సత్యం కుంభకోణం కేసులో దోషులకు శుక్రవారం శిక్ష ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రామలింగరాజును దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామలింగరాజు సహా పదిమందిపై నేరం రుజువైంది. మరోవైపు దోషులకు శిక్షలపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాగా ఈ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి 46 పేజల తీర్పును చదివి వినిపించారు. దోషులకు గరిష్టంగా ఏడేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Thu, Apr 9 2015 11:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement