'ఇడుపులపాయ వెళ్తా, అనుమతించండి' | YS Jagan Mohan reddy files plea in Nampally CBI Court | Sakshi
Sakshi News home page

'ఇడుపులపాయ వెళ్తా, అనుమతించండి'

Published Thu, Sep 26 2013 12:16 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

YS Jagan Mohan reddy files plea in Nampally CBI Court

హైదరాబాద్ : ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఇడుపులపాయ వెళ్లేందుకు, నాలుగో తేదీన గుంటూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు.

తన  తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించేందుకు  అక్టోబర్‌ ఒకటి, రెండు తేదీల్లో అనుమతి ఇవ్వాలని కోర్టును  కోరారు. అలాగే అక్టోబర్‌ 4న  గుంటూరులో రైతులు నిర్వహిస్తున్న ర్యాలీ, సమావేశంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. జగన్‌మోహన్‌ రెడ్డికి జామీను మంజూరు సందర్భంగా ఆయనను హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement