి తీర్పును ప్రకటిస్తామని, ఆ రోజున నిందితులు వారి తరఫు న్యాయవాదులతో హాజరుకావాలని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులుగా సంస్థ చైర్మన్ రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, సంస్థ వైస్‌ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్ గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం ఉన్నారు. రూ.14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477ఎ (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. కోర్టు మొత్తం 226 మంది సాక్ష్యులను విచారించగా, సీబీఐ సమర్పించిన 3,037 డాక్యుమెంట్లను, నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి ఆర్నెల్ల క్రితమే తుది విచారణను పూర్తి చేసింది. తీర్పును రిజర్వు చేసింది. కాగా సత్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది. ఈ కేసు ముఖ్యాంశాలు.... 2009 జనవరి 7: సత్యం కంప్యూటర్స్‌లో 7,100 కోట్లు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించారు. తాను పులి మీద స్వారీ చేస్తున్నట్లు వెల్లడించారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ షేర్హోల్డర్లకు లేఖ రాశారు. జనవరి 9: రామలింగరాజు మోసం చేశారని నగరానికి చెందిన లీలామంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 9: ఈ కేసులో విచారణ మరింత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. జనవరి 11: రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫిబ్రవరి 14: కేసు విచారణకు సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో మల్టీ డిసిప్లెయినరీ ఇన్వెస్టిగేషన్ టీం (ఎండీఐటీ) ఏర్పాటు. ఏప్రిల్ 7: సీబీఐ కోర్టుకు ప్రధాన చార్జిషీట్‌ను సమర్పించింది.