సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీఎంసెట్–2020 ప్రాథమికకీ శనివారం విడుదల చేసినట్లు ఎంసెట్ చైర్మన్, జేఎన్టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్– మెడికల్ విభాగాలకు జరిగిన పరీక్షలకు సంబంధించి మొత్తం 14 పేపర్ల ప్రాథమిక ‘కీ’ రెస్పాన్స్ షీట్లను ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్ సైట్లో పొందుపర్చారు.
ప్రాథమిక కీ లోని అభ్యంతరాలకు సంబంధించి ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్/ఈఎంసీఈటీ’ వెబ్‌సైట్‌లో అభ్యంతరాల స్వీకరణకు నమూనా ఫారం పొందుపరిచారు. కీ పై అభ్యంతరాలు ఉంటే నమూనా ఫారం పూర్తిచేసి ఈ నెల 28 సాయంత్రం 5లోగా ‘ఏపీఈఏఎంసీఈటీ 2020ఓబీజేఈసీటీఐఓఎన్‌ఎస్ ఎట్‌దరేట్ జీమెయిల్.కామ్’ మెయిల్ ఐడీకి పంపించాలి.
ఏపీ ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల
Published Sun, Sep 27 2020 5:04 AM | Last Updated on Sun, Sep 27 2020 5:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment